నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు''' (Nrisimha, Narasimha, Narahari incarnation)- ఇవన్నీ [[శ్రీమహావిష్ణువు]] నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ [[పురాణములు|పురాణాల]] ప్రకారం [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో [[చతుర్యుగాలు|యుగయుగాన]] అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను [[ఏకవింశతి అవతారములు]] అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను [[దశావతారాలు]] అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. [[మహాలక్ష్మి]]ని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.
 
స్వామి ప్రార్ధనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం:
[[బొమ్మ:Srilakshminarasimha.JPG|250px|right|thumb|విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.]]
::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
పంక్తి 19:
* భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి.
* సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉండటం) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది.
* హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు, అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా, మరొక ఉపాయం సాధ్యమయ్యింది. చివరకు రాక్షస వధ తప్పలేదు.
* భగవంతుడు సగం మనిషి, సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు.
 
పంక్తి 26:
 
* తెలుగునాట నృసింహాలయాలు మిక్కిలిగా ఉన్నాయి. ముఖ్యంగా [[యాదగిరిగుట్ట]], [[మంగళగిరి]], [[ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)]], [[సింహాచలం]], [[అహోబిలం]] వంటి ఆలయాలు ప్రసిద్ధం. [[వెంకటేశ్వర స్వామి]], [[నరసింహ స్వామి]] (ఇద్దరూ ఒకరే) తెలుగునాట ఎన్నో ఇండ్లలో కులదైవాలు.
* [[సంస్కృతం]]లో [[వేదవ్యాసుడు]] రచించిన [[భాగవతం|భాగవతాన్ని]] బమ్మెర [[పోతన]] మృదుమధురంగా తెనిగించాడు. అందులో నృసింహావతారానికి సంబంధించిన పద్యాలు తెలుగునాట బహు ప్రాచుర్యాన్ని పొందాయి. (పోతన రచనలోని భాగాలను ఈ వ్యాసంలో విరివిగా వాడడం జరిగింది.)
 
==అవతార గాధ==
 
===జయ విజయుల శాపవృత్తాంతము===
జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు [[సనకసనందాదులు|సనకసనందనాది]] మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.
 
ఆ జయవిజయులే [[కృత యుగము|కృతయుగం]]లో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, [[త్రేతా యుగము|త్రేతాయుగం]]లో రావణ కుంభకర్ణులుగాను, [[ద్వాపర యుగము|ద్వాపరయుగం]]లో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.
 
===హిరణ్యాక్షుడు===
పంక్తి 42:
 
 
ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపసులను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు.
 
===ప్రహ్లాదుడు===
పంక్తి 49:
 
 
ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు.
<poem>
::చదవనివాడజ్ఞుండగు
పంక్తి 66:
:నిర్మల మందాకినీ వీచికల దూగు
::రాయంచ చనునె తరంగిణులకు?
:లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
::కోయిల సేరునే కుటజములకు?
 
పంక్తి 83:
 
 
మరి ఆ మర్మమమేమిటి? "తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ [[నవవిధభక్తులు|తొమ్మిది భక్తిమార్గంబుల]] సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రము. శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి." - అని వివరించాడు.
 
===ఏడీ విష్ణువు?===
పంక్తి 94:
:గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
:గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
:గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? - అన్నాడు బాలుడు.
ఇంకా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు.
 
:హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స
పంక్తి 104:
 
 
అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.
 
===శ్రీ నరసింహావిర్భావం===
పంక్తి 114:
ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.
 
ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.
 
===భక్త పాలన===
పంక్తి 121:
 
 
మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.
 
 
"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. "నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి.
 
[[శివుడు|శంకరుడు]], బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యమునిగురించిన భయముండదు" అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.
 
ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.
పంక్తి 147:
* [[కదిరి]] శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
* శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, [[యాదగిరిగుట్ట]].
* శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, [[సింహాచలం]].
* శ్రీ కనకవల్లి భూతనరసింహుల ఆలయం, [[ఐ.ఎస్‌.జగన్నాధపురం]]
* శ్రీ పానకాల నరసింహ స్వామి, [[మంగళగిరి]]
పంక్తి 171:
* [[దేవరాయనదుర్గ]], [[కర్ణాటక]]
* [[వెల్చాల్ నరసింహస్వామి గుడి]]
* [[కొరగుట్ట నరసింహ స్వామి దేవస్థానము-నరసింహుల గూడెం, ]][[వరంగల్ జిల్లా ,ఆంధ్రప్రదేశ్]]
* [[ఛీర్యాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము]], [[ఛీర్యాల, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా]]
* [[శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము]], [[పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్.]]
పంక్తి 184:
==విశేషాలు==
* ప్రత్యేకించి ఆరోగ్యంకోసం నరసింహ స్వామిని ఆరాధించడం ఒక ఆచారం.
* నరసింహాలయాలు ఉన్న కొండలను "వేదాద్రి" అని పిలవడం చాలాచోట్ల జరుగుతుంది.
* [[మంత్రాలయం]] [[శ్రీరాఘవేంద్రస్వామి]] ప్రహ్లాదుని అవతారమని కథ, భక్తుల విశ్వాసం
* తెలుగునాట బాగా ప్రసిద్ధి చెందిన పౌరాణిక నాటకాలలో "భక్త ప్రహ్లాద" ఒకటి. "భక్త ప్రహ్లాద" వంటి నాటకాలు వేసేప్పుడు నరసింహపాత్రధారిగా కాస్త చిన్న బాలుడిని తీసుకొంటారు (స్తంభంలో పట్టడానికి అనువుగా). నరసింహావిర్భావం సీనులో స్తంభం చీలి (ఉగ్రమూర్తిగా)స్వామి (పాత్రధారి) బయటకు రాగానే శాంతింపజేయడానికి [[కొబ్బరి]]కాయ కొట్టి హారతి ఇవ్వడం ఆనవాయితీ.
*[[తెలంగాణా]]లో [[యాదగిరిగుట్ట]] చుట్టుప్రక్కల జిల్లాలలో "యాదగిరి" అనేది సర్వ సాధారణమైన పేరు. అలాగే [[ఉత్తరాంధ్ర]] ప్రాంతంలో (అప్పల నరసింహస్వామి పేరుమీద) అప్పారావు, అప్పలరాజు, అప్పలసామి, అప్పలమ్మ, నరసరాజు, నరసమ్మ వంటివి సాధారణమైన పేర్లు. [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]] జిల్లాలలో (పానకాల నరసింహస్వామి పేరుమీద) పానకాలు పేరు పెట్టుకొంటారు. అలాగే నరసింహ, సింహ, నరహరి వంటి పదాలతో కూడిన పేర్లు అతిసాధారణం.
* [[అన్నమయ్య]] కీర్తనలలో శ్రీవేంకటేశ్వరుని రూపాన్ని స్తుతించేవి అధికాధికం. తరువాత శ్రీనారసింహుని స్తుతించే కీర్తనలు కూడా చాలా ఉన్నాయి.
* [[తెలుగు సినిమా]] పేర్లలో కూడా "సింహ" బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ([[సమరసింహారెడ్డి]], [[నరసింహనాయుడు]], [[సింహాద్రి]], [[లక్ష్మీనరసింహా]], [[నరసింహుడు]] .. )
* [[చెంచులక్ష్మి]] సినిమాలో నృసింహావతారం ఉత్తరభాగంగా చెప్పబడే కథ ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/నరసింహావతారం" నుండి వెలికితీశారు