"ప్రదక్షిణము" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
'''ప్రదక్షిణము''' లేదా '''పరిక్రమము''' అనే పదానికి అర్ధం తిరగడం. [[హిందువులు]] [[దేవాలయం]]లోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.
[[ఫైలు:Parikrama.jpg|right|thumb|200px|[[బోనాలు]] పండుగ సందర్భంగా ప్రదక్షిణం చేస్తున్న స్త్రీలు]]
==పద్ధతులు==
ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా [[ధ్వజస్తంభం]] నుంచి ప్రారంభించి తిరిగి చివరకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న [[శివాలయం]] లో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి ''చండీ ప్రదక్షిణం'' అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. <ref>సెప్టెంబర్ 6, ఆదివారం 2009 ఈనాడు దినపత్రిక సామవేదం షణ్ముఖ శర్మ రాసిన అంతర్యామి శీర్షికలో రాసిన ''ప్రదక్షిణలో పరమార్థం'' అనే వ్యాసం ఆధారంగా... </ref>.
 
ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగిమ్చుకోగలం. అంతే కాదు. అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణ లోని ప్రధానోద్దేశ్యం.
అయితే ఈ కథలో కుమారస్వామి, గణపతి లలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిష్కరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. అన్ని చోట్లా ఈశ్వరుని సందర్శించాలన్నది సుబ్రహ్మణ్యుని బోధ.
 
దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల [[ప్రదక్షిణములు]] ఒక దాని కంటె ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన [[ప్రదక్షిణలు]] ఒకదాని కంటె ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము మరియు సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధిప్రథమని చెప్పబడినది.
 
శ్రీ [[రమణ మహర్షి]] 'ప్రదక్షిణం' అన్న పదాన్ని విశ్లేషించారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. 'ద' అంటే కోరికలన్నీ తీరడమని భావం. 'క్షి' అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు.
==ఇస్లాంలో ప్రదక్షిణాలు==
[[ఫైలు:Kaaba mirror edit jj.jpg|right|thumb|250px|కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.]]
*[[హజ్ ]] యాత్రికులు [[కాబా]] చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణాలు లేదా [[తవాఫ్ అల్-జియారహ్|తవాఫ్]] చేస్తారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1195099" నుండి వెలికితీశారు