దేవులపల్లి కృష్ణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = {{lang|te|దేవులపల్లి వేoకట కృష్ణశాస్త్రి}} <br> Devulapalli Venkata Krishnasastri
| residence = రామచంద్రపాలెం , పిఠాపురం దగ్గర , తూర్పు గోదావరి జిల్లా
| other_names =
| image =Devulapalli krishnasastry.jpg
| imagesize = 200px
| caption =దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
| birth_name = దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
| birth_date = [[నవంబర్ 1]], [[1897]]
| birth_place = రామచంద్రపాలెం , పిఠాపురం దగ్గర
| native_place =
| death_date = [[ఫిబ్రవరి 24]] [[1980]]
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా పాటల రచయిత
| occupation =పెద్దాపురం మిషన్ హైస్కూల్ లో ఉపాధ్యాయుడు
| title =
పంక్తి 38:
[[బొమ్మ:Telugubook frontcover krishnapakshamu.jpg|right|thumb|250px|కృష్ణపక్షము]]
[[బొమ్మ:Telugubook cover krishnasastry.jpg|right|thumb|250px]]
'''దేవులపల్లి కృష్ణశాస్త్రి''' (Devulapalli Krishna Sastri) ([[1897]]-[[1980]]) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం.
 
‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...దేవులపల్లి కృష్ణశాస్త్రి.
 
==జీవిత విశేషాలు==
దేవులపల్లి కృష్ణశాస్త్రి [[తూర్పు గోదావరి జిల్లా]], [[పిఠాపురం]] దగ్గరలోని [[రామచంద్రపాలెం]] అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో [[1897]] [[నవంబరు 1]]న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు [[కూచి నరసింహం]], [[రఘుపతి వెంకటరత్నం]] గార్లు [[ఆంగ్ల సాహిత్యం]]లో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో [[విజయనగరం]] వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి [[కాకినాడ]] పట్టణం చేరాడు. [[పెద్దాపురం]] మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.
 
 
ఆ కాలంలో [[వ్యావహారిక భాషావాదం]], [[బ్రహ్మసమాజం]] వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదేసమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.
 
 
పంక్తి 52:
 
1929లో విశ్వకవి [[రవీంద్రనాధ టాగూరు]]తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో [[బి.ఎన్.రెడ్డి]] ప్రోత్సాహంతో [[మల్లీశ్వరి]] చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో (1947లో?) [[ఆకాశవాణి]]లో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.
 
దేవులపల్లి కృష్ణశాస్త్రి (Devulapalli Krishna Sastri) -ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితారంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
పంక్తి 69:
* 1976 - [[పద్మ భూషణ్]]
==ప్రముఖుల అభిప్రాయాలు==
* మహాకవి [[శ్రీశ్రీ]] - నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.
* [[విశ్వనాథ సత్యనారాయణ]] - మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.
 
==రచనలు==
* [[కృష్ణ పక్షము]] : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
* ఊర్వశి కావ్యము ,
* అమృతవీణ - 1992 - గేయమాలిక
పంక్తి 98:
===[[మల్లీశ్వరి]] సినిమానుండి===
 
:మనసున మల్లెల మాలలూగెనే -
:కనుల వెన్నెల డొలలూగెనే -
:ఎంత హాయు ఈరేయి నిండెనో -
:ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో -
 
:కొమ్మల గువ్వల సవ్వడి వినినా -
:రెమ్మల గాలుల సవ్వడి వినినా -
:ఆలలు కొలనులొ గలగల మనినా -
:డవుల వేణువు సవ్వడి వినినా -
:నీవు వచ్చెవని నీపిలుపె విని -
:కన్నుల నీరెడి కలయ చూచితిని -
:గడియె యుక విడిచి పోకుమ -
:ఎగసిన హృదయము పగులనీకుమ -
 
:ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో -
:ఎంత హాయు ఈరేయి నిండెనో -
===ఒక దేశభక్తి గీతం---భారత మాత ===
:జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!
పంక్తి 137:
:తారకా మణులలో తారనై మెరసి
:మాయ మయ్యెదను నా మధురగానమున!
:నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? ('''స్వేచ్ఛాగానము''')
 
 
పంక్తి 153:
 
===ప్రసిద్ధి చెందిన సినిమా పాటలు===
* పిలచిన బిగువటరా, -- మనసున మల్లెల మాలలు, --- నోమి నమ్మాల్లాలా --- ఆకాశ వీధిలో హాయిగా --- ఔనా.. నిజమేనా? ---- పరుగులు తీయాలి - [[మల్లీశ్వరి]] (1951)
* సడి సేయకో గాలి - [[రాజ మకుటం]] (1961)
* ప్రతి రాత్రి వసంత రాత్రి - [[ఏకవీర]] (1969)
* రానిక నీకోసం. . సఖీ - [[మాయని మమత]] (1970)
* ఈ గంగ కెంత దిగులు - [[శ్రీరామ పట్టాభిషేకం]] (1978)
* నేటికి మళ్ళి మా ఇంట్లో - [[వాడే వీడు]] (1973)
* ముందు తెలిసినా ప్రభూ --- ఆకులో ఆకునై --- [[మేఘ సందేశం (సినిమా)|మేఘ సందేశం]] (1982)
* ఆరనీకుమా ఈ దీపం - [[కార్తీక దీపం]] (1979)
* గోరింట పూచింది --- ఎలా ఎలా.. దాచావు? - [[గోరింటాకు (సినిమా)|గోరింటాకు]] (1979)
* పగలైతే దొరవేరా ---- మనిషే మారేరా.. రాజా - [[బంగారు పంజరం]] (1969)
* సరిగమపదనిసా..పలికే వారుంటే - [[కళ్యాణ మండపం]] (1971)
* గట్టుకాడ ఎవరో - [[బంగారు పంజరం]] (1969)
* ఒక్క క్షణం ఒక్క క్షణం - [[కలసిన మనసులు]] (1968)
* కుశలమా.. నీకు కుశలమేనా - [[బలిపీఠం (సినిమా)|బలిపీఠం]] (1975)
* చాలులే నిదురపో --- చుక్కలతో చెప్పాలని.. --- అడుగడుగున గుడి ఉంది ---- రావమ్మా మహాలక్ష్మి.. - [[ఉండమ్మా బొట్టు పెడతా]] - (1968)
* మనిషైతే మనసుంటే - [[అమాయకుడు]] (1968)
* నా పేరు బికారి --- ఆకాశ పందిరిలో - [[శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్]] (1976)
పంక్తి 179:
* దూరాన దూరాన తారా దీపం.... - [[మా బంగారక్క]] (1977)
* ఎవరైనా చూశారా? - [[అమ్మ మాట]] (1972)
* కొలువైతివా రంగ సాయి - [[ఆనంద భైరవి]] (1984)
* ఘనా ఘనా సుందరా.. - [[భక్త తుకారాం]] (1973)
* రామా.. ఓ.. రామా - [[రాముడే దేముడు]] (1973)