బ్రహ్మాస్త్రం (పౌరాణిక ఆయుధం): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q4096158 (translate me)
చి Wikipedia python library
పంక్తి 8:
 
 
అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. పూర్వం [[బ్రహ్మ]]దేవుడు దీనిని ఇంద్రునికొరకై నిర్మించి ఇచ్చాడు. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం. దాని దేహము మంటలతో నిండి ఉంది. బంగారముతో అలంకరింపబడిన దాని పొన్ను ప్రకాశిస్తుంది. అది సకలభూతములలోని తేజస్సుతో నిర్మింపబడి సూర్యునివలె ప్రకాశిస్తున్నది. ధూమముతో కూడిన ప్రళయకాలాగ్నివలె ప్రజ్వలిస్తున్నది. అది నరులు, గజములు, అశ్వముల సముదాయమును, బ్రద్దలుకొట్టినది. ఎన్నో ద్వారములను, కోట గడియలను, పర్వతములను బ్రద్దలుకొట్టినది. దాని శరీరము రక్తము చేత, క్రొవ్వు చేత పూయబడి భయంకరముగా ఉండెను. వజ్రమువంటి సారము కలది. భయంకరమైన ధ్వని చేయునది. యుద్ధములో డేగలకు, గ్రద్దలకు, నక్కల గుంపులకు, రాక్షసులకు ఆహారమునిచ్చునది. గరుత్మంతుని విచిత్ర వర్ణములు గల అనేక విధములైన రెక్కలు కట్టబడి మంచి వేగము ఉండునట్లు చేయబడినది.
 
ఆ అస్త్రం రాక్షసులకు వినాశకరం. వానరులకు ఆనందహేతువు. మూడు లోకములలో ఉత్తమమైనది. ఇక్ష్వాకువంశీయులకు శుభకరం. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడువడిన వజ్రసమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, అతని రక్తంతో పూయబడినదై, ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు.
పంక్తి 21:
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
* సుందరకాండము - రచన: శ్రీమాన్ ఎస్.టి.పి. కోనప్పాచార్యులు - ప్రచురణ: రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి
 
[[వర్గం:దేవతల ఆయుధాలు]]