పులి వేషం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 21:
==డప్పుల హంగు==
 
పెద్ద పులి ప్రవేశానికి హంగుగా రెండు డప్పులు గంభీర ధ్వనులు చేస్తూ వుంటే, ఆ ధ్వనులతో ఉత్తేజం పొందిన పులి వేష ధారి, హుందా అయిన పులి నడకలతో గంభీరపు చూపులతో వాయిద్యానికి తగినట్లు నృత్యం చేస్తూ చికు చిక్కు చిక్కు చికు చిక్కు అంటూ ఎగిరి పల్టీలు కొడుతూ ఉధృత వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పిల్ల జంతువులను వేటాడినట్లు ఆకలి గొన్న పులి లాగా వివిధ చేష్టలు చేస్తూ, పొంచి వుండి ఆమాంతం ఏ మేక పిల్లనో నోటితో కరచి పట్టి నట్లు నటిస్తారు. ఒక్కొక్క సారి ఇరువురు పులి వేషాలను ధరించి ఎదురు బొదురుగా నిలబడి రెండు పులులూ పోట్లాడు కుంటున్నట్లు వాయిద్యాల ధ్వనులతో భయంకరంగా పోట్లాడుతూ ఎగిరి గంతులు వేస్తూ, తొడగొట్టి అరుపులతో, కేకలతో నానా హంగామా చేస్తారు. ఈ నృత్యంలో పెద్దపులి - వేటగాడు అనె రెండు పాత్రలు ప్రవేశిస్తాయి. వేట గాడు పులిని చంపాలనే, ఎత్తులతో పులి వేషాన్ని కవ్విస్తూ వివిధ వాయిద్య గతుల్లో అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ బరిసెతో పులిని చంపడానికి ఎగిరి గంతేస్తాడు. తప్పించు కోవడానికి పులి వేష ధారి ఎగిరి పల్టీలు కొడుతాడు. ఇలా రెండు పాత్రలూ ప్రజలకు ఉత్తేజం కలిగిస్తూ చివరికి పులిని వధించి నట్లు కొందరు చూపుతారు. చని పోయేముందు పులి, వేటగాని మీదకు లంఘించి అతని గాయ పరిచినట్లు చూపుతారు.
 
==అడవిలో పులి:==
 
మరి కొందరు ఒక [[రెండెడ్ల బండి]] మీద కొమ్మలు, ఆకులు, వగైరాలతో అడవిలా అమరుస్తారు. ఆ బండి మీద అడవి మధ్య పులి వేషం పచార్లు చేస్తూ బండి మీద కలియ దిరుగుతూ వుంటుంది. నేల మీద వేటగాడు పులిని కొట్టాలని, తప్పించు కోలాలని పులి, చివరకు దెబ్బతిన్న పులి వేటగాని మీదకు ఉరకబోయినట్లు విలయ తాండవం చేసి చని పోయి నట్లు నటిస్తారు. పులి నృత్యానికి హంగుగా వున్న డప్పు వాయిద్య కాండ్రు కాళ్ళకు గజ్జలు కట్టి, పులి నృత్యానికి అనుగుణంగా వెఱ్ఱి ఆవేశంతో నృత్యం చేస్తారు. బహిరంగ పరదేశంలో జరిగే ఈ పులి నృత్య ప్రదర్శనానికి ఊరు ఊరంతా కదలి వస్తారు. ప్రేక్షకుల్ని చూచిన కొద్దీ పులి వేష గాళ్ళు ఉత్తేజంగా అడుగులు వేస్తూ వుంటే ప్రేక్షకుల్లో కొందరు, ఈలలతో చప్పట్లతో, కేకలతో హుషారు చేస్తారు. పులి వేషధారి అప్పుడప్పుడు చుట్టు మూగి విన్న పిల్లల్ని భయపెడుతూ వుంటాడు. పులి వేషధారి నృత్యం చేసే టప్పుడు రెండు చేతుల్లోనూ రెండు నిమ్మకాయలను పుంచు కుంటూ, నిమ్మరసం మింగి తన దాహాన్ని, అదుపులో పెట్టుకుంటాడు.
 
పులి వేష ధారి ఎండలో నృత్యం చేసే టప్పుడు తాన వంటికి పూసుకున్న వార్నీషు రంగులు బిర్రున బిగదీస్తాయి. చర్మం మంట పుడుతుంది. ఉపశమనంగా కడవలతో నీళ్ళు పోసుకుని తాపాన్ని పోగొట్టుకుంటాడు. వేషం ధరిస్తే వారం రోజులు అలాగే వుంచుకుంటాడు. ఈ పులి వేషాన్ని మంచి చిత్రకారులు అతి సహజంగా చిత్రీకరిస్తారు. చివరి రోజున ఇంటింటికీ తిరిగి పారితోషాకలను పొందుతారు. తరువాత [[కిరసనాయిలు]] తో, ఆ రంగు వదిలించి స్నానం చేస్తారు. ఈ నృత్యాన్ని ఎవరు పడితే వారు చేయలేరు. బాగా వ్వాయామం చేసి కండలు తిరిగిన యువకులే పులి వేషాన్ని ధరిస్తారు. ఈ నృత్యంలో అత్యంత ప్రావీణ్యాన్ని చూపించే పులి వేషధారులు విజయనరంలో వుండే వారు. ప్రజలను అలరించి ఆనంద పర్చే కళా రూపాలలో పులి నృత్యం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.
 
[[వర్గం:జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/పులి_వేషం" నుండి వెలికితీశారు