పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:Paravasthu_Chinnayya_Suri.jpg|thumb|right|పరవస్తు చిన్నయసూరి]]
 
'''పరవస్తు చిన్నయ సూరి''' ([[1809]]-[[1861]]) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన [[బాలవ్యాకరణం]], [[నీతిచంద్రిక]] చాలా ప్రసిద్ధి గాంచాయి. ''పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ'' అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్|బ్రౌను]] దొర, [[గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి]], జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన [[బహుజనపల్లి సీతారామాచార్యులు]], ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే.
 
== బాల్యం ==
చిన్నయ సూరి [[తమిళనాడు]]లోని [[చెంగల్‌పట్టు]] జిల్లాలోని [[పెరంబుదూరు]]లో జన్మించాడు. వారిది సాతాని శ్రీవైష్ణవుల కుటుంబం. ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసాంబ, వేంకటరంగయ్య. జన్మనామం చిన్నయ. చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర [[ఆంధ్రప్రదేశ్]] నుండి [[మద్రాసు]] వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ [[1809]] (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన [[1806]]లో జన్మించాడని భావిస్తున్నారు.
 
చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన [[శ్రీపెరంబుదూరు]]లోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన [[1836]]లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.