మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ మహిళా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 39:
 
==చేజారిన వేషం==
ఒప్పందం ప్రకారం వాహిని వారి నాలుగవ చిత్రం, దర్శకుడు [[కె.వి.రెడ్డి]] తొలి చిత్రం [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] (1942)లో కుమారి నటించాల్సి ఉంది. అయితే అదే సమయంలో 'తులసీదాసు' చిత్రం షూటింగు నిమిత్తం వాహినీ వారి అనుమతితో కుమారి బొంబాయి వెళ్ళడంతో భక్త పోతనలో అవకాశం చేజారింది. తులసీదాసు చిత్రం కోసం ఆరు నేలలు బొంబాయిలోనే కుమారి ఉండిపోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి నాయకుడు [[కె.ఎస్.ప్రకాశరావు]], దర్శకుడు రమణారావు. ఆరు నెలలు అక్కడే ఉన్నా షూటింగు సజావుగా సాగక ఆగిపోవడం కుమారిని మానసికంగా కుంగదీసింది. ఈ తప్పటడుగు పడకుండా ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది.
 
==అయిదేళ్ళ విరామం==
పంక్తి 48:
 
==చివరి అవకాశాలు==
అదే ఏడాది విడుదలైన మరో చిత్రం [[ఆకాశరాజు (సినిమా)|ఆకాశరాజు]]లో కూడా కుమారి నాయికగా నటించారు. [[విశ్వనాథ సత్యనారాయణ]] రచన చేసిన ఈ జానపద చిత్రం కూడా విజయవంతం కాలేదు. ఒప్పందం ప్రకారం [[భక్త పోతన]] చిత్రంలో నటించలేదు కనుక 10 ఏళ్ళ అనంతరం వాహినీ సంస్థ నిర్మించిన [[మల్లీశ్వరి]] (1951) చిత్రంలో కుమారి ఒక పాత్రను పోషించాల్సి వచ్చింది. ఇందులో ఆమె మహారాణిగా కనిపిస్తుంది, అదీ కొద్దిసేపే. ఆ తర్వాత [[పెంపుడు కొడుకు]] (1953 తెలుగు, తమిళం) చిత్రంలోనూ, [[కాళహస్తి మహాత్యం]] (1954) చిత్రంలోనూ ఆమె నటించారు. [[కాళహస్తి మహాత్యం]] చిత్రంలో [[పి.సుశీల]] తన మొదటి పాటలలో ఒకటైన ''[[శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి (పాట)|శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి]]'' కుమారికి పాడటం విశేషం. ఆ తర్వాత వేషాలు కరువవడంతో కుమారి చిత్రరంగానికి శాశ్వతంగా దూరమయ్యారు.
 
==చివరి రోజులు==
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు