బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
'''బద్రీనాథ్''' [[హిందువులు|హిందువుల]] ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో [[ఉత్తరాఖండ్]] లోని [[చమోలి]] [[జిల్లా]] లో ఉన్న పంచాయితీ. [[చార్ ధామ్]](నాలుగు పట్టణాలు)లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ [[గర్హ్వాల్]] కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ(6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.
==నగర చరిత్ర==
బద్రీనాథ్ ప్రాంతం హిందూ [[పురాణాలు|పురాణాలలో]] బద్రీ లేక బద్రికాశ్రమం(बद्रीकाश्रम)గా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. [[మహాభారతం]]లో [[శివుడు]] [[అర్జునుడు|అర్జునినితో]] ''పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- [[కృష్ణుడు]] నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు'' అని చెప్పినట్లు వర్ణించ బడింది.
 
 
పంక్తి 8:
 
 
బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలూ [[వ్యాసుడు|వ్యాస]] విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీ కృష్ణ నిర్యాణానాంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాధ్‌ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది.
 
 
పంక్తి 18:
 
 
బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచరియలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిధిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.
 
 
బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకు వెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్దవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయంలోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.
 
==ప్రత్యేకత==
"https://te.wikipedia.org/wiki/బద్రీనాథ్" నుండి వెలికితీశారు