భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ, విస్తరణ మూసలు, మరియు వర్గం చేర్పు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{వికీకరణ}}
'''బ్రిటీషు రాజ్''' లేదా '''బ్రిటీషు ఇండియా''', అధికారికముగా బ్రిటీషు '''ఇండియన్ సామ్రాజ్యము''', మరియు అంతర్జాతీయముగా మరియు సమకాలికముగా, '''ఇండియా''', అని ప్రాంతము [[1858]] నుండి [[1947]] వరకు [[బ్రిటీషు సామ్రాజ్యము]]లో భాగమైన [[భారత ఉపఖండము]]ను ఉద్దేశించి ఉపయోగిస్తారు. నేరుగా యునైటెడ్ కింగ్‌డం పాలనలో ఉన్న ప్రాంతాలతో పాటు, బ్రిటీషు సార్వాభౌమాధికారాన్ని అంగీకరిస్తూ సొంత రాజ్యాలను పాలించిన అనేక [[సంస్థానాధీశులు]] పాలించిన ప్రాంతాలు కూడా బ్రిటీషు ఇండియా క్రిందకి వస్తాయి. బ్రిటీషు ప్రభుత్వముతో సంధి ఒప్పందాలు కుదుర్చుకున్న ఈ సంస్థానాధీశులందరికీ రక్షణ కల్పించి అంతర్జాతీయ వ్యవహారాలలో వీరితరఫున గ్రేట్ బ్రిటన్ ప్రాతినిధ్యము వహించినందుకు గాను సంస్థానాలకు కొంతవరకు స్థానిక స్వయంప్రతిపత్తి కల్పించబడినది. బ్రిటీషు ఇండియా సామ్రాజ్యములో ప్రస్తుత [[భారత దేశము]], [[పాకిస్తాన్]] మరియు [[బంగ్లాదేశ్]]లతో పాటు వివిధ కాలాల్లో, [[అదెన్ కాలనీ|అదెన్]](1839 నుండి 1937 వరకు), [[ఎగువ బర్మా]] (1852 నుండి) మరియు [[దిగువ బర్మా]] (1886 నుండి) 1937వరకు, [[బ్రిటీషు సొమాలీలాండ్]] (1884 నుండి 1898 వరకు స్వల్పకాలము పాటు) మరియు [[సింగపూరు]] (1819 నుండి 1867వరకు) భాగములుగా ఉన్నవి. బ్రిటీషు ఇండియాకు మధ్యప్రాచ్యములోని బ్రిటీషు స్థావరాలకు కొంత సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఆ ప్రాంతపు భాగాలలో చాలామటుకు భారతీయ రూపాయి కరెన్సీగా ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత ఇప్పుడు ఇరాక్ గా యేర్పడిన ప్రాంతమును బ్రిటీషు ప్రభుత్వము భారతీయ కార్యాలయమునుండే పరిపాలించినది.
 
తన సొంత పాస్పోర్టులు జారీచేసిన ''భారత సామ్రాజ్యము'', ప్రాంతీయముగా మరియు అంతర్జాతీయముగా సాధారణంగా ''ఇండియా'' అనే పిలవబడేది. ''ఇండియా''గా ఇది [[నానారాజ్యసమితి]] యొక్క వ్యవస్థాపక సభ్యురాలు మరియు 1900, 1920, 1928, 1932 మరియు 1936లో జరిగిన [[వేసవి ఒలంపిక్ క్రీడల]] కు సభ్యదేశము.
 
ఈ ప్రాంతములోనీ ఇతర దేశాలలో, [[సిలోన్]] (ప్రస్తుత [[శ్రీలంక]]), 1802లో అమియన్స్ ఒప్పందము ప్రకారము యునైటెడ్ కింగ్‌డమ్ కు దత్తము చేయబడినది. అయితే ఇది బ్రిటీషు కాలనీ అయినప్పటీకీ బ్రిటీషు ఇండియాలో భాగము కాదు. నేపాల్ మరియు భూటాన్ రాజ్యాలు గ్రేట్ బ్రిటన్ తో కుదుర్చుకున్న ఒప్పందాల వలన స్వతంత్ర రాజ్యాలుగా గుర్తింపబడినవి. ఇవి కూడా బ్రిటీషు ఇండియాలో భాగము కాదు. 1861 లో కుదుర్చుకున్న "ఆంగ్లో-సిక్కిమీస్ ఒప్పందము" తదనంతరము [[సిక్కిం]] రాజ్యము ఒక సంస్థానముగా యేర్పాటు చేయబడినది. అయితే దీని సార్వభౌమత్వ విషయము నిర్ధిష్టంగా నిర్వచించలేదు.<ref> "Sikkim." Encyclopædia Britannica. 2007. Encyclopædia Britannica Online. 5 Aug. 2007 <http://www.britannica.com/eb/article-46212>.</ref> [[మాల్దీవులు]] 1867 నుండి 1965 వరకు బ్రిటీషు ప్రొటెక్టరేటుగా ఉన్నవి కానీ బ్రిటీషు ఇండియాలో భాగము కాదు.
 
ఈ పాలనా వ్యవస్థ 1858లో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ తన పాలనా బాధ్యతలను [[విక్టోరియా మహారాణి]]కి బదలాయించడముతో ప్రారంభమైనది. విక్టోరియా 1877లో భారతదేశ సామ్రాజ్ఞిగా ప్రకటించబడినది. బ్రిటీషు పాలన 1947లో బ్రిటీషు ఇండియా సామ్రాజ్యము రెండు స్వతంత్ర దేశాలుగా విభజించబడే వరకు కొనసాగినది. 1947 ఆగష్టు 14 న డొమినయన్ ఆఫ్ పాకిస్తాన్ యేర్పడినది. ఆగష్టు 15న యూనియన్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది.
 
==మూలాలు==