నండూరి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = నండూరి రామమోహనరావు
| residence =
| other_names =పాత్రికేయ భీష్ముడు,
| image =Nanduri-rama-mohan-rao.jpg
| imagesize = 200px
| caption = నండూరి రామమోహనరావు
| birth_name = నండూరి రామమోహనరావు
| birth_date = 1927 ఏప్రిల్ 24
| birth_place = కృష్ణాజిల్లా విస్సన్నపేట
| native_place =
| death_date = 2 సెప్టెంబర్ 2011
| death_place = విజయవాడ
| death_cause = మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌
| known = తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు,అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు
| occupation = "జన్మభూమి" పత్రికలో సబెడిటర్
| title =
| salary =
పంక్తి 38:
 
== జీవితం==
నండూరి రామ్మోహనరావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో [[1927]] , [[ఏప్రిల్ 24]] న జన్మించారు.1937-42 మధ్య నూజివీడు, మచిలీపట్నం లలో హైస్కూలు విద్యనభ్యసించారు. రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ‘విజ్ఞానం’ అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 30వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ తరువాత 1947లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, "జన్మభూమి" అన్న పత్రికలో సబెడిటర్ ఉద్యోగంలో చేరారు. 1948-1960 మధ్యలో వివిధ స్థాయుల్లో "[[ఆంధ్రపత్రిక]]"లో పనిచేశారు. 1960-1994 దాకా [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో వివిధ స్థాయుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఆ సమయంలోనే "జ్యోతిచిత్ర", "వనితాజ్యోతి", "బాలజ్యోతి" వంటి పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు.
 
ఆయన జర్నలిస్టు జీవితం ‘ఆంధ్రపత్రిక’లో ప్రారంభమైంది. 1948 నుంచి 1960 వరకు ఆయన ‘ఆంధ్ర పత్రిక’లో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో ‘ఆంధ్రజ్యోతి’లో అడుగు పెట్టారు.1960 నుంచి 1994 దాకా… అంటే 34 సంవత్సరాల కాలం ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో అక్షర యాత్ర చేశారు. ఆయన ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980లో నండూరి రామమోహనరావు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆయన 1962, 1978, 1984, 1992లలో అమెరికాలోను, 1982లో రష్యాలో పర్యటించారు.
 
==అనువాద హనుమంతుడు==
పంక్తి 58:
* విశ్వదర్శనం - పాశ్చాత్య చింతన
* అనుపల్లవి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
* చిరంజీవులు (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
* వ్యాసావళి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
* అక్షరయాత్ర (సాహిత్య, సాహిత్యేతర వ్యాససప్తతి)
* ఉషస్విని (కవితా సంపుటి)
* చిలక చెప్పిన రహస్యం (పిల్లల నవల)
* మయూర కన్య (పిల్లల నవల)
* హరివిల్లు (పిల్లలగేయాలు)
 
పంక్తి 78:
==అవార్డులు==
 
* అభినందన (హైదరాబాదు) సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు (1988).
* జూలూరి నాగరాజారావు (హైదరాబాదు) స్మారక అవార్డు (1989)
* మద్రాసు తెలుగు అకాడెమీ “ఉగాది వెలుగు” అవార్డు (1989)
* కళాసాగర్ (మద్రాసు) అవార్డు
* అభిరుచి (ఒంగోలు) సంస్థ వారి “పాత్రికేయ రత్న” అవార్డు.
* “జమీన్ రైతు” వజ్రోత్సవంలో నెల్లూరి వెంకట్రామానాయుడు స్మారక అవార్డు (1990)
* ఆలూరి నారాయణరావు స్మారక ట్రస్టు (విజయవాడ) వారి సి.వై.చింతామణి అవార్డు
* తెలుగు యూనివర్సిటీ వారి ఆనరరీ డాక్టరేట్ (1991)
* అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి “శిరోమణి” అవార్డు (1992)
* క్రాంతి విద్యా సంస్థల (విజయవాడ) నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1994)
* రామకృష్ణ జైదయాళ్ హార్మొనీ అవార్డు (1994)
* సిద్ధార్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994)
* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1996)
* తెలుగు యూనివర్సిటీ వారి “తాపీ ధర్మారావు స్మారక అవార్డు” (1997)
* అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి “ప్రతిభామూర్తి” అవార్డు (1998)
 
==రిఫరెన్సులు/సంప్రదింపు లంకెలు==
"https://te.wikipedia.org/wiki/నండూరి_రామమోహనరావు" నుండి వెలికితీశారు