పుష్కరం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 31:
|[[ప్రాణహిత నది]]||[[మీన రాశి]]
|}
[[బృహస్పతి]] ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను '''ఆది పుష్కరము''' అని, చివరి పన్నెండు రోజులను '''అంత్య పుష్కరము''' అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
 
==భాషా విశేషాలు==
పంక్తి 43:
==పుష్కరుని చరిత్ర==
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో
ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.
 
==పుష్కర సమయంలో చేయవలసిన దానాలు==
పంక్తి 61:
 
==పుష్కర సమయంలో పిండ ప్రదానం==
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం ,పిండ ప్రదానం మరియు శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్దం,తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం,పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం,వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి.
 
==పుష్కరకాల స్నానం==
నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది.దాహార్తిని తీర్చడం,శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం,యజ్ఞనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది.మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే యాజ్ఞనం అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,పుష్కర స్నానం ఒకసారి చేస్తే
పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని,అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు.
మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రంహాండ పురాణం వర్ణిస్తుంది.నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం,అలసత్వం మొదలైన శారీరక ఋగ్గ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పుష్కరం" నుండి వెలికితీశారు