బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q4940896
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
| residence =
| other_names =బి.ఎన్.రెడ్డి
| image =Bnreddy.jpg
| imagesize = 200px
| caption = బి.ఎన్.రెడ్డి
| birth_name = బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
| birth_date = [[నవంబర్ 16]], [[1908]]
| birth_place = [[వైఎస్ఆర్ జిల్లా]] [[పులివెందుల]] తాలూకా [[కొత్తపల్లి]]
| native_place =
| death_date = [[నవంబర్ 8]], [[1977]]
| death_place =
| death_cause =
| known = [[తెలుగు సినిమా]] దర్శకుడు మరియు నిర్మాత
| occupation =
| title =
పంక్తి 36:
}}
 
'''బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి)''' (Bommireddy Narasimha Reddy / B.N.Reddy)([[నవంబర్ 16]], [[1908]] - [[నవంబర్ 8]], [[1977]]) అనే పేరు వినగానే మదిలో మల్లెల మాలలూగుతాయి. ఆయన సృష్టించిన అజరామరమైన చలనచిత్ర కళాఖండాలు ''మల్లీశ్వరి''తో సహా మన కళ్ళ ముందు కదలాడతాయి. బి.ఎన్.రెడ్డి [[తెలుగు సినిమా]] దర్శకుడు మరియు నిర్మాత. [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] పొందిన తొలి దక్షిణ భారతీయుడు.<ref>1969లో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన [[దేవికారాణి]] విశాఖపట్నంలో జన్మించింది. కాని ఆమె బెంగాలీ కుటుంబానికి చెందినది. నట జీవితం అధికంగా హిందీ విత్రరంగంలో గడచింది. తరువాత రష్యన్ చిత్రకారుడు [[:en:Svetoslav Roerich|స్వెటొస్లావ్ రోరిచ్]]‌ను పెళ్ళాడి బెంగళూరులో చివరి జీవితం గడిపింది. ఆమెను దక్షిణ భారతీయురాలిగా పరిగణిస్తే బి.ఎన్. రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన రెండవ దక్షిణ భారతీయుడౌతాడు </ref> [[పద్మ భూషణ్]] పురస్కార గ్రహీత.
 
==బాల్యం==
పంక్తి 42:
 
==సినిమాలకు ముందు==
తండ్రి వ్యాపార రీత్యా [[మద్రాసు]]లో పెరిగిన బి.ఎన్. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో వేషాలు వేసేవాడు. 'వరవిక్రయం' నాటకంలో ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన [[గాంధీజీ]] ఆయన్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. చదువు పూర్తయ్యాక బి.ఎన్. రంగూన్ వెళ్ళి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. అయితే అప్పట్లో ఉధృతంగా సాగుతున్న స్వదేశీ ఉద్యమ ప్రభావం వల్ల విదేశీ వ్యాపారం చేసే ఆలోచన మానుకుని [[కలకత్తా]] వెళ్ళి శాంతినికేతన్ లో కొంత కాలం గడిపాడు. అక్కడ ఆయన లలిత కళల పట్ల విశేషంగా ఆకర్షితుడయ్యాడు. రంగూన్ లో ఉన్న రోజుల్లో అక్కడి జానపద కళా రూపాలను, వీది ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీంచాడు. ఆ అనుభవాల ఫలితంగా ఆయన తిరిగి వచ్చాక చలన చిత్ర రంగం వైపు మొగ్గు చూపాడు. ముఖ్యంగా ప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు దేవకీబోస్ తీసిన 'సీత' చిత్రం చూశాక తనకు సినిమాలు తీయాలనే కోరిక కలిగిందని బి.ఎన్. చెబుతూండే వాడు.
 
 
పంక్తి 48:
 
 
అంతేగాక అప్పట్లో ([[1952]] వరకూ)సెన్సారింగు కూడా లేకపోవడం వల్లా, సినిమాల్లోని రాజకీయపరమైన అంశాలు తప్ప మిగిలిన విషయాల్లో బ్రిటిష్ ప్రభుత్వ ఉదాశీనత వల్లా కొందరు దర్శకులు ప్రేక్షకులను "రంజింపజేసే" ప్రయత్నాలు కూడా యథేచ్ఛగా చేసేవారు.(మన దేశంలో వెండితెరమీద ముద్దు సీన్లు [[1922]]లో విడుదలైన 'పతిభక్తి' అనే మూకీ సినిమా లో మొదలయ్యాయి.) బి.ఎన్. పూర్తిగా సంస్కరణాభిలాషతోనే సినిమాలు తీశాడు గానీ అలాంటి చౌకబారు ప్రయత్నాలు అణుమాత్రమైనా చేయలేదు. మొదటి నుంచీ చివరి వరకూ విలువల పట్ల తనకున్న నిబద్ధతను వీడలేదు.
==సినీ జీవితం==
===సినీరంగ ప్రవేశం===
పంక్తి 71:
===మల్లీశ్వరి===
[[బొమ్మ:Telugucinemaposter malliswari 1951.JPG|right|150px]]
తర్వాత శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు.ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం [[హంపి]] వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే వున్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, [[బుచ్చిబాబు]] వ్రాసిన ఒక కథ(ఎల్లోరాలో ఏకాంత సేవ) కలిపి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారి చేత మాటలు, పాటలు వ్రాయించారు. అదే "[[మల్లీశ్వరి]]"(1951). కృష్ణశాస్త్రికి అదే తొలి సినిమా.
 
ఇక్కడో విషయం చెప్పుకోవాలి: [[శంకరాభరణం]] తీస్తున్నప్పుడు అది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన సినిమా కాబట్టి అందులోని పాటలు ప్రముఖ సంగీత విద్వాంసుడైన [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ|బాలమురళికృష్ణ]] చేత పాడించాలనుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే అంతటి మహా విద్వాంసుడి చేత తమకు కావలసిన రీతిలో పాడించుకునే చనువు, స్వేచ్ఛ, ధైర్యం ఎంతవరకు ప్రదర్శించగలమోననే సందేహంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.అయితే సాహితీరంగంలో ఉద్ధండులైన కృష్ణశాస్త్రి, [[పాలగుమ్మి పద్మరాజు]](పా.ప.) లను చిత్రసీమలోనికి తీసుకువచ్చింది బి.ఎన్.రెడ్డే. కృష్ణశాస్త్రి తొలి సినిమా మల్లీశ్వరి కాగా పా.ప. తొలి సినిమా బంగారుపాప. అలా సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్టులైనవాళ్ళను సినీరంగంలో ప్రవేశపెట్టి తెలుగు సినిమా గౌరవప్రతిష్టలను పెంచడమే గాక అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా బావుటాను సగర్వంగా రెపరెపలాడించిన స్రష్ట బి.ఎన్.
పంక్తి 163:
*చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ క్వాలిటీ విషయంలో అంత ఖచ్చితంగానూ ఉంటారు బి.ఎన్. మాటల్లోనూ, పాటల్లోనూ ప్రతి అక్షరాన్నీ తరచితరచి చూస్తాడు. [[పూజాఫలం]]లో సినారె వ్రాసిన "పగలే వెన్నెల..." పాటను తనకు నచ్చేటట్లు వచ్చేదాకా తిరగరాయించాడు. ఆ పాటకు స్వరాలు కూర్చింది [[సాలూరు రాజేశ్వరరావు]]. ఆయన మాల్కోస్ రాగంలో ఆలపించారు ఆ పాటను. అయితే బి.ఎన్. ఆ పాటలో పల్లవి చివర 'కన్నులుంటే' అనే పదాన్ని 'టే' తర్వాత కాస్త సాగదీసి పాడించారు. ఆ పాటకు ఆ సాగతీత నెమలికి పింఛం అమరినంత అందంగా అమరింది. ఆ సాగతీత లేకుండా ఆ పాటను ఇప్పుడు మనం ఊహించుకోనైనా లేం.
*ఎక్‌స్టసీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి యోగసాధన అక్ఖర్లేదు. [[రాజమకుటం]] లోని 'సడి చేయకో గాలి...' పాట వింటే చాలు. అదీ బి.ఎన్. మార్కు పాట! తాననుకున్న ఎఫెక్టు వచ్చేవరకూ ఆయన అంత పట్టుదలగా పని చేయిస్తారు కాబట్టే ఆయన సినిమాలకు పని చేసిన వారెవరూ తాము "చేశామని" చెప్పుకోరు. బి.ఎన్. తమ చేత "చేయించారని" మాత్రమే చెప్పుకుంటారు. ఆవిధంగా తానై శాసించక పోయినా పని 'రాబట్టుకోగలిగిన' ఒకేఒక్క దర్శకుడాయన.
*ఆయనలోని మరో ప్రత్యేకత తన సినిమాలకు స్క్రిప్టు దశ లో నే ఆయన చేసే సెన్సారింగ్. ఆయన తీసిన చివరి సినిమా [[బంగారుపంజరం]]([[1969]]) స్క్రిప్ట్ లో హీరో తలుపు తట్టుతూ, అది తెరుచుకోవడం ఆలస్యమైతే "ఏం చేస్తున్నావ్?" అని అడిగే దృశ్యముంది. అప్పుడు అవతల్నించి హీరోయిన్ గొంతు "బట్టలు మార్చుకుంటున్నాను" అని వినిపించాలి. అయితే ఆ మాటలు విన్న ప్రేక్షకులు ఏం ఊహించుకుంటారోనని ఆ దృశ్యాన్ని తొలగించారాయన. అదీ, విలువల పట్ల ఆయనకున్న నిబద్ధత!
 
==గుర్తింపు-గౌరవాలు==
పంక్తి 176:
 
==ముగింపు==
మనకు 'రంగులరాట్నం' చూపుతూ తాము జేబులు నింపుకునే 'పెద్దమనుషుల' నిజస్వరూపాలను చూడడానికి ఓ 'పుణ్యభూమీ కళ్ళుతెరు!' అని ఎలుగెత్తబోయి నోరు పెగలక 'బంగారుపంజరం'లోని ఆ 'సుమంగళి'కి 'వందేమాతరం' అని ఓ దండం పెట్టి 'మల్లీశ్వరి'నీ, 'బంగారుపాప'నూ మనకొదిలి 'దేవత'లను రసగంగాడోలికలలో తేలించడానికీ, వారి మనసున మల్లెలు పూయించడానికీ తన 'పూజాఫలం'తో అందాల మేఘమాలల మీదుగా వీచే పిల్ల తెమ్మెరల వెంట [[1977]] [[నవంబర్ 8]]న 'స్వర్గసీమ'కు తరలివెళ్ళారు ఆ 'రాజమకుట'ధారి.