భువనచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = భువనచంద్ర
| residence =
| other_names =
| image =BuvanaChandra-telugu cenema.jpg
| imagesize = 200px
| caption = భువనచంద్ర
| birth_name = భువనచంద్ర
| birth_date = [[ఆగష్టు 17]]
| birth_place = [[నూజివీడు]] దగ్గర గుమ్మపూడి
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = తెలుగు సినీ గేయ రచయిత
| occupation =
| title =
పంక్తి 24:
| religion =
| wife =
| spouse= శేషసామ్రాజ్య లక్ష్మి
| partner =
| children =శ్రీనివాస్
పంక్తి 35:
| weight =
}}
[[భువనచంద్ర]] ఒక ప్రముఖ తెలుసు సినీ గేయ రచయిత. ఈయన పుట్టింది [[నూజివీడు]] దగ్గర గుమ్మపూడిలో. <ref>మే 3, 2009 ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైన భువన చంద్ర ఇంటర్వ్యూ ఆధారంగా</ref>ఈయనకు ముగ్గురు అన్నలు మరియు నలుగురు అక్కలు. ఈయన తల్లితండ్రులకు ఎనిమిదో సంతానం. ఎనిమిదేళ్ళ నుంచీ నవలలు చదవడం ప్రారంభించాడు. ఈయన నాన్న సుబ్రహ్మణ్య శర్మ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. వీరి కుటుంబం, తరువాత [[చింతలపూడి]] వచ్చేశారు. ఈయన బడిలో చదివే వయసులో చింతలపూడి గ్రంథాలయంలో [[చందమామ]] మొదలైన కథల పుస్తకాలు మొదలుకొని పెద్ద పుస్తకాలను సైతం ఆసక్తిగా చదివే వాడు. రోజూ పాఠశాల నుంచి వచ్చేటపుడు గోడపై సినిమా పోస్టర్ల పై ఉన్న [[ఆరుద్ర]], [[దాశరథి]], [[ఆత్రేయ]], [[శ్రీశ్రీ]] మొదలైన పేర్లను చూసి, వాటిపక్కన సుద్ద ముక్కలతో తనపేరు రాసుకునేవాడు. అలా రచయిత కావాలన్న కోరికకు ఆయనకు చిన్నతనంలోనే బీజం పడిందని చెప్పవచ్చు.
 
చింతలపూడి గ్రామంలో విశ్వనాథాశ్రమం ఉండేది. దానికి స్వామీజీ బోధానందపురి మహరాజ్. అప్పట్లో అక్కడ రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. అందులో భాగంగా అక్కడ [[హరికథ]]లు, దేవీ భాగవతం, యోగావాశిష్టం మొదలైన ఎన్నో కార్యక్రమాలు జరుగుతుండేవి. ఒకసారి ఈయన మిత్రుడు రంగా ప్రసాదం కోసమని బలవంతంగా ఆ దేవాలయానికి ఈడ్చుకునివెళ్ళాడు. అలా కార్యక్రమాలు ఆయన చెవినపడ్డాయి. తరువాత ఇంకా వినాలనిపించింది. తరువాత అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. అలా ఆయన జీవితంలో ఏదో తెలియని మార్పు సంభవించింది. ఆ రోజు నుంచీ, స్కూలు, గ్రంథాలయం, ఆపై ఆశ్రమం ఆయన దినచర్యగా మారింది. స్వామీజీ ప్రసంగాలను నిత్యం వింటూ, మనిషంటే ఏమిటి? దేవుడంటే ఏమిటి? ఇలాంటి తాత్విక చింతనలతో కొద్ది కాలం గడిపేవాడు. చదువు పూర్తయిన తరువాత ఎయిర్‌ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2012-10-11/did-you-know-/34386130_1_pawan-kalyan-iaf-indian-air-force ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన భువన చంద్ర]</ref >
"https://te.wikipedia.org/wiki/భువనచంద్ర" నుండి వెలికితీశారు