పుష్ప విలాపం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''కరుణశ్రీ'''గా ప్రసిద్ధులైన '''[[జంధ్యాల పాపయ్య శాస్త్రి]]''' రచించిన [[ఖండకావ్యం]]లోని ఒక కవితా ఖండంపేరు '''పుష్పవిలాపం'''. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] పాడిన గ్రామఫోను రికార్డుల వలన ఈ పద్యాలు ఆంధ్రదేశమంతటా ఎంతగానో ప్రాచుర్యం పొందాయి.
 
==విషయం==
పంక్తి 7:
* పూల గురించి కవులు, కావ్యాలు పలు విధాలుగా వర్ణించారు. కాని ఈ విధంగా స్పందించడం బహుశా తెలుగులో ఇదే ప్రధమం కావచ్చును.
* ఇందులో పద్యాలు తేలిక పదాలతో అందరికీ అర్ధమయ్యేలాగా, ఆలోచింపజేసేలాగా ఉన్నాయి.
* కరుణా రసం జాలువారుతున్నట్లున్న ఇటువంటి పద్యాలవల్ల కవికి '''కరుణ శ్రీ''' అనే బిరుదు సార్ధకమయ్యింది.
 
 
పంక్తి 85:
చ. అది రమణీయ పుష్పవన మావన మందొక మేడ మేడపై -
 
నది యొక మారుమూల గది యా గది తల్పులు తీసి మెల్లగా
 
పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల జం -
పంక్తి 92:
 
 
ఉ. కన్నియ లాగె వాలకము కన్పడుచున్నది కాదు కాదు ఆ -
 
చిన్ని గులాబి లేత యరచేతులలో పసిబిడ్డ డున్న య
ట్లున్నది యేమి కావలయునో గద యామెకు? యచ్చుగ్రుద్దిన -
 
పంక్తి 101:
 
 
తే. దొరలు నానంద బాష్పాలొ పొరలు దుఃఖ -
 
బాష్పములొ గాని యవి గుర్తుపట్టలేము;
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి -
 
పంక్తి 110:
 
 
ఉ. పొత్తులలోని బిడ్డనికి పుట్టియు పుట్టక ముందె యెవ్వరో -
 
క్రొత్తవి వజ్రపుం గవచ కుండలముల్ గయిసేసినారు మేల్
పుత్తడి తమ్మిమొగ్గ బుజిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ -
 
పంక్తి 119:
 
 
తే. గాలి తాకున జలతారు మేలిముసుగు
జారె నొక్కింత యదిగొ! చిన్నారి మోము!
పోల్చుకొన్నాములే! కుంతిభోజపుత్రి
స్నిగ్ధ సుకుమారి యామె కుంతీకుమారి!!
 
 
మ. కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ నా తోట వెం
బడి గంగానది పారుచున్నయది బ్రహ్మాండమ్ముగా అల్లదే
బుడుతన్ చేతులలోన బట్టుకొని యా పూబోడియున్ గూడ ని
య్యెడకే వచ్చుచునుండె గద్గదికతో నేమేమొ వాపోవుచున్
 
 
మ. "ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితిని బో యాతండు రానేల? వ
చ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల? ప
ట్టెను బో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్"
 
 
ఉ. ఏయెడ దాచుకొందు నిపుడీ కసిగందును? కన్నతండ్రి "ఛీ
ఛీ" యనకుండునే? పరిహసింపరె బంధువు? లాత్మగౌరవ
శ్రీ యిక దక్కునే? జనులు చేతులు చూపరె? దైవ యోగమున్
ద్రోయగరాదు ఈ శిశువుతో నొడి గట్టితి లోకనిందకున్
 
 
తే. "ఈ విషాదాశ్రువుల తోడ నింక నెంత
కాలమీ మేను చూతు? గంగాభవాని
కలుష హారిణి యీ తల్లి కడుపులోన
కలిసి పోయెద నా కన్న కడుపు తోడ"
 
 
తే. అనుచు పసివాని రొమ్ములో నదుము కొనుచు
కుంతి దిగినది నదిలోన యంతలోన
పెట్టె కాబోలు పవన కంపిత తరంగ
మాలికా డోలికల తేలి వచ్చు ----
 
 
తే. మందసము రాక గనెనేమొ ముందు కిడిన
యడుగు వెనుకకు బెట్టి దుఃఖాశ్రుపూర్ణ
నయనములలోన ఆశాకణాలు మెరయ
ఆ దెసకె చూచు నామె కన్నార్పకుండ
 
 
తే. దూర దూరాల ప్రాణబంధువు విధాన
అంత కంతకు తనను దాపగుచునున్న
పెట్టె పొడవును తన ముద్దుపట్టి పొడవు
చూచి తలయూచు మదినేమి తోచి నదియె?
 
 
తే. ఆత్మహత్యయు శిశుహత్య యనక గంగ
పాలు గానున్న యీ దీనురాలి మీద
భువనబంధునకే జాలి పుట్టెనేమొ!
పెట్టె నంపించి తెరువు చూపెట్టినాడు
 
 
తే. "ఇట్టులున్నది కాబోలు నీశ్వరేఛ్ఛ"
యనుచు విభ్రాంతియై దిక్కు లరసి కొనుచు
నగము తడిసిన కోకతో మగువ, పెట్టె
దరికి జని మెల్ల మెల్లగా దరికి తెచ్చి
 
 
తే. ఒత్తుగా పూలగుత్తుల నెత్తు పెట్టి,
పై చెరగు చింపి మెత్తగా ప్రక్కపరచి
క్రొత్త నెత్తలిరాకుల గూర్చి పేర్చి
ఒత్తుకొనకుండ చేతితో నొత్తిచూచి -
 
 
తే. ఎట్టకేలకు దడ దడ కొట్టుకొనెడి
గుండె బిగబట్టుకొని కళ్ళ నిండ జూచి
బాష్పముల సాము తడిసిన ప్రక్కమీద
చిట్టిబాబును బజ్జుండ బెట్టె తల్లి
 
 
తే. చిన్ని పెదవుల ముత్యాలు చింది పడగ
కలకల మటంచు నవ్వునే గాని, కన్న
యమ్మ కష్టము తన యదృష్టమ్ము కూడ
నెరుగ డింతయు నా యమాయికపు బిడ్డ
 
 
తే. చెదరు హృదయము రాయి చేసికొని పెట్టె
నలలలో త్రోయబోవును; వలపు నిలుప
లేక చెయి రాక సుతు కౌగిలించి వెక్కి
వెక్కి యేడ్చును; కన్నీరు గ్రుక్కు కొనును
 
 
తే. "భోగ భాగ్యాలతో తులదూగుచున్న
కుంతి భోజుని గారాబు కూతురు నయి
కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన."
 
 
ఉ. నన్నతి పేర్మియై గనెడి నా తలిదండ్రుల ప్రేమ యర్థమౌ
చున్నది; నేడు బిడ్డనిట నొంటరిగా విడిపోవ కాళ్ళు రా
కున్నవి; యేమి సేతు; కనియున్ గనలేని యభాగ్యురాల నే
నన్ని విధాల; కన్నకడుపన్నది కాంతల కింత తీపియే!
 
 
 
ఉ. "పెట్టియలోన నొత్తిగిల బెట్టి నినున్ నడి గంగలోనికిన్
నెట్టుచు నుంటి తండ్రి! యిక నీకును నాకు ఋణంబుదీరె; మీ
దెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నా
పుట్టుక మాసిపోను! నిను బోలిన రత్నము నాకు దక్కునే!"
 
 
ఉ. "పున్నమ చందమామ సరిపోయెడి నీ వరహాల మోము నే
నెన్నటికైన చూతునె! మరే! దురదృష్టము గప్పికొన్న నా
కన్నుల కంత భాగ్యమును కల్గునె? ఏయమయైన యింత నీ
కన్నము పెట్టి యాయువిడినప్పటి మాట గదోయి నాయనా!"
 
 
తే. పాల బుగ్గల చిక్కదనాల తండ్రి
వాలుగన్నుల చక్కదనాల తండ్రి
మేలి నీలి ముంగురుల వరాల తండ్రి
కాలుచెయి రాని తండ్రి! నా కన్నతండ్రి!
 
 
తే. కన్నతండ్రి నవ్వులపూలు గంపెడేసి
చిన్నినాన్నకు కన్నులు చేరెడేసి
చక్కనయ్యకు నెరికురుల్ జానెడేసి
చిట్టి బాబు మై నిగనిగల్ పెట్టెడేసి
 
 
 
తే. "బాల భానుని బోలు నా బాలు నీదు
గర్భమున నుంచు చుంటి గంగా భవాని!
వీని నేతల్లి చేతిలోనైన బెట్టి
మాట మన్నింపు మమ్మ! నమస్సు లమ్మ!"
 
 
తే. దిక్కులను జూచి భూదేవి దిక్కు చూచి
గంగదెస చూచి బిడ్డ మొగమ్ము చూచి
సజల నయనాలతో ఒక్కసారి కలువ
కంటి తలయెత్తి బాలభాస్కరుని చూచె
 
 
తే. మరులు రేకెత్త బిడ్డను మరల మరల
నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు
బుజ్జగింపుల మమకార ముజ్జగించి
పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లి.
 
 
తే. ఆత పత్రమ్ము భంగి కంజాత పత్ర
మొండు బంగారు తండ్రిపై నెండ తగుల
కుండ సంధించి ఆకులోనుండి ముద్దు
మూతిపై కడపటి ముద్దు నునిచి
 
 
తే. "నన్ను విడి పోవుచుండె మా నాన్న" యనుచు
కరుణ గద్గద కంఠియై కంపమాన
హస్తముల తోడ కాంక్షలల్లాడ కనులు
మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె.
 
తే. ఏటి కెరటాలలో పెట్టె యేగుచుండ
గట్టుపై నిల్చి యట్టె నిర్ఘాంతపోయి
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష
లోచనమ్ములతో కుంతి చూచుచుండె.
 
"https://te.wikipedia.org/wiki/పుష్ప_విలాపం" నుండి వెలికితీశారు