బ్రహ్మాండ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 9:
=== యుగములు, వాని ప్రమాణములు ===
{{main|మన్వంతరము}}
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
 
 
* [[కృత యుగము]] = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
* [[త్రేతా యుగము]] = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
* [[ద్వాపర యుగము]] = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
* [[కలియుగము]] = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
 
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము). ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. పగలు గడిచిన తరువాత బ్రహ్మ విశ్రమించును. అప్పుడు సృష్టి నశించి ప్రళయం సంభవిస్తుంది.
 
=== యుగ ధర్మములు ===
కృతయుగంలో స్త్రీపురుషులంతా బహుచక్కనివారు, ఆరోగ్యవంతులు, దీర్ఘాయువులు, ధర్మకార్య తత్పరులు. దురాశ, దంభము, మచ్చరములెరుగరు. సద్యోగర్భమున సంతానము కంటారు. జనులు చెట్ల తొఱ్ఱలయందును, గుహలయందును, భూబిలంబులందును నివసింతురు. అందరిదీ ఒకే జాతి.
 
 
పంక్తి 28:
ద్వాపరయుగంలో జనులకు లోభగుణమతిశయించును. ధనము పట్ల కోరిక పెరుగును. ధర్మ సంఘము, వర్ణ సంకరము కూడా కలుగుతాయి. ఈ బుద్ధిమార్పులను గ్రహించి వ్యాసుడు వేదములను విభజించును. అనావృష్టి, అకాల మరణములు ప్రబలనారంభించును.
 
కలియుగంలో అసత్యము, హింస, అసహనము అతిశయించును. జనులకు రోగబాధలు, ఈతి బాధలు అధికమగును. దుర్వృత్తులు అవలింబింతురు. వ్యభిచారము పెరుగును. జనులందరు వర్తకముపైనే అత్యధికంగా ఆసక్తి చూపెదరు. పుణ్యకార్యఫలితములు అమ్ముకొనసాగెదరు. అతిధి అభ్యాగత ఆదరణ నశించును. జనులు అల్పాయుష్కులగుదురు. ప్రజలకు ఆయువు తక్కువ అగుట వలన కొద్దిపుణ్యకార్యములకే అధిక ఫలములు లభించునట్లు భగవంతుడు చేయును. త్రేతాయుగంలో తపమువలన జనించిన ఫలము ద్వాపరంలో ఒక్క మాసమునందు, కలియుగంలో ఒక్కరోజునందు లభించును.
 
=== రాక్షసులు సూర్యుని అడ్డగించుట ===
ప్రళయకాలంలో జలార్ణవంలో మునిగిన భూమిని తేల్చుటకై జలములనింకించుటకు ఆదిపరబ్రహ్మమూర్తి సూర్యభగవానుని సృజించెను. ఇలా ఉండగా మందేహాసురులనే రాక్షసులు మూడుకోట్లమంది [[సూర్యుడు|సూర్యుని]] కిరణాలను మింగివేస్తూ ఉదయాస్తమయకాలాలలో సూర్యుని నిరోధింపసాగారు. అప్పుడు ఆదిత్యునకు, ఆ రాక్షసులకు యుద్ధాలు జరిగేవి. ఋషులు, మునులు [[గాయత్రి]]ని జపించి [[బ్రహ్మాస్త్రము]]గా చేసి, అర్ఘ్యప్రదానము అనే వింట సంధించి ఆ రాక్షసులను నిర్జింపడానికి సహాయపడ్డారు. తరువాత సూర్యకిరణములు నిరాటంకంగా ప్రసరిస్తున్నాయి.
 
సూర్య గమనం వలన కాలం ఏర్పడుతున్నది. ఆ కాలం కొలమానం ఇలా ఉంది.
 
* 15 నిముషములు ఒక కాష్ఠ; 30 కాష్ఠలు ఒక కల; 30 కలలు ఒక ముహూర్తము; 30 ముహూర్తములు ఒక దినము.
* సంధ్య యనగా ఒక ముహూర్త కాలము. సూర్యోదయం మొదలు మూడు ముహూర్తములు ప్రాతఃకాలము. తరువాతి మూడు ముహూర్తములు సంగమకాలము. ఆపై మూడు ముహూర్తములు మధ్యాహ్నము. పిమ్మట మూడు ముహూర్తములు అపరాహ్ణము. ఆ వెనుక వచ్చు మూడు ముహూర్తములు సాయంకాలము.
* ఇలా దినానికి పగలు 15 ముహూర్తములు, రాత్రి 15 ముహూర్తములు ఉంటాయి.
 
పంక్తి 58:
సాక్షాత్తు పరమేశ్వరానుగ్రహం పొందిన [[పరశురాముడు]] [[అగస్త్యుడు|అగస్త్యుని]] వద్దకు వెళ్ళి ఉపదేశం ఎందుకు పొదవలసివచ్చిందని మునులు ప్రశ్నించారు. అందుకు సూతుడు ఇలా వివరించాడు.
 
పరశురాముడు ఈశ్వరునికి శిష్యుడై పాశుపతాది దివ్యాస్త్రాలను, వాసుదేవ మంత్రమును, త్రిలోక విజయము అనబడు శ్రీకృష్ణకవచమును ఉపదేశంపొందాడు. పుష్కరతీర్ధమున [[తపస్సు]] చేయసాగాడు. ఆ సమీపంలో ఒక [[లేడి|లేళ్ళ]] జంట నీరు త్రాగి విశ్రమించాయి. వాటిని చంపడానికి ఒక వేటగాడు వచ్చి, పరశురామునికి భయపడి, ఒక పొదమాటున దాగి ఉన్నాడు. వాటిలో మగలేడి పూర్వజన్మలో ఒక విప్రబాలకుడు. పరశురాముని దర్శనభాగ్యం వలన దానికి పూర్వజన్మ వృత్తాంతము, జ్ఞానము అవగతమయ్యాయి. ఆడులేడి, మగలేడి మధ్య జరిగిన సంభాషణ సారాంశం ఇది -
 
"పరశురాముడు గొప్పతపస్వి. ఈశ్వరునినుండి కృష్ణకవచం ఉపదేశంపొంది నూరు సంవత్సరాలు జపించినా ఆ [[మంత్రము]] సిద్ధింపలేదు. దైవమునకు భక్తి ప్రదానము. [[శివుడు]], [[నారదుడు]], [[శుకుడు]], [[అంబరీషుడు]], [[బలి]], [[విభీషణుడు]], [[ప్రహ్లాదుడు]] ఉత్తమ భక్తులు. [[వశిష్ఠుడు|వశిష్ఠాది]] మహామునులు, అష్ట[[మనువు]]లు, పరశురాముడు మధ్యతరగతికి చెందినవారు. పరశురాముడు అగస్త్యాశ్రమమునకు పోయి అక్కడ శ్రీకృష్ణామృతస్తోత్రమును ఉపదేశము పొందిన యెడల అతనికి మంత్రము సిద్ధించును."
పంక్తి 81:
# పుష్కరద్వీపం - సేవనుడు.
 
* '''జంబూద్వీపం''' - [[నేరేడు]] పండ్లు ఎక్కువగా ఉంటాయి. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి (1) ఇలావృత ([[హిమాలయాలు]] మరియు [[టిబెట్]] ప్రాంతము) - (2) భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు (3) హరి ([[అరేబియా]]) - దక్షిణము (4) కేతుమాలం ([[ఇరాన్]], [[టర్కీ]] ) పశ్చిమం (5) రమ్యక ([[రష్యా]], [[సైబీరియా]]) ఉత్తరము (6) హిరణ్మయ ([[మంచూరియా]]) ఉత్తరము (7) కురు ([[మంగోలియా]]) ఉత్తరము (8) కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము (9) భరత (భారత ఉపఖండము) - ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
 
* '''ప్లక్షద్వీపం''' - ఇది జంబూద్వీపంకంటె రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి; పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము; నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత
 
*''' శాల్మలీద్వీపం''' - ఇది ప్లక్ష ద్వీపంకంటె పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి; ఇందులో పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష; ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి; నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.
 
* '''కుశద్వీపం''' - ఇది శాల్మలీ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి. పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము; నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ.
 
* '''క్రౌంచద్వీపం''' - ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.; పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిదగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.; నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.; దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము
 
* '''శాకద్వీపం''' - ఇది క్రౌంచ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి; పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి; విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము; నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.
 
* '''పుష్కరద్వీపం''' - ఇది శాక ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి. పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర; నదులు లేవు.
 
=== విశ్వే దేవతలు ===
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాండ_పురాణం" నుండి వెలికితీశారు