బోయ జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{కాపీ హక్కులు}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = బోయ జంగయ్య
| residence = నల్లగొండ జిల్లా మన్యం చెల్క
| other_names =బోయ జంగయ్య
| image =Boya jangayya.jpg
| imagesize = 200px
| caption = బోయ జంగయ్య
| birth_name = బోయ జంగయ్య
| birth_date = [[1942]] [[అక్టోబరు 1]]
| birth_place = [[నల్లగొండ జిల్లా]] [[రామన్న పేట]] తాలూకాలోని [[పంతంగి]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = ప్రముఖ రచయిత
| occupation = ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో ఉద్యోగి
| title =
పంక్తి 36:
| weight =
}}
'''బోయ జంగయ్య''' ప్రముఖ రచయిత. నాటికలు, కవిత్వం, కథ, నవలలు మొదలైన ప్రక్రియల్లో ఆయన రచనలు చేశాడు.
==జీవిత విశేషలు==
'''బోయ జంగయ్య''' [[నల్గొండ జిల్లా]] రామన్న పేట తాలూకాలోని [[పంతంగి]] గ్రామంలో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు [[1942]] [[అక్టోబరు 1]] న జన్మించారు. బి.ఏ, డి.లిట్‌ చదివారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో చాలాకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన చదువుకున్న చదువు చేసిన ఉద్యోగం సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేకున్నా హృదయంలో సాహిత్యానుబంధం అతనికి ఏర్పడింది.
==రచయితగా==
బోయ జంగయ్య యాభై సంవత్సరాలుగా నిరంతరం సాహిత్య కృషి చేస్తున్నాడు. ఆయన ఎన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా అతని ప్రతిభ కథలు వ్రాయటంలో నవలలు రచించటంలో ఎక్కువగా ప్రకాశించిందని చెప్పాలి. ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆయన రచించిన నవలల్లోనూ దళితవాద దృక్కోణం చోటు చేసుకున్నది. దళితవాదంలో కవిత్వం వచ్చినంత బలంగా వచన రచనలు రాలేదని చెప్పాలె. కాని తెలంగాణ నుంచి మాత్రం దళిత వాదాన్ని చిత్రిస్తూ కథలు, నవలలు వంటి వచన ప్రక్రియల్లో రచనలు చాలా వచ్చాయి. అటువంటి వచన ప్రక్రియల్లో రచనలు చేసిన ప్రముఖ రచయిత, సీనియర్‌ రచయిత బోయ జంగయ్యనే. పద్యం, కవిత్వం వ్రాయటం సులభం కాని వచనం వ్రాయటం కఠినం. అందులో చక్కని సమగ్రమైన అర్ధవంతమైన విషయావగాహన కలిగించే వచనం వ్రాయటం అంతగా సులభమైన పనికాదు. కాని బోయ జంగయ్య కథల్లోగాని నవలల్లోగాని వచన రచన సమగ్రంగా వుంటుంది. చక్కని శైలిలో ఆయన వచన రచన చేశాడు.
పంక్తి 52:
బాలల కోసం డా బోజ రాసిన కథలు, కవితలు, గేయాలు, నాటికలు, వ్యాసాలు మరికొన్ని పుస్తకరూపంలో తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
==రచనలు==
1963లో ‘‘కష్టసుఖాలు’’ నాటికను తన తొలిపుస్తకంగా ప్రచురించిన వీరి కలం నుండి అనేక రచనలు వెలువడ్డాయి.వీరి తొలికథ‘‘ జీవితమలుపులు’’ ఆ తర్వాత విస్తృతంగానే రాసినా, విశిష్టమైన కథల్ని రాశారు.‘‘లోకం, గొర్రెలు (1981), ఎచ్చరిక (1984), దున్న(1989), రంగులు (1984), చీమలు (1996), తెలంగాణ వెతలు (1998), బోజ కథలు ( 2000), బమ్మలు (2002), ఉప్పనీరు (2002), ఇప్పపూలు (2003), ఆమె ( 2004) మొదలైన కథా సంపుటాలుగా ప్రచురించారు. మనుషుల్లోని క్రూరత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పడానికి జంతువుల కంటే వికృతంగా ప్రవర్తించేదోపిడీదారుల గురించి గొర్రెలు కథలు రాశారు.అంబేద్కర్‌, జగజ్జీవన్‌, గుర్రం జాషువ, కె.ఆర్‌.నారాయణన్‌ ల జీవిత చరిత్రల్ని రాశారు.వీటితో పాటు బాలల కోసం ప్రత్యేకించి ‘‘బడిలో చెప్పనిపాఠాలు’’, గుజ్జనగూళ్ళు, ఆటలు`పాటలు, చిలకల పలుకులు మొదలైనవి రాశారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బోయ_జంగయ్య" నుండి వెలికితీశారు