ధర్మరాజు: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణ
చి Wikipedia python library
పంక్తి 13:
 
 
అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పరియైన [[శకుని]] చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. [[దుశ్శాసనుడు]] పాంచాలిని జుట్టుపట్టి బలవంతంగా సభలోకి ఈడ్చుకొని వచ్చాడు. ద్రౌపదిని వివస్త్రను చయ్యవలసినదిగా దుర్యోధనుడు తమ్ముని అజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయమైన వస్త్రాలను అనుగ్రహిమ్చి ఆమె మానాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పును గ్రహించి, వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య విముక్తుల్ని కావించి, వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు.
 
మరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలిచాడు. ఓడినవాళ్ళు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి అనేది పందెం. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో మళ్ళీ ఓడిపోయాడు. ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.
పంక్తి 22:
== మూలాలు ==
*ధర్మరాజు: డా.కె.జె.కృష్ణమూర్తి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1990, 1999.
 
[[వర్గం:పాండవులు]]
"https://te.wikipedia.org/wiki/ధర్మరాజు" నుండి వెలికితీశారు