"బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
'''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) [[1922]], [[నవంబర్ 14]]న [[ఈజిప్టు]] రాజధాని నగరం [[కైరో]]లో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు [[ఐక్యరాజ్య సమితి]]కి 6 వ ప్రధాన కార్యదర్శిగా [[1992]] [[జనవరి]] నుంచి [[1996]] [[డిసెంబర్]] వరకు పదవిని నిర్వహించినాడు.
 
బౌత్రోస్ ఘలి [[1946]]లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. [[1949]]లో [[పారిస్]] విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. [[1977]] నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ కు, [[ఇజ్రాయెల్]] ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మధ్య శాంతి ప్రయత్నాలు కొనసాగించినాడు <ref>[http://weekly.ahram.org.eg/2006/777/profile.htm Boutros Boutros-Ghali: The world is his oyster]</ref>. [[1991]]లో బౌత్రోస్ ఘలీ [[ఐరాస]] ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు. ఇతని పదవీకాలం సంక్లిష్తంగా గడిచింది. ముఖ్యంగా [[1994]] లో సంభవించిన [[ర్వాండా]] దమనకాండలో 9 లక్షల మందికి పైగా హత్యకు గురైనారు. ఈ విషయంలో బౌత్రోస్ ఘలీ తీవ్రంగా విమర్శల పాలైనాడు. [[అంగోలా]] అంతర్యుద్ధం, యుగొస్లావ్ యుద్ధాలు కూడా ఇతని కాలంలోనే జరిగాయి. [[1996]]లో రెండో పర్యాయం కొరకు ఈజిప్టు, [[గినియా బిస్సౌ]], [[బోట్స్‌వానా]]తో సహా [[భద్రతా మండలి]] లోని 10 తాత్కాలిక దేశాలు ప్రతిపాదించిననూ [[అమెరికా]] వీటో ఉపయోగించి మరో పర్యాయం బౌత్రోస్ ఘలీకి అవకాశం ఇవ్వలేదు. రెండో పర్యాయం ఎన్నిక కాని మొదటి వ్యక్తిగా చరిత్రలో నిల్చిపోయినారు. అతని తర్వాత [[కోఫీ అన్నన్]] ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టినాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1197823" నుండి వెలికితీశారు