పులిపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 2:
 
== రంగస్థల ప్రవేశం, ప్రస్థానం ==
పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. [[స్థానం నరసింహారావు]], [[బందా కనకలింగేశ్వర రావు]], [[బళ్ళారి రాఘవ]] వంటి మహామహుల సరసన మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.
 
నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, చెకుముకి శాస్త్రి, వెంగళరాయడు, భరతుడు, నారదుడు పాత్రలను పోషించడమే కాక, 1932లో సినిమా రంగంలో ప్రవేశించి [[చింతామణి]]లో భవానీ శంకరుడు, [[హరిశ్చంద్ర]] లో నక్షత్రకుడు, [[సారంగధర]]లో సుబుద్ధి, [[పాశుపతాస్త్రం]] లో నారదుడు గా నటించారు. [[మోహినీ రుక్మాంగద]], [[సతీ తులసి]], [[చంద్రహాస]], [[తల్లిప్రేమ]], [[విష్ణుమాయ]] చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈయన మొత్తం పన్నెండు సినిమాలలో నటించాడు.