పాల్కురికి సోమనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''పాల్కురికి సోమనాధుడు''' (1160 - 1240), [[శివకవి యుగం|శివకవి యుగానికి]] చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య బ్రాహ్మణ కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు [[మల్లికార్జున పండితారాధ్యుడు]], [[నన్నెచోడుడు]].
 
పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. [[వీరశైవం]] వ్యాప్తికి కృషి చేశాడు. శివుని [[ప్రమధ గణాలు|ప్రమధ గణాలలో]] "భృంగి" అవతారమని వీరశైవ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. అప్పటి ఇతర బ్రాహ్మణ శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.
 
సోమనాథుడు [[వరంగల్లు]] సమీపంలోని [[పాల్కురికి]] గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మతం మీద అనురాగంతో ఆ మత దీక్ష తీసుకున్నాడు. ఇతడు గురువు [[కట్టకూరి పోతిదేవర]] వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. వీరశైవ దీక్షను తీసుకున్న వారిని వీర మహేశ్వర వ్రతులంటారు. వారికి కులగోత్రాల పట్టింపు ఉండదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కులాన్ని వదలి శివపార్వతులనే తల్లిదండ్రులుగా భావిస్తారు. వీరు జంగమ దేవరలుగా పరిగణింపబడతారు.