ఫోలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 24:
==ఏ పదార్ధాలలో దొరుకుతుంది?.==
 
కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకు కూరలు --- పాలకూరలో పుష్కలం: ముదురాకుపచ్చని ఆకు కూరలు ఫొలేట్‌కి పెట్టింది పేరు. ముఖ్యంగా పాలకూర గురించి చెప్పుకోవాలి. ఒక కప్పు పాలకూర నుంచి అత్యధికంగా 260 మైక్రో గ్రాములని పొందవచ్చు. పాలకూరతో పాటు తోటకూర, చుక్కకూరల్లోనూ ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని మరీ ఎక్కువ మంట మీద వండితే అవి ఫోలేట్‌లని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కుక్కర్‌లో ఉడికించాలి. బీన్స్‌, చిక్కుడు జాతి గింజలూ, పప్పు ధాన్యాలూ ఫొలేట్‌ని ఎక్కువగా అందిస్తాయి. ఒక కప్పు బీన్స్‌ నుంచి 180 మైక్రో గ్రాముల ఫొలేట్‌ అందుతుంది. ఇది నీటిలో కరిగే 'బి' కాంప్లెక్స్‌ విటమిన్‌. చిక్కుడు వంటి గింజలని కూడా వేయించడం కాకుండా ఉడికించడం ద్వారా ఎక్కువ పోషకాలని పొందవచ్చు.
 
నారింజ రసం తాగితే: నిమ్మజాతి పండ్లలో సహజంగానే ఫొలేట్‌ పోషకాలు ఎక్కువ. అలాగే కప్పు నారింజ రసాన్ని తాగితే, ఒక రోజుకి అవసరమైన దానిలో ఐదో వంతు అందుతుంది. టొమాటో రసం నుంచీ పొందవచ్చు. మాంసాహారం తినేవారు లివర్‌ని తినడం వల్ల బి9 రూపంలో ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది. బజారులో దొరికే హోల్‌వీట్‌ బ్రెడ్‌, వైట్‌ బ్రెడ్‌ తిన్నా మంచిదే.
"https://te.wikipedia.org/wiki/ఫోలిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు