మహారాష్ట్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 26:
}}
 
'''మహారాష్ట్ర''' (Maharashtra), ([[మరాఠీ]]: महाराष्ट्र ) [[భారతదేశం]]లో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం ([[ఉత్తరప్రదేశ్]] తరువాతి స్థానం). మహారాష్ట్రకు [[గుజరాత్]], [[మధ్యప్రదేశ్]], [[ఛత్తీస్‌గఢ్]], [[తెలంగాణ]], [[కర్నాటక]], [[గోవా]] రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన [[దాద్రా-నగరుహవేలి]] తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన [[అరేబియా సముద్రం]] ఉన్నది. [[ముంబయి]] నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.
 
మహారాష్ట్ర ప్రాంతము [[ఋగ్వేదం]] లో ''రాష్ట్ర''అనీ, [[అశోకుడు|అశోకుని]] శాసనాలలో ''రాష్ట్రీకము'' అనీ, అతరువాత [[హువాన్‌త్సాంగ్]] వంటి యాత్రికుల రచనలలో ''మహారాష్ట్ర'' అనీ ప్రస్తావింపబడినది. ''మహారాష్ట్రి'' అనే [[ప్రాకృత భాష|ప్రాకృత]] పదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు.
 
ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ''మహాకాంతార'' (అంటే పెద్ద అడవులు) అన్నపదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు.
పంక్తి 44:
=== ప్రాచీన, మధ్య యుగ చరిత్ర ===
 
మహారాష్ట్ర గురించి క్రీ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి. అప్పుడు ''మహారాష్ట్రి'' అనే భాషగురించి ప్రస్తావన జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం "దండకారణ్యం" అనబడింది. తరువాత [[అశోకుడు]] పాలించిన [[మగధ సామ్రాజ్యం]]లో మహారాష్ట్ర ఒక భాగమైంది. ఇప్పటి [[ముంబాయి]] నగరానికి ఉత్తరాన ఉన్న [[సోపార]] రేవు పట్టణంనుండి [[కొచ్చి]] ([[భారతదేశం]]) తోను, తూర్పు [[ఆఫ్రికా]], [[ఇరాక్|మెసపొటేమియా]] లతోను వర్తక సంబంధాలుండేవి.
 
 
[[మౌర్యసామ్రాజ్యం]] పతనానంతరం క్రీ.పూ. 230 - క్రీ.శ.225 మధ్య మహారాష్ట్ర ప్రాంతం [[శాతవాహనసామ్రాజ్యం]]లో భాగమయ్యింది. ఈ కాలంలో ఇక్కడి సంస్కృతి, [[మరాఠీ భాష]] బాగా వృద్దిచెందాయి. క్రీ.శ. 78 ప్రాంతంలో పాలించిన [[గౌతమీపుత్ర శాతకర్ణి]] పేరు మీద [[శాలివాహన శకం]] ఆరంభమయ్యింది. క్రీ.శ. 3వ శతాబ్ది సమయంలో శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది.
 
 
క్రీ.శ. 250-525లో [[వాకాటకులు]] [[విదర్భ]] ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో కళలు, సాంకేతిక పరిజ్ఞానము, నాగరికత బాగా వృద్ధిచెందాయి. 6వ శతాబ్దానికల్లా మహారాష్ట్ర ప్రాంతమును [[బాదామి చాళుక్యులు]] పాలించారు. 753వ సంవత్సరంలో [[రాష్ట్రకూటులు]] మహారాష్ట్రపాలకులయ్యారు. వారి సామ్రాజ్యం దాదాపు దక్కన్ అంతా విస్తరించింది. మరలా రాష్ట్రకూటులను ఓడించి బాదామి చాళుక్యులు 973-1189మధ్య మహారాష్ట్రలో కొంతభాగాన్ని పాలించారు. 1189 తరువాత [[దేవగిరి యాదవులు]] ఇక్కడి రాజులయ్యారు.
క్రీ.శ.13వ శతాబ్దంలో [[ఢిల్లీ సుల్తానులు]] మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకొన్నారు. మొదట [[అల్లాఉద్దీన్ ఖిల్జీ]], ఆతరువాత [[ముహమ్మద్ బిన్ తుఘ్లక్]] దక్కన్‌లో తమ అధికారాన్ని నెలకొలిపారు. 1347లో తుఘ్లక్‌ల రాజ్యం పతనమయినాక [[బీజాపూర్]]‌కు చెందిన [[బహమనీ సుల్తానులు]] తరువాత 150 సంవత్సరాలు ఇక్కడ రాజ్యం నెరపారు. 16వ శతాబ్దంనాటికి మహారాష్ట్ర మధ్యప్రాంతం [[ముఘల్ సామ్రాజ్యం|ముఘల్ సామ్రాజ్యానికి]] అధీనులైన చిన్న చిన్న ముస్లిమ్‌రాజుల అధీనంలో ఉండేది. తీరప్రాంతంలో [[పోర్చుగీసు]]వారు అధికారం చేజిక్కించుకొని, [[సుగంధ ద్రవ్యాల వర్తకం]] పై గుత్తాధిపత్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నారు.
 
=== మరాఠాలు, పేష్వాలు ===
 
[[దస్త్రం:Shivaji_the_Great.jpg|thumb|right|శివాజీ మహారాజు చిత్రం]]
17వ శతాబ్దారంభంలో స్థానికులైన మరాఠాల నాయకత్వంలో [[మరాఠా సామ్రాజ్యం]] వ్రేళ్ళూనుకొనసాగింది. 1674లో [[ఛత్రపతి శివాజీ|శివాజీ భోన్సలే]] రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహారాజు]]గా ప్రసిద్ధుడైన ఈ నాయకుడు అప్పటి ముఘల్ ‌చక్రవర్తి [[ఔరంగజేబు]] సైన్యంతోను, బిజాపూర్ నవాబు [[ఆదిల్ షా]] సైన్యంతోను పలుయుద్ధాలు సాగించాడు. అప్పుడే మహారాష్ట్రలో తమఅధిపత్యాన్ని విస్తరిస్తున్న బ్రిటిష్‌వారితో కూడా కొన్ని చిన్న యుద్ధాలు చేశాడు. మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రసిద్ధుడైన, జనప్రియుడైన, పరిపాలనా దక్షతగల రాజుగా శివాజీని పేర్కొనవచ్చును.
 
1680దశకంలో శివాజీ కొడుకు [[శంభాజీ భోన్సలే]] ఔరంగజేబు చేత చిక్కి ఉరితీయబడ్డాడు. [[శంభాజీ]] తమ్ముడైన [[రాజారామ్ భోన్సలే]] తమిళప్రాంతానికి పారిపోయి "[[జింజీ]] కోట"లో తలదాచుకొన్నాడు. 18వ శతాబ్దంలో [[రాజారామ్]] కాస్త బలపడిన సమయానికి పరిస్థితులు మారిపోయాయి.
పంక్తి 63:
[[శంభాజీ]] కొడుకు [[షాహు భోన్సలే]] అసలైన వారసునిగా, పినతల్లి [[తారాబాయి|తారాబాయితో]] కొంత ఘర్షణను ఎదుర్కొని, తన మంత్రి (పేష్వా)[[బాలాజీ విశ్వనాధ్]] సహాయంతో సింహాసనం చేజిక్కించుకొన్నాడు. తరువాత 4దశాబ్దాలు భోన్సలేలు నామమాత్రంగా అధికారంలో ఉన్నారు పేష్వాలు నిజమైన అధికారాన్ని నెరపారు. ముఘల్‌లను ఓడించిన పేష్వాల అధికారం ఉత్తరాన [[పానిపట్]] ‌నుండి దక్షిణాన [[తంజావూరు]] వరకు, [[గుజరాత్]]‌ లోని మెహసనా నుండి [[మధ్యప్రదేశ్‌]] ‌లోని [[గ్వాలియర్]], [[ఇండోర్‌]]ల వరకు విస్తరించింది.
 
[[బాలాజీ విశ్వనాధ్]], అతని కొడుకు [[బాజీరావు పేష్వా]]‌లు వారిపాలనలో ఉన్న ప్రాంతంలో రెవిన్యూ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకు వారు ముఘల్ చక్రవర్తుల విధానాలను తమ స్వంత విధానాలతో జోడించారు. [[పేష్వా]]ల కాలంలో [[వర్తకం]], [[బ్యాంకింగ్]] వ్యవస్థలు పటిష్టంగా అభివృద్ధిచెందాయి. [[వ్యవసాయం]] మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. పేష్వాలు పశ్చిమతీరంలో నౌకాభద్రతను అభివృద్ధిచేయసాగారు. అందుకై కొలాబాలో నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. నౌకాబలంమీద, సముద్ర వర్తకంమీద ఆధారపడిన పాశ్చాత్యదేశాల స్థావరాల అధిపత్యానికి ఇది కలవరపాటు కలిగించింది.
 
 
అదేసమయంలో మరాఠా ప్రాంతాలుకాని చోట్ల అధిపత్యం సామంతులకు కట్టబెట్టారు. అలా గ్వాలియర్‌లో సింథియాలు, ఇండోర్‌లో హోల్కర్‌లు, బరోడాలో గైక్వాడ్‌లు, ధార్‌లో పవార్‌లు స్థానిక రాజులయ్యారు.
 
1761లో [[మూడవ పానిపట్టు యుద్ధం]]లో అఫ్ఘన్ సేనాని [[అహ్మద్‌షా అబ్దాలీ]] సైన్యంతో జరిగిన యుద్ధంలో మరాఠాలు దారుణంగా పరాజితులయ్యారు. దీనితో మరాఠా సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలయ్యింది. [[పూణె|పూణే]]లో మాత్రం పేష్వాకుటుంబాల రాజ్యం కొనసాగింది. స్థానిక సంస్థానాధీశులు తమ రాజ్యాలను చక్కబెట్టుకొనసాగారు. భోన్సలేలకు దక్కన్‌లో [[సతారా]] కేంద్రమయ్యింది. వారి కుటుంబంలో [[రాజారామ్]] వంశానికి చెందినవారు (1708లో [[షాహు]] అధికారాన్ని ఒప్పనివారు)మాత్రం[[కొల్హాపూర్]]‌లో స్థిరపడ్డారు. 19వ శతాబ్దారంభం వరకు కొల్హాపూర్‌లో వీరి పాలన సాగింది.
 
=== బ్రిటిష్ రాజ్య కాలం ===
భారత రాజకీయాల్లోకి [[బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ]] రావడంతో వారికి, మరాఠాలకు పోరులు మొదలయ్యాయి. 1777-1818 మధ్య మూడు [[ఆంగ్ల-మరాఠా యుద్ధాలు]] జరిగాయి. తత్ఫలితంగా 1819నాటికి మహారాష్ట్రలో పేష్వాల పాలనలో ఉన్న భూభాగం ఆంగ్లేయుల పరమైంది. మరాఠా సామ్రాజ్యం అంతమైంది.
బ్రిటిష్‌వారు ఈ ప్రాంతాన్ని [[బొంబాయి ప్రెసిడెన్సీ]]లో భాగంగా పాలించారు. అది ప్రస్తుత [[పాకిస్తాన్]]లోని [[కరాచీ]]నుండి ఉత్తర దక్కన్ వరకు విస్తరించి ఉండేది. చాలా మరాఠా రాజ్యాలు మాత్రం బ్రిటిష్ సామంతరాజ్యాలుగా మిగిలి ఉన్నాయి. వాటిలో [[నాగపూర్]], [[సతారా]], [[కొల్హాపూర్]]‌లు ముఖ్యమైనవి. 1848లో సతారా, 1853లో నాగపూర్, 1903లో బేరార్‌లు బ్రిటిష్ రాజ్యంలో కలిపివేయబడ్డాయి. మరాఠ్వాడా ప్రాంతం [[హైదరాబాద్]] [[నిజాం]] రాష్ట్రంలో భాగంగా ఉండేది.
 
పంక్తి 90:
మహారాష్ట్రకు ఉత్తరాన, మధ్యప్రదేశ్ సరిహద్దులలో [[సాత్పూరా]] పర్వతశ్రేణులున్నాయి.
 
[[నర్మద]], [[తపతి]] నదులు మహారాష్ట్ర ఉత్తరభాగంలో నీటి వనరులు. ఇవి పడమటివైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. [[వైన గంగ]] వంటి నదులు దక్షిణదిశగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక బహుళార్ధ సాధక ప్రాజెక్టులున్నాయి.
 
దక్కన్ పీఠభూమిలో చాలాభాగం నల్లరేగడినేల. ప్రత్తి వ్యవసాయానికి అనుకూలమైనది.
పంక్తి 100:
* [[గుగమల్ నేషనల్ పార్కు]], దీనినే [[మేల్ఘాట్ టైగర్ రిజర్వ్]] అని కూడా అంటారు - ఇది విదర్భ ప్రాంతంలో [[అమరావతి]] జిల్లాలో ఉన్నది.
 
* [[నవీగావ్ నేషనల్ పార్కు]] - విదర్భ ప్రాంతంలో నాగపూర్ దగ్గర - పలు జాతుల పక్షులకు, లేళ్ళకు, ఎలుగుబంట్లకు, చిరుతలకు ఆవాసం.
* [[పెంచ్ నేషనల్ పార్కు]] - నాగపూర్ జిల్లాలో ఉన్నది. ఈ పార్కు [[మధ్యప్రదేశ్]]‌లో కూడా విస్తరించింది. దీనిని టైగర్ ప్రాజెక్టుగా వృద్ధిపరచారు.
* [[సంజయ్ గాంధీ నేషనల్ పార్కు]] - దీనినే [[బోరివిలి నేషనల్ పార్కు]] అంటారు. [[ముంబాయి]] నగరంలో ఉన్నది. నగర పరిధిలో ఉన్న నేషనల్ పార్కులతో పోలిస్తే ప్రపంచంలో పెద్దది.
పంక్తి 110:
 
=== స్థూల ఉత్పత్తి ===
మహారాష్ట్ర స్థూల రాష్ట్రోత్పత్తి వివరాలు (మార్కెట్ ధరల ఆధారంగా, కోట్ల రూపాయలలో) క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. [http://mospi.nic.in/mospi_nad_main.htm భారత ప్రభుత్వం గణాంకవిభాగం అంచనా].
{| class="wikitable"
|-
పంక్తి 167:
మొత్తం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులలో 13% మహారాష్ట్రనుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో 64% ప్రజలు వ్యవసాయ, సంబంధిత వృత్తులపై ఆధారపడి ఉన్నారు. కాని స్థూల రాష్ట్రాదాయంలో 46% పరిశ్రమలనుండే వస్తున్నది.
దేశంలో మొదటి 500 వ్యాపార సంస్థలలో 41% పైగా సంస్థలు (Over 41% of the ''S&P CNX 500'' conglomerates) వాటి ప్రధాన కార్యాలయాలను మహారాష్ట్రలో కలిగి ఉన్నాయి.
 
మహారాష్ట్రలో ముఖ్యమైన పరిశ్రమలు:
పంక్తి 205:
 
భారతదేశానికి ఆర్ధిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు.
దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు, భీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబాయ నగరంలో ఉన్నాయి. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది [[ఆసియా]]లో అత్యంత పురాతనమైనది.
 
ముంబాయిలో సినిమా పరిశ్రమను [[బాలీవుడ్]] అని చమత్కరిస్తుంటారు. ([[అమెరికా]]లోని [[హాలీవుడ్]]ను పురస్కరించికొని). హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమకు ఇది ప్రధాన కేంద్రం.
ఇటీవల [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] పరిశ్రమ ఊపందుకొంటున్నది. పూణే, నాగపూర్, ముంబాయి, నాసిక్ లలో సాఫ్ట్‌వేర్ పార్కులు నెలకొలుపబడ్డాయి.
 
బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తు (దేశంలో 13%), అణు విద్యుత్తు (దేశంలో 17%) - ఈ రెండింటిలోనూ మహారాష్ట్రదే దేశంలో అగ్రస్థానం.
పంక్తి 245:
== జనవిస్తరణ ==
 
మహారాష్ట్ర స్థానికులను '''మహారాష్ట్రియన్''' అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 96,752,247. ఇందులో [[మరాఠీ]] మాతృభాషగా ఉన్నవారు 62,481,681. రాష్ట్రం జనసాంద్రత చ.కి.మీ.కు 322.5. రాష్ట్రజనాభాలో పురుషులు 5.03 కోట్లు, స్త్రీలు 4.64 కోట్లు. ఆడ, మగ నిష్పత్తి 922/1000. పట్టణ జనాభా 42.4 %. అక్షరాస్యులు 77.27%. స్రీలలో అక్షరాస్యత 67.5%, పురుషులలో 86.2%. 1991-2001 మధ్య జనాభా వృద్ధిరేటు 22.57%.
 
 
అధికార భాష మరాఠీ. పెద్ద నగరమైన ముంబాయిలో మరాఠీతో బాటు [[హిందీ]], [[గుజరాతీ]], [[ఇంగ్లీషు]] భాషలు విస్తారంగా మాట్లాడుతారు. రాష్ట్ర వాయువ్యప్రాంతంలో [[అహిరాణి]] అనే మాండలికం కొద్దిమంది మాట్లాడుతారు. దక్షిణ కొంకణ ప్రాంతంలో [[మాల్వాణి]] అని పిలువబడే [[కొంకణి భాష]]మాండలికం మాట్లాడుతారు. దీనిని మరాఠీ భాష మాండలికం అనికూడా అనవచ్చు. దక్కన్ అంతర్భాగంలో [[దేశ భాషి]] అనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు. విదర్భ ప్రాంతంలో [[వర్హాది]]అనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు.
 
 
పంక్తి 285:
== సంస్కృతి ==
 
మహారాష్ట్ర సంస్కృతి అన్ని మతాల, వర్గాల జీవనశైలికి కలయికగా రూపు దిద్దుకొంది. అత్యధిక సంఖ్యాక జనులు హిందువులైనందున మహారాష్ట్ర సంస్కృతిలో ఆ ప్రభావం కనిపిస్తుంది.
 
 
మహారాష్ట్రలో చాలా పురాతనమైన మందిరాలున్నాయి. ఇక్కడి మందిరాలలో ఉత్తర, దక్షిణ భారతాల నిర్మాణశైలుల కలయిక ప్రతిబింబిస్తుంది. ఇంకా హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల మేళవింపు మందిరాల్లోనూ, ఆచారాల్లోనూ చూడవచ్చును. మహారాష్ట్రలోని మందిరాలలో [[పండరిపూర్]]‌లోని [[విఠలుడు|విఠలుని]] ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. [[అజంతా గుహలు|అజంతా]] చిత్రాలు,[[ఎల్లోరా గుహలు|ఎల్లోరా]]శిల్పాలు, [[ఔరంగాబాదు]] మసీదు ప్రసిద్ధ పర్యాటక స్థలాలు. ఇంకా [[రాయగఢ్]], [[ప్రతాప్‌గఢ్]], [[సింధుదుర్గ్]] వంటి కోటలు కూడా చూడదగినవి.
 
గోంధల్, లవని, భరుద్, పొవడా వంటివి మహారాష్ట్ర జానపదసంగీత విధానాలు.
 
[[ధ్యానేశ్వరుడు]] రచించిన "భావార్ధ దీపిక" (ధ్యానేశ్వరి) మరాఠీ సాహిత్యంలో మొదటి రచనలలో ఒకటి. ధ్యానేశ్వరుడు, [[తుకారామ్]], [[నామదేవ్]] వంటి భక్తుల భజన, భక్తి గీతాలు జనప్రియమైనవి. ఆధునిక మరాఠీ రచయితలలో కొఒందరు ప్రముఖులు - [[పి.యల్.దేశ్‌పాండే]], [[కుససుమగ్‌రాజ్]], [[ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే]], [[వ్యాకంతేష్ మద్‌గుల్కర్]].
 
నాటక రంగం, సినిమా పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమ - మూడూ బొంబాయి నగరంలో కేంద్రీకృతమైనాయి. నటీనటులు, సాంకేతికనిపుణులు, కళాకారులు ఈ మూడు రంగాలలో ఒకదానినుండి మరొకదానికి మారడం సర్వసాధారణం.
పంక్తి 308:
* [[కొల్హాట్కర్]] - నాటక రచయిత
* [[దేవల్]] - నాటక రచయిత
* [[గడ్‌కారి]] - నాటక రచయిత
* [[కిర్లోస్కర్]] - నాటక రచయిత
* [[బాల గంధర్వ]] - రంగస్థల నటుడు
* [[కేశవరావు భోన్సలే]] - రంగస్థల నటుడు
* [[భావురావ్ కొల్హాట్కర్]] - రంగస్థల నటుడు
* [[దీనానాధ్ మంగేష్కర్]] - రంగస్థల నటుడు
* [[లతా మంగేష్కర్]] - ప్రముఖ నేపథ్యగాయని
 
పంక్తి 334:
 
== బయటి లింకులు ==
* [http://www.maccia.org.in Maharashtra Chamber of Commerce, Industry & Agriculture (MACCIA)]
* [http://www.maccia.org.in Maharashtra Chamber of Commerce, Industry & Agriculture (MACCIA)]
* [http://www.maharashtratourism.gov.in/mtdc/Default.aspx?strpage=gethistory.html History of Maharashtra]
పంక్తి 346:
* [http://www.india-picture.net/maharashtra India Picture] – Photos from several places in Maharashtra.
* [http://www.maayboli.com Maayboli] – A bilingual directory of Marathi and Maharashtra related resources.
* [http://www.ideasnext.com/marathimusic/index.htm Listen Maharashtra Music]
* [http://www.saishreeindia.com/maharashtra.html Maharashtra - Society and culture]
* {{wikivoyage|Maharashtra}}
* http://www.maharashtra.gov.in/english/Districts%20List.php
"https://te.wikipedia.org/wiki/మహారాష్ట్ర" నుండి వెలికితీశారు