"నేదునూరి కృష్ణమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
| spouse =
}}
'''నేదునూరి కృష్ణమూర్తి''' ప్రముఖ [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, [[సంగీత కళానిధి]],
==బాల్యం==
'''నేదునూరి కృష్ణమూర్తి''' [[అక్టోబరు 10]], [[1927]] న [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[కొత్తపల్లె (తూర్పుగోదావరి)|కొత్తపల్లి]] గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నవారు. వీరి తండ్రి పిఠాపురం రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు. నేదునూరి 1940 లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్‌, గాత్రంలో ప్రాధమిక శిక్షణ పొందారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు శిష్యుడిగా ఉన్నారు. 1945 నుంచి సంగీత సభలలో పాల్గొంటూ వచ్చారు. 1949లో ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి పద్మభూషణ్‌ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి గారి వద్ద చేసి సంగీతంలో గమకాలు, ఇతర మెళకువలలో శిక్షణ పొంది, సంగీత నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. ఆల్‌ ఇండియా రేడియోలో అగ్రగణ్య కళాకారుడిగా వెలుగులోకి వచ్చారు. 1951 నుండి ఐదు దశాబ్దాలకు పైగా మద్రాసు సంగీత అకాడమీలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు.
 
ఉచితంగా ఏం నేర్చుకో గలిగితే అది నేర్చుకో అని ఆయన తండ్రి ప్రాధేయపడ్డారు. ఎందుకు అని విశ్లేషించ లేదు. అసలు సంగతి తెలుసు కనక. హిందీ, సంస్కృతం నేర్చుకున్నారు. సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. అందుకు తల్లి ప్రభావం ఉంది అని అంటారు. అష్టపదులు, తరంగాలు, రామాయణ కృతులు పాడారు. చిన్నతనంలో నేదునూరి గ్రామంలో పెరిగేరు. విద్వాన్‌ అప్పారావు వద్ద వర్ణాలు నేర్చుకున్నారు. అష్టపదులు, తరంగాలు కల్లూరి వేణుగోపాల రావు గారి వద్ద నేర్చుకున్నారు. ఓ సారి వేణుగోపాలరావు గారి ఇంటికి విజయనగరం తహసిల్దారు విచ్చేసినప్పుడు నేదునూరి హత్తుకొనే పాట విని ప్రసన్నులైయ్యారు. అప్పల నరసింహం పుణ్యమా అని విజయనగరం మహరాజా కాలేజీలో చేరడం జరిగింది. ఉండేందుకు ఉచిత బస ఏర్పరచారు, భోజన వసతి కల్పించారు. ఇంక నేదునూరివారు వెనుదిరిగి చూడలేదు.
సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాయించుకున్నారు.సంగీత అకాడమీలో యాబై యేళ్ళకు పైగా పాడారు. తన సుదీర్ఘ సంగీత యాత్రలో అనేక సంగీత కోవిదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ద్వారం వెంకట స్వామి నాయుడు దగ్గరనుంచి, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి, లాల్గుడి జయరామన్‌, ఎం ఎస్‌ సుబ్బులక్ష్మి, పేరి శ్రీరామమూర్తి (వయొలిన్‌), వెంకటరమణ (మృదంగం), నేమాని సోమయాజులు (ఘటం) ఇత్యాదులు నేదునూరి ప్రతిభను కొనియాడేవారు. నేదునూరి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందారు.
==విభిన్న పదవులు==
నేదునూరి విజయవాడ జీ వీ ఆర్‌ ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల, ప్రధాన అధ్యాపకుడిగా, సికింద్రాబాద్‌, విజయనగరం, తిరుపతి సంగీత కళాశాలలో పనిచేసారు. వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో ఆర్ట్‌‌స విభాగం డీన్‌ , బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, ఆల్‌ ఇండియా రేడియో, సంగీత విభాగ ఆడిషన్‌ (ఆడిషన్‌) బోర్డ్‌ సభ్యుడిగా పనిచేసారు. 1985లో ప్రభుత్వ కొలువు నుంచి రిటైర్‌ అయ్యి ఉపకార వేతనం తీసుకుంటున్నారు. కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ అచార్యుడిగా ఉన్నారు.
 
==సంగీత సౌరభం==
==బయటి లింకులు==
{{మూలాలజాబితా}}
* [http://www.musicindiaonline.com/music/carnatic_vocal/s/artist.20 some music samples from musicindiaonline.com]
* [http://www.hindu.com/2006/10/30/stories/2006103013640200.htm ''Senior musicians honour Nedunuri Krishnamurthy'', The Hindu, October 30, 2006]
* [http://www.hinduonnet.com/thehindu/fr/2003/10/10/stories/2003101001621300.htm ''Music is in his genes'', The Hindu, October 10, 2003]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1190500" నుండి వెలికితీశారు