మాతృగయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 3:
 
== చరిత్ర ==
ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న సిద్ధపూరును మాతృగయ అంటారు. పురాతన కాలంలో ఈ ప్రదేశాన్ని స్త్రీస్థల్ అంటారు. ఋగ్వేదంలో ఈ ప్రదేశవర్ణన ప్రస్థావించబడింది. మహాముని ధదీచి ఇంద్రుడికి తన ఎముకలను దానంగా ఇచ్చిన ప్రదేశం ఇదే. మహాభారతంలో పాండవుల అరణ్యవాస సమయంలో పాండవులు ఈ ప్రదేశం సందర్శించినట్లు పురాణాలలో ప్రస్తావించబడింది. క్రీ.శ 4-5 శతాబ్ధంలో ఇరాన్ నుండి వలస వచ్చిన గుజరా ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడినట్లు చారిత్రకాధారాలు వివరిస్తున్నాయి. 10వ శతాబ్ధంలో సోలంకి చక్రవర్తుల పాలనలో ఈ ఊరు వైభవాన్ని సంతరించుకుంది. సిద్ధిరాజ్ జైసింగ్ తన పాలనా కాలంలో ఈ ఊరును నిర్మించి తన రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ఆయన ఇక్కడ శివాలయ నిర్మాణం, సుందర ప్రదేశాలు మరియు 80 మీటర్ల పొడవున్న పెద్ద గోపుర నిర్మాణం చేసాడు. ఆయన ఇక్కడకు [[మథుర]] నుండి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను తీసుకు వచ్చాడు. వారంతా ప్రతుతం ఇక్కడ స్థిరపడ్డారు. 12వ శతాబ్ధంలో మహమ్మద్ ఘోరీ నాయకత్వంలో ఈ ఊరు ధ్వంశం చేయబడింది. వారు సోమనాధ్ ఆలయానికి వెళ్ళే దారిలో దీనిని ధ్వంశం చేసారు. ఆ దండయాత్రలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతటితో సోలంకి సామ్రాజ్య పతనం జరిగింది. సుల్తానుల పాలనలో ఈ ఊరు ప్రాంతీయ పాలన్‌పూర్ రాజప్రతినిధి పాలనలో ఉంది.
తరువాత ఊఈ ప్రదేశం ముగల్ చక్రవర్తి [[అక్బర్]] పాలనలోకి వచ్చింది. ముగల్ పాలనలో ఈ ఊరు అభివృద్ధి చేయబడి సమృద్ధిని సాధించింది.
 
== బిందుసరోవరం ==
[[దస్త్రం:Matrugayalo bindusarovaram 1.JPG|thumb|left|మాతృగయలో బిందుసరోవరం]]
[[దస్త్రం:Matrugayalo bindusarovaram.JPG|thumb|right|మాతృగయలో ద్వారరతోరణం]]
కర్ధమప్రజాపతి సరస్వతీ నదీతీరంలో అనుకూలవతి అయి మోక్షసాధనకు సహకరించ కలిగిన భార్యను అనుగ్రహించమని విష్ణుమూర్తి కొరకు తమస్సు చేసినప్పుడు ప్రక్షమైన విష్ణుమూర్తి కర్ధమ ప్రజాపతిని చూసి ఆనందభాష్పాలు రాల్చాడు. విష్ణుమూర్తి కంటి నుండి రాలిన కన్నీటి బిందువులే బిందుసరోవరంగా రూపుదిద్దుకొన్నది. హిందూమత ధర్మం అనుసరించి ఉన్న అయిదు పవిత్ర సరోవరాల్లో బిందుసరోఈవరం ఒకటి. మిగిలిన నాలుగు సరోవరాలు టిబెట్‌లోని మానస సరోవరం, రాజస్థాన్‌లోని [[పుష్కర్]] సరోవరం, గుజరాత్‌లోని బిందుసరోవరం, కర్నాటక రాష్ట్రం లేని హంపీలో ఉన్న పంపా సరోవరం. ఈ బిందు సరోవరం సమీపంలో కపిల మహర్షి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసాడు. ఇది అతిపవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. ఈ సరోవరాన్ని చుట్టి సరస్వతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం యాత్రికులు స్నానమాచరించడానికి తగిన నీరు లేవు కనుక ఇక్కడ నీటిని మాత్రం చల్లుకుని అనుమతి తీసుకుని వారి వారి తల్లికి మాత్రం శ్రాద్ధకర్మ నిర్వహిస్తారు.
 
== కపిల మహర్షి దేవభూతి ==
కర్ధమ ప్రజాపతి దేవభూతి పుత్రసంతానం కొరకు మహావిష్ణువును ప్రార్ధించి విష్ణు అంశతో పుత్రుడిని పొందారు. పుట్టుకతోనే పరిపూర్ణ జ్ఞానంతో ఉద్భవించిన ఆపుత్రుడే [[కపిలమహర్షి]]. కపిలమహర్షి జన్మించి తన తల్లితండ్రుల కోరికను అనుసరించి తన సహోదరీల వివాహం చేసి తన తల్లికి సాంఖ్యయోగబోధను చేసి ఆమెకు సంసారమునందు విరక్తిని కలిగించి మోక్షమార్గం వైపు నడిపించాడు. కపిల మహర్షి సాంఖ్యగోగ ప్రచారం చేసి ప్రజలను జ్ఞానవంతులను చేసాడు. తనకు తపోభంగం కలిగించిన సగరపుత్రులను భస్మంచేసాడు. తల్లికి బిందుసరోవరం వద్ద శ్రాద్ధక్రియలు నిర్వహించి ఆమెకు మోక్షప్రాప్తిని కలిగించాడు.
 
== మాతృశ్రాద్ధం ==
మహావిష్ణుమూర్తి అవతారమైన కపిలమహర్షి ఇక్కడ జన్మించాడు. ఆయన తన తల్లికి జ్ఞానబోధ చేసి ఆమె మరణించిన తరువాత శ్రాద్ధకర్మలు నిర్వహించాడు. ఆ కారణంగా ఇది అతి పవిత్ర స్థలంగా భావించబడుతుంది. కృతయుగం నుండి ఇది ఉన్నట్లు పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. ఋగ్వేదంలో ప్రస్తావించారు కనుక ఇది అతి పురాతనమైన ప్రదేశంగా భావించబడుతుంది. త్రేతా ద్వాపర యుగములలో ప్రస్తావించబడిన మహర్షి పరశురాముడు తన తల్లికి ఇక్కడ శ్రాద్ధకర్మలు ఆచరించాడు. ఇక్కడ పరశురాముడు శ్రాద్ధకర్మలు ఆచరిస్తున్న భంగిమలో పరశురామాలయంలో ప్రతిష్టించబడి ఉంది. ఇక్కడ హిందువులు ఆడవారికి మాత్రమే శ్రాద్ధకర్మలు ఆచరిస్తారు. స్త్రీలు కూడా ఇక్కడ తమ మాతృమూర్తికి శ్రాద్ధకర్మ నిర్వహించవచ్చు అన్నది ఇక్కడి విశేషం. దేశంలో హిందూ స్త్రీలు శ్రాద్ధకర్మలు ఆచరించడం ఈ ప్రదేశంలో మాత్రమే.
== ఆలయాలు ==
బిందుసరోవరం తీరాన ఉన్న ఆలయాలలో కపిలమహాముని ఆలయం, కర్ధమప్రజాపతి ఆలయం, దేవభూతి ఆలయం, గయగధాధర ఆలయాలు ఉన్నాయి. ఎదురుగా శివాలయం ఉంది. ఆవరణలో రావిచెట్టు ఉంది. అక్కడ యాత్రికులు దేవభూతిని ఆరాధిస్తారు. పరశురామాలయం కూడా ఒక వైపున ఉంది.
పంక్తి 32:
సిద్ధిపూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహమ్మదాబాదు లోని విమానాశ్రయం దేశంలోని అన్ని విమానాశ్రయాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. అహమ్మదాబాదు నుండి సిద్ధిపూరుకు 3 గంటల సమయంలో చేరుకోవచ్చు.
 
== వసతిగృహ సౌకర్యాలు ==
20,000 జనభా కలిగిన చిన్న ఊరు అయిన సిద్ధిపూరులో ధర్మశాలలు, గెస్ట్ హౌసులు వసతిగృహ సౌకర్యాలు లభిస్తాయి. సత్రాలు, మఠాలలో కూడా బస చేయవచ్చు. అహమ్మదాబాదు నుండి కూడా సులువుగా రెండు గంటలు ప్రయాణించి చేరుకోవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/మాతృగయ" నుండి వెలికితీశారు