దాడి గోవిందరాజులు నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''దాడి గోవిందరాజులు నాయుడు''' 1909, ఆగష్టు 27న జన్మించారు. ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి, న్యాయవాది, [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు], ఆంధ్ర నాటక సంగీత అకాడమి సభ్యులు.
 
ఆయన విద్యాభ్యాసం [[విజయవాడ]], [[కాకినాడ]], [[మదరాసు]] లలో సాగింది. 1930లో న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకొని 1932లో మచిలీపట్నంలో న్యాయవాదిగా పనిచేశారు. 1941లో జిల్లా మునిసిఫ్ గా నియమితులై జిల్లా న్యాయాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు.
 
మదరాసులో మార్కండేయ (తమిళం)లో మార్కండేయ పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించారు. తరువాత మదరాసులోని ‘షేక్ప్సియర్ అమెచ్చూర్స, విజయవాడ ‘నాట్యగోష్టి‘ నాటక సంస్థలో, ఏలూరు అమెచ్యూర్, బందరు నేషనల్ థియేటర్, హిందూ డ్రమటిక్ కంపెనీ, మొదలైన నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలోనే కాకుండా, [[బళ్లారి రాఘవ]] పక్కన నటించి అందరి మొప్పుపొందారు.