బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''బొమ్మిరెడ్డి నాగిరెడ్డి'''
| residence =
| other_names =బి.నాగిరెడ్డి
| image =Nagireddy.jpg
| imagesize = 200px
| caption = బి.నాగిరెడ్డి
| birth_name = '''బొమ్మిరెడ్డి నాగిరెడ్డి'''
| birth_date = [[డిసెంబర్ 2]], [[1912]]
| birth_place = [[కడప జిల్లా]] [[‌పొట్టింపాడు]]
| native_place =
| death_date = [[ఫిబ్రవరి 25]], [[2004]]
| death_place =
| death_cause =
| known = తెలుగు సినీనిర్మాత మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత.
| occupation =
| title =
పంక్తి 44:
యువకుడుగా ఆయన [[స్వాతంత్ర్యోద్యమం]] పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం [[బర్మా]] వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు.
 
అప్పుడే [[చక్రపాణి]] సాహచర్యం లభించింది. ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకురావాలనుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఒక నెల ముందుగా [[చందమామ]] ఆవిర్భావం జరిగి దినదినప్రవర్ధమానం కాసాగింది. ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశాడు.
 
[[1974]]లో ఆయన దృష్టి వైద్యరంగం మీదికి మళ్ళింది. మద్రాసులో రెండు ఆసుపత్రులను నెలకొల్పాడు. కఠినశ్రమ, నిరాడంబరత, వినయం, నిర్దిష్ట పథకాలు రూపొందించడం, ఆయన సహజ గుణాలు. ఆయన పలికే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ భారతీయ తాత్వికదృష్టి, ముఖ్యంగా [[భగవద్గీత]] ప్రబోధించే కర్మసిద్ధాంతప్రభావం స్పష్టంగా కనిపించేది.
పంక్తి 51:
 
==చిత్రరంగంలో==
మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన [[బొమ్మిరెడ్డి_నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] స్థాపించిన [[వాహినీ పిక్చర్స్|వాహినీ సంస్థ]]లో భాగస్వామిగా చేరాడు. రెండవప్రపంచయుద్ధ కాలంలో ([[1941]]లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబుదాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించలేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి [[భక్తపోతన]] కు దర్శకత్వం వహించిన [[కె.వి.రెడ్డి]] నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో [[జెమినీ_పిక్చర్స్|జెమినీ]] వారి [[బాలనాగమ్మ]] విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. దానికి దీటుగా ఉండడానికి నాగిరెడ్డి మద్రాసులో హనుమంతుడి భారీ కటౌట్లు పెట్టించి వినూత్న రీతిలో ప్రచారం చేయించాడు. ఆ పబ్లిసిటీ చిత్ర విజయానికి బాగా తోడ్పడింది. దాంతో కె.వి.రెడ్డి ఆయనకు 500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మొత్తంతో నాగిరెడ్డి ఒక ఆస్టిన్ కారు కొన్నాడు.
 
===విజయా సంస్థ===
పంక్తి 83:
===విజయా సంస్థలో ముఖ్యులు===
'''నటీనటులు:'''
విజయాసంస్థ ఏర్పడిన నాటి నుంచి 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' వరకు వారి ప్రతి సినిమాలోనూ హీరో రామారావే. ఆయనతో బాటు విజయావారి ఆస్థాన నటులుగా ఉన్నవాళ్ళు [[ఎస్వీరంగారావు[[, [[సూర్యకాంతం]], [[రేలంగి]], [[రమణారెడ్డి]] తదితరులు. వీరి నటనాప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ కాలంలో నటులు ఇతర సంస్థలు తీసే సినిమాల్లో హీరో వేషం వేయడం కంటే విజయావారి సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషం వేయడమే మిన్నగా భావించేవారు. చాలా మంది నటులకు విజయావారి సినిమాల్లో నటించాలనే కోరిక [[మాయాబజార్]] తో తీరింది. ఆ సినిమాలో నాటి చిత్రరంగంలోని నటులందరూ కనిపిస్తారు. [[అక్కినేని నాగేశ్వరరావు]]కు విజయావారి సినిమాల్లో నటించే అవకాశం మొదట[[ మిస్సమ్మ]] సినిమాతో వచ్చింది. చిత్రరంగంలో అడుగుపెట్టడమే హీరోగా అడుగుపెట్టిన ఆయన ఆ సినిమాలో పూర్తిస్థాయి హాస్యపాత్ర పోషించాడు. మాయాబజార్ తర్వాత ఆయనకు గుండమ్మకథలో సహనాయకుడి పాత్ర వేసే అవకాశం వచ్చింది. అది ఆయనకు నూరవ సినిమా కూడా. అది గొప్ప అదృష్టంగా భావించిన ఆయన ఆ సినిమాకు పారితోషికం తీసుకోలేదు. కానీ [[నాగిరెడ్డి]] ఆయనకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఒక విద్యాసంస్థకు విరాళంగా ఇచ్చేశాడు.
 
'''తెరవెనుక నిపుణులు:'''
''దర్శకులు:'' [[ఎల్వీ ప్రసాద్]]([[షావుకారు]], [[పెళ్ళిచేసిచూడు]], [[మిస్సమ్మ]]); కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరునికథ, మొ), కమలాకర కామేశ్వరరావు(చంద్రహారం, గుండమ్మకథ)
 
[[కె.వి.రెడ్డి]],[[కమలాకర కామేశ్వరరావు]] లిద్దరూ మొదట్నుంచి విజయ-వాహినీ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకరిమీద ఇంకొకరికి అచంచలమైన విశ్వాసముండేది. ఇద్దరిలో ఎవరికి దర్శకుడిగా అవకాశమొచ్చినా ఇంకొకరిని సహాయదర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. ఆ అవకాశం మొదట కె.వి.రెడ్డికే వచ్చింది.
 
''రచయితలు:'' విజయావారి ఆస్థాన రచయిత తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత జనరంజకమైన మాటలు-పాటలను రాసిన [[పింగళి నాగేంద్రరావ]]."ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" (మాయాబజార్ లో) అంటూ ఆయన ఏదైనా కనికట్టో, మ్యాజిక్కో చేసేటప్పుడు నేడు చిన్నపిల్లలు సైతం పలికే మాట "హాంఫట్" తో బాటు మరెన్నో మాటలు పాతాళభైరవిలో సృష్టించాడు. ఆ రసగంగాప్రవాహం మాయాబజార్ తో సహా విజయావారి ఎన్నో సినిమాల్లో ప్రవహించింది.
పంక్తి 94:
[[డివి నరసరాజు]] (గుండమ్మకథ,...)
 
''కెమెరామాన్ మార్కస్ బార్‌ట్లే'' (వెన్నెల పాటలు చిత్రీకరించడంలో ఈయన ప్రతిభ అనన్యం. "లాహిరి లాహిరి లాహిరిలో", "ఎచటనుండి వీచెనో ఈ చల్లనిగాలి" - ఇలా ఎన్నో చిత్రాలలో ఆయన చాయాగ్రహణం ఇప్పటికీ అద్భుతముగా అనిపిస్తుంది. అందుకే విజయా వారి చాలా చిత్రాలలో పాటలు ఇప్పటికీ వెన్నెలలు చల్లుతూనే ఉన్నాయి)
 
''కళాదర్శకుడు మా గోఖలే''
పంక్తి 107:
 
==పత్రికలు-ప్రచురణ రంగం==
తన స్వగ్రామం నుంచి కెవి రెడ్డి పిలుపందుకుని చెన్నైకి తిరిగొచ్చాక భక్తపోతనకు పనిచేస్తున్న కాలంలోనే తన తమ్ముడైన బి.ఎన్. కొండారెడ్డి పేరు మెద బి.ఎన్.కె. ప్రెస్సు ప్రారంభించాడు నాగిరెడ్డి. ఆ ప్రెస్సు నుంచే ఆయన [[ఆంధ్రజ్యోతి]] అనే సాంఘిక-రాజకీయ పత్రిక మొదలుకొని అనేక పత్రికలు ప్రచురించాడు. వాటిలో అగ్రగణ్యమైనది [[చందమామ]]. ఇతర పత్రికలు:
 
*జూనియర్ చందమామ: తొమ్మిదేళ్ల లోపు పిల్లల కోసం చందమామ ప్రత్యేకంగా ఆంగ్లంలో ప్రచురిస్తున్న మాస పత్రిక .
కొంతకాలం నడిచి ఆగిపోయిన పత్రికలు:
*విజయ చిత్ర, సినిమా వారపత్రిక,
*వనిత, మహిళల మాసపత్రిక
పంక్తి 142:
 
==బయటి లింకులు==
చందమామ పత్రిక ఏప్రిల్ 2004 సంచికలో ప్రచురించిన నివాళి
[[వర్గం:1912 జననాలు]]
[[వర్గం:2004 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు