మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 3:
 
 
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలోమెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని [[మద్రాసు]] నగరానికి మారింది. ఆరోజులలో ''చరిత్ర చతురాననుడు''గా ప్రసిద్ధి చెందిన [[చిలుకూరి వీరభద్రరావు]]తో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం [[విజ్ఞాన సర్వస్వం]] కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]], [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[ఆచంట లక్ష్మీపతి]], మరియు [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.
 
 
పంక్తి 9:
 
 
తాము సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ ''ఎపిగ్రాఫియా ఇండియా'', [[భారతి]], [[శారద]], [[ఆంధ్ర పత్రిక]] వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. [[ఘంటసాల]] ప్రాకృత శాసనాల గురించి శర్మ వ్రాసిన వ్యాసం అతని మరణానంతరం ప్రచురితమయ్యింది. శాసనాల లిపిని పరిశోధించడంలోనూ అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు శర్మ మాత్రమే అనవచ్చును. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశిలించి సమన్వయ శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవాడు<ref name="BSL"/>. [[అహదహనకర శాసనం]]లోని ఒక అక్షరాన్ని శర్మ "ఱ"గా గుర్తించగా [[వేటూరి ప్రభాకర శాస్త్రి]] దానిని "ష+జ" ('ష' క్రింద 'జ' వత్తు) అని అన్నాడు. ఈ విషయమై వారిద్దరికీ ఆసక్తికరమైన వాదోపవాదాలు నడచాయి. అయితే ఎంతటి పాండిత్యమూ, పట్టుదలా ఉన్నా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుఖోవడానికీ, ఎదుటివారి సూచనలను గౌరవించడానికీ ఆయన సిద్ధంగా ఉండేవాడు.
 
 
పంక్తి 15:
 
 
సోమశేఖర శర్మ తన అధ్యయనాన్ని ఎక్కువగా మధ్య ఆంధ్ర యుగ చరిత్రపై సాగించాడు. సమస్యా భూయిష్టమైన [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] కాల నిర్ణయంపై కూలంకషంగా కృషిచేశాడు. [[కాకతీయులు]] అన్నా, [[తెలంగాణ]]మన్నా శర్మకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రాంతం రాజవంశాలకు సంబందించి 80కి పైగా శాసనాలను లఘు వ్యాఖ్యలతో ప్రచురించాడు. తన మిత్రుడు [[నేలటూరు వెంకటరమణయ్య]]తో కలిసి ఆచార్య యజ్దానీ సంపాదకత్వంలొ వెలువడిన 'Early History of Deccan'లో సమగ్రమైన కాకతీయుల చరిత్రను వ్రాశాడు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే సమయం గురించి పరిశోధించాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో [[ముసునూరు కాపయ నాయకుడు]], [[ముసునూరు ప్రోలయ నాయకుడు]] తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History'లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు<ref name="BSL"/>.
 
 
అయితే సోమశేఖర శర్మ పరిశోధనలలో అగ్రస్థానం వహించే రచన 'The History of Reddi Kingdom and Kondaveedu and Rajahmundry'. అసంఖ్యాకమైన శాసనాలనూ, కవుల కావ్యాలనూ, ముస్లిం చరిత్రకారుల రచనలనూ పరిశోధించి, నమ్మదగిన సమాచారాన్ని నిగ్గుదేల్చి తయారు చేసిన ఉత్తమ రచన ఇది. ఆంధ్ర దేశానికి చెందిన విజయనగర, వెలమ, బహమనీ, ముసునూరు రాజ్యాల చరిత్రనూ, ఆ రాజ్యాల మధ్య సంబంధాలనూ వివరించే ఆంధ్ర చరిత్ర ఇది.
 
మల్లంపల్లి సోమశేఖర శర్మ [[1963]]లో మరణించాడు.
పంక్తి 27:
* '''నా నెల్లూరు జిల్లా పర్యటన''' - శాసనాన్వేషణా యాత్రలలో ఎదుర్కొన్న సమస్యలు, కష్ట నష్టాలు, ప్రజల నమ్మకాలు గురించి.
* Corpus of inscriptions in the Telangana District part IV (Archaeological series) - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ (1973)
* సోమశేఖర శర్మ విరచితము - ఆంధ్రవీరులు - 1920
* రాగతరంగిణి - విచారకరమైన చిన్న కథ - 1916 - మనోరమ ప్రెస్
* విజయ తోరణము - రేడియో నాటికలు
* ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) - 1976 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ
* ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము - ప్రచురణ: ఆధునిక వాఙ్మయ కుటీరము, 22 దివాన్ రామ్ అయ్యంగార్ రోడ్డు, మద్రాసు-7, 1948, 128 పేజీలు - వెల రూ.1-8 [http://www.kosal.us/History/Andhra%20Kingdoms%20in%20Ancient%20India.html]
* రెడ్డి రాజ్యాల చరిత్ర ('హిస్టరీ ఆఫ్ రెడ్డీ కింగ్‌డమ్స్' ఆంగ్ల రచనకు ఆర్.వెంకటేశ్వరరావు తెలుగు అనువాదం)[http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=955]