నాగకేసరి నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 24:
కాయలు పళ్ళగా మారడం చెట్లు పెరుగుప్రదేశాన్ని బట్టి మారును.బెంగాల్ లో జూలైనెల మధ్యనుండి సెప్టెంబరు వరకు,అస్సాంలో మే-జులైలో,వ్యానడ్(కేరళ)లో డెసెంబరు-జనువరిలో,ట్రావెన్‍కూర్(కేరళ)లోఅక్టొబరు-మార్చి నెలలలో పళ్ళు వచ్చును.పళ్లు ఎర్రగా,దీర్ఘ అండాకారంగా,గుండ్రంగా వుండును.3"(అంగుళాలు)వ్యాసం కల్గివుండును.ఒక్కో పండు 50-60 గ్రాములు వుండును.పెలుసైన గట్టి పెంకును కలిగివుండును.ఒక పండులో 2-3 గింజలుందును.పై పెంకులో పీచు(Fibre)భాగం 50% వరకుండును.గింజలో విత్తనం(kernel)35% వరకుండును.గింజ పెంకులోపలి విత్తనం పసుపు రంగులో గుండ్రంగా వుండును<ref name="seed"/>.
===నూనెను తీయుట===
సాధారణంగా పండి నేల రాలిన పళ్ళను సేకరించడం జరుగుతుంది.సేకరించిన పళ్లను దుడ్డుకర్రవంటి వాటితో బాది/నలగకొట్టి పళ్ళనుండి నూనె గింజలను వేరుచేయుదురు.సేకరించిన నూనె గింజలు పచ్చిగా వుండి తేమశాతం అధికంగా వుండును.నూనెగింజలను కళ్లంలో ఆరబెట్టిన 50% వరకు బరువు తగ్గును.నిల్వ వుంచునప్పుడు చీడపీడలు ఆశించకుండుటకై 0.1% అల్‍డ్రెక్సు(Aldrex)ను నేలమీద చల్లెదరు.ఆతరువాత0.1%(నిల్వవుంచిన గింజల పరిమాణంలో)హెక్షడొల్(hexadol)ను గుంజలపై తరచుగా పిచికారి చేయుచుందురు.గింజలపైనున్న పెంకు(shell)ను పొట్టుతొలగించు యంత్రాల (Decorticators)ద్వారా తొలగించి,విత్తనాలను నూనెతీయు యంత్రాలలో(expellers)ఆడించి నూనెను తీయుదురు.నూనె బాగా దిగుబడిరావటానికి విత్తనాలకు చిట్టూ(హల్లరు తవుడు)ను కలిపి యంత్రాలలో ఆడించెదరు.కేకులో మిగిలివున్న నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ ద్వారా తీయుదురు.
===నూనె లక్షణాలు===
నూనె గింజలో(seed) నూనెశాతం 40-45% వరకుండును.పైపెంకును తొలగించిన తరువాత విత్తనం(kernel)లో60-77% వరకుండును.నూనె చిక్కగా వుండును.స్నిగ్ధత అధికం.నూనె ఎరుపుగా లేదా ముదురు బ్రౌన్ రంగులో వుండును.చేదురుచి కలిగి,వికారంపుట్టించే వాసన వుండును.ఈ నూనె ఆహరయోగ్యంకాదు.పారిశ్రామిక రంగంలో ఇతర ప్రయోజనాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/నాగకేసరి_నూనె" నుండి వెలికితీశారు