పాణిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
[[సంస్కృతం|సంస్కృత]] భాష యొక్క [[వ్యాకరణం|వ్యాకరణాన్ని]] మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి [[పాణిని]]. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంధం ‘’[[అష్టాధ్యాయి]]’’. ఇది ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణం గా గుర్తింపు పొందింది. ఈయనకు పాణిన, దాక్షీ పుత్రా, శానంకి, శాలా తురీయ, ఆహిక, పాణి నేయ పణి పుత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి. అష్టాధ్యాయి రాసిన వాడు అష్టనామాలతో విలసిల్లాడు. ఈయన ముఖ్యశిష్యులలో [[కౌత్సుడు]] ఉన్నాడు. శిష్యులలో పూర్వ పాణీయులని, అపరపాణీయులని రెండు రకాలున్నారు. శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బోధించాడు. వెయ్యి శ్లోకాలతో అష్టాధ్యాయి శోభిస్తుంది. ఆయన ప్రతిభకు జై కొట్టని పాశ్చాత్య యాత్రికుడు లేడు. పాణినీయం లో మూడు రకాల పతక భేదాలున్నాయి. ధాతు పాఠం, గుణ పాఠం ఉపాది పాఠం లో ఇవి బాగా కని పిస్తాయి. పాణిని వ్యాకరణానికి కూడా అష్టాధ్యాయి, అష్టకం, శబ్దాను శాసనం, వృత్తి సూత్రం, అష్టికా అని అయిదు పేర్లున్నాయి. వీటిలో అష్టాధ్యాయి పేరే ప్రసిద్ధమైంది.
 
 
==జనన కాలం ==
 
పాణిని ప్రస్తుత [[పాకిస్తాను]] లోని పంజాబు ప్రాంతం వాడు. ఇతని కాలం పై భిన్నాభి ప్రాయాలున్నాయి కాని అందరు అంగీకరించింది క్రీ పూ.2,900. ఆయన వ్యాకరణ శాస్త్ర వేత్త మాత్రమె కాదు ,సమస్త ప్రాచీన వాజ్మయం, భూగోళం, ఆచార వ్యవహారాలూ ,రాజకీయం, వాణిజ్యం , ఇతర లౌకిక విషయాలు అన్నీ ఆయన కు ''చేతిలోని ఉసిరి యే ''. పాణినీయం లో ఒక్క అక్షరం కూడా వ్యర్ధమైనది లేదు అని పతంజలి తన భాష్యం లో చెప్పాడు.
 
== బాల్యం ==
పంక్తి 16:
పాణిని సూత్రాలకు ఎందరో మహా పండితులు వార్తికాలు రాశారు అందులో పతంజలి పేర్కొన్న వారు కాత్యాయనుడు, భారద్వాజుడు, సునాగుడు, క్రోస్ట, బాడవుడు అనే అయిదుగురు ముఖ్యులు. వృత్తి అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవృత్తి అని అర్ధం. వార్తికం అంటే వృత్తికి వ్యాఖ్యానం. వార్తిక కారుడికే వాక్య కారుడు అనీ పేరుంది. వార్తికాలు లేక పోతే అష్టాధ్యాయి అసంపూర్ణం అయ్యేది. ఇవి వచ్చి నిండుదనాన్ని తెచ్చాయి. ఇందులో కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొందింది. కాత్యాయనుడికే వరరుచి, మేధాజిత్, పునర్వసు, కాత్యుడు అనే పేర్లున్నాయి. పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు. దక్షిణ దేశం వాడు. ఈ విషయాన్ని ఒక సూత్రం లో [[పతంజలి]] ప్రకటించాడు. పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని ''మహా భాష్యం'' అంటారు. దీనికే ''పద'' అనే పేరు కూడా ఉంది. సూత్రం లో వార్తికం లో అభిప్రాయ భేదం వస్తే ''పాతంజలీయం'' మాత్రమే ప్రమాణం. మహా భాష్యం పై ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి. అందులో [[భర్తృహరి]] రాసినది ప్రాచీన మైనది.
 
అష్టాధ్యాయి పై అనేక వృత్తులు వచ్చాయి. పాణిని మేన మామ ''వ్యాడి'' అనే ఆయన వ్యాడి సంగ్రహం అనే పేర వృత్తి రాశాడు. విక్రమార్కుని ఆస్థానం లో ఉన్న వరరుచి ఇంకో వృత్తి రాశాడు. జయాదిత్యుడు, వామనుడు కలిసి రాసిన వృత్తికి ''కాశికా వ్రుత్తి'' అని పేరు. ఇదీ గొప్ప పేరు పొందినదే. వీరిద్దరూ కాశీ లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది. అతి ప్రధాన వృత్తిగా కాశికా వ్రుత్తి కి పేరుంది. దీని తర్వాత చెప్పుకో తగ్గది భర్తృహరి’ అనే పేరు తో పిలువ బడే ఎనిమిదో శతాబ్దానికి చెందిన బౌద్ధ పండితుడు విమల మతి రాసిన భాగ వ్రుత్తి. 16 వ శతాబ్దం వాడైన అప్పయ్య దీక్షితులు సూత్ర ప్రకాశిక అనే వ్రుత్తి రాశాడు. [[దయానంద సరస్వతి]] అస్టాధ్యాయీ భాష్యం అనే ప్రసిద్ధ గ్రంధం రాసి సుసంపన్నం చేశాడు.
 
పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు. అందులో కాతంత్ర కారుడు, చంద్ర గోమి, క్షపణకుడు, దేవా నంది, వామనుడు, అకలంక భట్టు, పాల్య కీర్తి, శివ స్వామి భోజ రాజు, బోపదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు. ఇందరు రాసినా పాణినీయం కు ఉన్న గొప్ప తనం దేనికీ రాలేదు.
 
 
పంక్తి 25:
== రచనలు ==
 
తనకు ముందున్న వ్యాకరణ శాస్త్ర వేత్తల మార్గం లో నడుస్తూ, బుద్ధి కుశలత తో కొత్త సంవిధానాలను కనిపెట్టాడు పాణిని. బోధనలో సౌకర్యం కోసం వృత్తి కూడా రాశాడంటారు .శబ్ద ఉచ్చారణ కోసం సూత్రాలతో ఒక శిక్షా గ్రందాన్నీ రాశాడు .ఇది కాల గర్భం లో కలిసి పొతే [[స్వామి దయానంద సరస్వతి]] మొదలైన వారు ప్రాచీన గ్రంధాలను ఆధారం గా చేసుకొని ఉద్దరించారు .ఇందులో ఎనిమిది ప్రకరణ లున్నాయి. పాణిని ‘’జాంబవతీ పరిణయం ‘’అనే మహా కావ్యాన్ని కూడా రాశాడు .’’ద్విరూప కోశంఅనే చిన్న పుస్తకం ,’’పూర్వ పాణినీయం ‘’పేరు తో 24సూత్రాల గ్రంధమూ రాశాడు. అష్టాధ్యాయి లో శివ సూత్రాలలో ధ్వనుల పుట్టుక ఉచ్చారణ విధానం సూత్రా బద్ధం చేశాడు. ధాతు పాఠం లో క్రియల మూలాల గురించి వివరించాడు .
 
== అష్టాధ్యాయి ==
పంక్తి 33:
== మరణం ==
 
ఒక సింహం ఇతని మీదికి దూకి చంపేసింది అని కథనం. ఏ సంవత్సరం ఏ నెల ఏ పక్షం లో మరణించాడో తెలీదు కానీ మరణించిన తిథి మాత్రం త్రయోదశి. అందుకే అది ''పాణినీయ అనధ్యాపక దినం'' గా తర తరాలుగా వస్తోంది. అంటే త్రయోదశి నాడు గురువు శిష్యుడికి పాఠం చెప్పడు.
 
భారత ప్రభుత్వం 2004 వ సంవత్సరం లో పాణిని గౌరవార్ధం ఒక పోస్టల్ స్టాంపు ని విడుదల చేసింది. [[కాశీ]] లో పాణిని జన్మ స్థలం నుండి తెచ్చిన మట్టితో కట్టిన పాణిని దేవాలయం కలదు.
"https://te.wikipedia.org/wiki/పాణిని" నుండి వెలికితీశారు