నహుషుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''నహుషుడు''' ([[సంస్కృతం]]: नहुष) [[చంద్ర వంశం]]లో జన్మించిన రాజు. ఇతఁడు చంద్రవంశస్థుఁడు అగు ఆయువునకు స్వర్భానవియందు పుట్టినవాఁడు. పురూరవుని పౌత్రుఁడు. ఇతడు [[ప్రభ]] - [[ఆయువు]]ల పుత్రుడు.ఈతని భార్య ప్రియంవద. [[ప్రియంవద]] ద్వారా [[యతి]], [[యయాతి]], [[సంయాతి]], [[యాయాతి]], [[ధ్రువుడు|ధ్రువులనే]] పుత్రులను కన్నతండ్రి. నహుషుడు రాజ్యపాలన చేస్తూ నూరు [[యాగాలు]] చేశాడు.(శ్రీమద్భాగవతమునందును, విష్ణుపురాణమునందును నహుషుని కొడుకులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆఱుగురు చెప్పఁబడి ఉన్నారు)
 
[[దేవేంద్రుడు]] స్వర్గానికి అధిపతి. ఒకసారి ఇంద్రుడు [[వృత్రాసురుడు|వృత్రాసురుణ్ణి]] సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యాదోషం పట్టుకుంది. తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడన్ననుకొని ఆచూకి తెలియని సరస్సులో తామరతూడులో దాగున్నాడు. అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని అలోచించి మునులతో సంప్రదించి నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా దేవతలు నహుషుని స్వర్గాధిపతిని చేశారు. పదవి లభించగానే గర్వాంధుడై [[శచీదేవి]]ని కోరుకుంటాడు. ఆమె [[విష్ణు]]ముర్తిని వేడుకొనగా, ఆతని సలహా మేరకు నహుషున్ని తనవద్దకు [[సప్తర్షులు]] పల్లకీ మోయగా రమ్మని కోరుతుంది. తప్పని పరిస్థితిలో పల్లకీ మోస్తున్న సప్తర్షులలో [[అగస్త్య మహర్షి]]ని నషుషుడు కాలితో తంతాడు. అందుకు ముని నహుషున్ని పదివేల సంవత్సరాలు [[సర్పం]]గా పడివుండమని శపిస్తాడు. అగస్త్యున్ని క్షమించమని కోరగా ఎవరయితే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆనాడే నీకు శాపవిముక్తి అని చెబుతారు. ఆనాటి నుండి నహుషుడు సర్పరూపంలో [[ద్వైతవనం]]లో తిరుగుతున్నాడు.
"https://te.wikipedia.org/wiki/నహుషుడు" నుండి వెలికితీశారు