బురఖా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 8:
'''హిజాబ్''' లేదా '''పరదా'''('''[[అరబ్బీ భాష|అరబ్బీ]] : حجاب ''')
 
ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా ''గౌరవంతో కూడిన హుందాతనం'', ''వ్యక్తిగతం'', మరియు ''సద్-నీతి''.<ref name="dict">{{cite book | last = Esposito | first = John | authorlink = John Esposito | title = [[The Oxford Dictionary of Islam]] | publisher = [[Oxford University Press]] | year = 2003 | doi = | id = ISBN 0-19-512558-4 }}, p.112</ref> ఈ పదము [[ఖురాన్]] లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడినది. దీనినే ఉర్దూ లో ''పరదా'' లేదా ''నఖాబ్'', అరబ్బీ లో 'ఖిమార్' '''خمار'''.
 
ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. ''[[బురఖా]]'' భారతీయ, అఫ్ఘానీ, ఇరాకీ మరియు ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడవున్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.
 
'''బురఖా''' నిర్బంధమని ఇస్లాం చెప్పలేదు కానీ పవిత్ర ఖురాన్‌లో ఈ ప్రస్తావన ఉంది. దీనిని [[హిజాబ్]] (అడ్డుతెర) అనికూడా అంటారు. ముస్లిం మహిళ పర పురుషుల చెడు చూపుల నుంచి తనను తాను రక్షించుకొనేందుకు బురఖాను ధరించమని ప్రవక్త సూచించారు. (ఖురాన్ 33:59. 24:30, 31). ముస్లిం మహిళలు బురఖా ధరించడం వల్ల వారి పట్ల చెడు తలంపుతో చూడ్డానికి వీల్లేని విధంగా పురుషులను కూడా కట్టడి చేసింది.
== బురఖా గురించి ఖురాన్ వాక్యాలు ==
* ప్రవక్తా నీ భార్యలకూ కుమార్తెలకూ ఇతర ముస్లిం మహిళలకూ వారు తమ పైటలను తమ ముఖాలపై కప్పుకోవాలని చెప్పు.ఇదే సరైన పద్ధతి.దీనివల్ల ఎవరైనా గుర్తించి వేధిస్తారనే భయం ఉండదు..(ఖురాన్ 33:59.)
* ఇతరులముందు స్త్రీలు తమ అందచందాలను అలంకరణలను బహిర్గతం చేయకూడదు.(ఖురాన్ 24:31).
 
== బురఖా గురించిన హదీసులు ==
* [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్]] ఓ సారి "సౌదా" బిన్తె జమా ను పరదా లేకుండా చూసి ఇలా అంటాడు "ఓ సౌదా!, నేను నిన్ను గుర్తించాను", ఆమె ఇలా పరదా లేకుండా ఉండడం ఉమర్ ను మధనపడేలా చేసింది. ఈ విషయం జరిగిన తక్షణమే అల్లాహ్ "పరదా [[ఆయత్]]" (అల్-హిజాబ్, కనులను తప్పించి, శరీరాన్నంతటినీ కప్పుకునే విధానం) లను అవతరింపజేశాడు. ([[సహీ బుఖారీ]] - 1:148, 8:257)
* ఓ విశ్వాసులారా! ప్రవక్త గారి ఇంట్లో, భోజనం అనుమతి లభించే వరకూ ప్రవేశించకండి, భోజనం తయారయ్యే వరకూ వేచి యుండండి, ఈ విషయమై పరదా వెనుకనుండే విచారించండి...([[ఖురాన్]] : 33.53), పరదా అలాగే వుండినది, ప్రజలు వెళ్ళిపోయారు.([[ఖురాన్]] - 6:315)
* యౌవనంలో ప్రవేశించిన ప్రతి స్త్రీ తప్పక పరదా పద్దతి పాటించవలెను, లేని యెడల, అల్లాహ్ ఆమె ప్రార్థనలను ఆలకించడు. ([[అబూ దావూద్]] : 251)
పంక్తి 24:
 
== బురఖా గురించి కొందరు స్త్రీల ప్రకటనలు ==
* [[ఇవాన్‌రీడ్లీ]] అనే బీబీసీ రిపోర్టరు తాలిబన్ల చెర నుంచి విడుదలై స్వదేశానికి వచ్చినపుడు వివిధ మీడియా విలేకరుల ఎదుట ఆమె బురఖా ధరించింది. బురఖా ధారణపై వారంతా ప్రశ్నించడాన్ని ఆమె తప్పు పట్టారు.బురఖా స్త్రీలను 'మగ పిశాచాల దృగ్బాణాల' నుండి కాపాడి వారి శీలాన్ని పరిరక్షిస్తుంది 'బురఖా స్త్రీ, పురుషులు పరస్పరం ఆకర్షితులవకుండా తద్వారా పశుతుల్యులుగా మారకుండా కాపాడుతుంది.ఏ వ్యక్తులనైతే మీరు పరమ కిరాతకులుగా చిత్రీకరించారో... చెరలో వున్న తనపట్ల ఆ వ్యక్తులు చూపిన ప్రేమాభి మానాలకంటే మీ కరకు చూపులే కఠినంగా ఉన్నాయని... అందుకే బురఖా ధరించా'నని దానివల్ల మహిళలకు రక్షణ ఉందని చెప్పింది.
 
== బురఖా వ్యతిరేక వాదనలు ==
[[దస్త్రం:Hijab world2.png|thumb|300px|ప్రపంచ వ్యాప్తంగా [[హిజాబ్]] (బురఖా) ధరించేవారిని సూచించే మ్యాపు.{{Fact|date=October 2008}}]]
* ఫాత్‌మా మెర్నిస్సి, రిప్ఫత్ హసన్, రాణా హుస్సేని, అమీనా వదూద్ లు "ఇస్లామిక్ ఫెమినిజం" కోసం పోరాడుతున్నారు.
* బురఖాను టర్కీ ప్రజాస్వామ్య నేత [[కమాల్ పాషా]] నిరసించాడు.
* యస్.యమ్.అక్బర్ రాసిన వెధవ ఘోషా కథ స్త్రీల పత్రిక అయిన 'గృహలక్ష్మి'లో 1939 జనవరి సంచికలో ప్రచురితమైంది. ఒక ముస్లిం పురుషుడు రచించిన 'తొలి' తెలుగు ముస్లిం 'స్త్రీ వాద' కథ ఇది. బురఖా అనే కట్టుబాటు ఏడవ శతాబ్ది అరేబియాలో అవసరమయ్యింది. 20వ శతాబ్దంలో దాని అవసరం లేదు. స్వార్ధపరులైన మగవారు కట్టుబాట్లన్నింటినీ స్త్రీలకు ఏర్పరచి 'తాము మాత్రం ' బజారుల వెంట బయలుదేరుతున్నారు. ఘోషావల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. బురఖా ఒక అలంకారం కూడా కాదు. దేవుడిచ్చిన గాలి, సూర్యరశ్మి లేక పాలిపోయి, తెల్లబడి, ఇంట్లోనే ఉండి దుర్గంధవాయువునే పీలుస్తోంటే నానా జబ్బులకు గురి కావలసి వస్తుంది. నీడలో పెరిగిన మొక్కకూ, ప్రకృతిలో పెరిగిన మొక్కకూ తేడా లేదా? స్వార్ధపరులైన పురుషులు స్త్రీల హక్కుల్ని కాలరాచి వేస్తున్నారు. ఈ బురఖా ముక్కునీ, కళ్ళనీ కప్పుతూ పలుచటి తెరను కలిగిన '[[నఖాబ్]]' ఉన్న ఫుల్ బురఖాలా ఉంటుంది. బురఖా కారణంగా కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. బురఖా (నఖాబ్‌తో కూడినది) వేసుకుంటే భర్త భార్యనీ, భార్య భర్తనీ గుర్తించలేనంతగా చీకటి ఏర్పడుతుంది.
* "పుట్టుమచ్చ" "ఖబడ్దార్" లాంటి రచనలు బురఖా, నఖాబ్, "ఘోషా", [[పరదా (ఇస్లాం)|పరదా]] లను నిరసిస్తున్నాయి.
* ఈనాటి స్త్రీలు కేవలం సంఘానికి భయపడే గోషా పాటిస్తున్నారు. బురఖాతో సినిమాలకు వెళుతున్నారని విమర్శిస్తున్నాయి.
* ప్రవక్త పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ హక్కులనిచ్చాడు. చాందస హిందువుల బారినుండి బాల్య వివాహాలను నిషేధించి , స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలను సాధించినట్లే ముస్లిం స్త్రీలకు ఈ [[గోషా]] బెడద పోవాలని ఘోషిస్తున్నారు. --డాక్టర్ మహబూబ్ భాషా, [[అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ]] లో చరిత్ర ఉపన్యాసకులు.
* బుర్ఖాను నిషేధించాల్సిందేనని ఫ్రాన్స్ ముస్లిం మహిళా మంత్రి ఫడెలా అమర తెలిపారు. బుర్ఖా స్త్రీ గృహహింస, బానిసత్వానికి ప్రతీక అని ముస్లిం ఛాందసవాదులు అర్థంలేని చట్టాలతో మహిళలను హింసిస్తున్నారన్నారు.అందుకే మెజారిటీ ముస్లిం మహిళలు బుర్ఖాను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ బుర్ఖాను బానిసత్వానికి గుర్తుగా పేర్కొన్నారు.(ఈనాడు 16.8.2009)బురఖా ధరించాలని భార్యపై
ఒత్తిడి తెస్తే ,తన భార్య తప్పనిసరిగా బురఖా ధరించాలని బలవంతం చేసే వ్యక్తి ఫ్రెంచి పౌరసత్వాన్ని తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేస్తానని ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ ఫిలన్‌ తెలిపారు.(ఈనాడు4.2.2010)
* బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు ముఖాన్ని కూడా కప్పి ఉంచేలా బురఖాలు ధరించడాన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం నిషేధించింది.(ఈనాడు13.4.2011)
"https://te.wikipedia.org/wiki/బురఖా" నుండి వెలికితీశారు