నాజర్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: చరవాణి సవరింపు
చి Wikipedia python library
పంక్తి 3:
ఆయన స్వగ్రామం తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం. నాన్న పేరు మహబూబ్ బాషా. అమ్మ పేరు ముంతాజ్ బేగం. నాన్నది నగలకు మెరుగుపెట్టే వృత్తి. నాజర్ కు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. 1977 లో అవకాశాల కోసం మద్రాసుకు వచ్చి తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేశాడు. అక్కడ నుంచే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.
 
అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ (1993 ), మణిరత్నం బాంబే (1995), శంకర్ జీన్స్ (1998), త్రివిక్రం శ్రీనివాస్ అతడు (2005 ) చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. [[చంటి]] సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ఆయనకు తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టం. ''మైదానం'' నవల ఆయనకు ఎంతో ఇష్టం.
 
ఆయన భార్య పేరు కమిలా నాజర్. ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు. నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్.
"https://te.wikipedia.org/wiki/నాజర్_(నటుడు)" నుండి వెలికితీశారు