పళని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{వ్యాఖ్య|ఆరు పడై వీడు – పళని దండాయుధ పాణి స్వామి<br />పార్వతి నందనా...సుబ్రహ్మణ్యా|}}
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది [[పళని]]. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, [[మధురై]] నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ [[సుబ్రహ్మణ్య స్వామి]] వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.<ref>[http://palani.org/index.htm ఆలయ వెబ్‌సైట్]</ref> ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.
[[File:Palani Montage.png|thumb|450px|right|పళని కొండ పై సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము మరియు పట్టణ వీక్షణము]]
==దండాయుధ పాణి ==
ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత [[కావిడి]] ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.
 
==ఆలయ గర్భ గుడి గోపురం==
పంక్తి 29:
ఇంకొక విషయం ఏమిటంటే, పళని లో కొండ పైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా, రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభై రూపాయలు. ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)
==పళని క్షేత్ర స్థల పురాణము==
పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని, పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే, అప్పుడు పెద్దవాడు, వినాయకుడు యుక్తితో ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తాడు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని, వినాయకుడు “తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే.
 
కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్న వాడు కదండీ, దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండీ, అందులోనూ చిన్న వాడు, శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత, గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా, శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.
పంక్తి 46:
 
అప్పుడు వేడుకుంటాడు “ఈశ్వరా తెలుసుకోలేక పోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి” అన్నాడు. ఏమిటో అడుగు అన్నాడు స్వామి.
ఇడుంబుడు అన్నాడు, “స్వామీ, నేను ఈ పళనిలోనే కదా, కావిడి ఎత్తలేకపోయాను, ఈ కావిడి వల్లనే కదా, మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది, అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధనా చెయ్యకపోయినా, ఒక్క సారి కావిడి పాలతో కాని, విభూతితో కాని, పూలతో కాని, తేనెతో కాని, నేతితో కాని భుజం మీద పెట్టుకుని, మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే, అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన, శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో, అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసెయ్యాలి” అన్నాడు ఇడుంబుడు.
 
స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి, ఇక పైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చాడు.
పంక్తి 52:
==సుబ్రహ్మణ్య కావడిలు==
 
అప్పటి నుంచి, తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి, సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు.
అంతే కాక, ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే, భక్తితో, పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్తారు.
 
"https://te.wikipedia.org/wiki/పళని" నుండి వెలికితీశారు