మార్లిన్ మన్రో: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అమెరికాలో ప్రసిద్దులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 4:
హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్
 
'' రవి వర్మకే అందని ఒకే ఒక అందినివో'' అని సినీ కవీంద్రుడు ఓ అమ్మాయి గురించి వర్ణించిన పాట తెలియనివారు వుండక పోవచ్చు. ఈ వర్ణణకు నిజమైన అర్థం ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో.
 
 
పంక్తి 21:
‘నా పేరు ఏమిటి?’
‘నోర్మా మోర్టెన్‌సన్’
కానీ అస్సలేమీ బాలేదు.
 
‘ఇంకా కొద్ది కాలంలో హాలీవుడ్ నా గురించి మాట్లాడుకోబోతోంది. నా మీద ఏదో ఒక వార్త రాయనిదే సినిమా పత్రికలు బతకలేని స్థితికి వస్తాయి. ప్రపంచమంతా ఉచ్చరించే నా పేరు సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది?’
పంక్తి 44:
spot
కేవలం 4 సినిమాలతో హాలివూడ్లో హాట్ స్టార్ అయిపోయిన మార్లిన్ మన్రో అప్పుడే తన బాల్యంలోకి తొంగి చూసుకుంది...
మార్లిన్ మన్రో లాస్ ఏంజిల్స్ కౌంటీ హాస్పిటల్లో జూన్ 1, 1926న జన్మించింది. అందరిలా మన్రో బాల్యం అంత ప్రత్యేకమేమీ కాదు... అందాలు, ఆనందాలకు అసలు తన జీవితంలో చోటే లేదు. ఆమెది కన్నీళ్లమయమైన బాల్యం. ముద్దు ముచ్చట తెలియని దీనమైన బాల్యం. తండ్రి ఎవరో కూడా తెలియని విచారకర బాల్యం. తల్లి ఎప్పుడూ రకరకాల మానసిక వ్యాధులతో బాధపడుతూ పిచ్చిదానిలా ప్రవర్తించేది. మన్రో తన బాల్యంలోని ఎక్కువ భాగాన్ని అనాథాశ్రమాలలోనే గడిపింది. పదకొండు సంవత్సరాల వయసులో ఉండగా ‘చిట్టి తల్లీ మీకు మేము అండగా ఉన్నాము’’ అన్నారు దూరపు బంధువులు గ్రేస్, డక్‌గాడార్డ్‌లు.
 
ఆ చిట్టి కళ్లలో ఒకే సమయంలో వెయ్యి ఇంద్రధనుస్సులు!
గ్రేస్, డక్‌గాడార్డ్ దంపతులు మన్రోను తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ ముచ్చట కొద్దికాలమే కొనసాగింది. డక్‌గాడార్డ్‌కు చాలా దూరప్రాంతానికి బదిలీ కావడంతో తమతో పాటు మన్రోను తీసుకువెళ్లడం కుదరలేదు.
మళ్లీ ఒంటరితనపు చీకటి ఆ అమ్మాయిని పాములా భయపెట్టింది. మళ్లీ ఆమె అనాథాశ్రమంలో చేరక తప్పలేదు. అలా అనాధ శ్రమంలో చేరిన మన్రో కి అనేక సందర్భాలలో లైంగిక వెడింపులకు గురవ్వడం ఎదురైంది. అదే సమయంలో అంటే మన్రో కి 16 ఏళ్ల వయస్సులో జూన్ 19, 1942, న తన ప్రియుడు జిమ్మీ డౌగెట్రీ తో వివాహం జరిగిపోయింది. జిమ్మీ తో వివాహానంతరం మన్రో దక్షిణ పసిఫిక్ ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడే మన్రో సినీ జీవితానికి పునాది పడింది.అదే ప్రాంతంలో ఉండే బార్బాంక్ అనే ఫోటోగ్రాఫర్ ద్రుస్టి మన్రో పై పడడంతో ఆమె జీవితంలో సినిమా ఆధ్యాయానికి తెర లేచింది.
 
1946లో మన్రో తన మొదటి చిత్రం ది అస్పాల్ట్ జంగిల్’ ఒప్పందంపై సంతకం చేసింది.అదే సంవత్సరంలో డౌగెట్రీ,మన్రో జంట వివాహ బంధానికి బీటలు వారాదంతో వారిరువురు విడాకులు తీసుకున్నారు. ఆ సినిమా ఒప్పందంతో అప్పటివరకు నోర్మా మోర్టెన్‌సన్’గా ఉన్నా పేరు కాస్త మార్లిన్ మన్రో గా మార్చుకుంది. అప్పటి నుండి అందరు ఆమెను"మార్లిన్ మన్రో"గా పిలవడం మొదలుపెట్టారు.1950 జాన్ హస్టన్ యొక్క చిత్రం ది అస్పాల్ట్ జంగిల్’ అనే నేర నాటకంలో ఆమె చిన్న పాత్ర పోషించి వీక్షకులను సమ్మోహన పడేలా చేసింది. ఇక అక్కడి నుండి మొదలైన మన్రో ప్రస్థానం సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దిశగా అడుగేసింది.కానీ ఆమె నటనా వృత్తిని నిజంగా 1950 వరకు అంటే ఈ నాటకంలో పాత్ర వేసేవరకు ఊపందుకోలేదనే చెప్పాలి.
 
అదే సంవత్సరం, ఈవ్ అనే చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఎంతో మంది ప్రేక్షకులను అలాగే విమర్శకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదల తర్వాత ఆమె హాలివూడ్ లో అత్యంత ప్రసిద్ధ నటీమనులలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది...ఇక ఆమె నటనకు దాసోహమయి మన్రోతో నటించాలని అభిలషించిన హాలివూడ్ మేటి నటరాజులెందరో క్యూ కట్టసాగారు...అందానికి తోడు ఆహార్యం...ఆ ఆహార్యానికి సరిపడు అభినయంతో మన్రో ఇక హాలివూడ్లో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది...నిజంగా అందం అంటే ఆమెదే నటన అంటే నిజమైన నిర్వచనం మన్రో నే అని కుండబడ్దాలు కొట్టే చర్చలు ప్రపంచమంతా జరిగేవి...కేవలం నటిగానే కాకుండా ఒక మంచి గాయనిగా మన్రో కనబరిచిన ప్రతిభ న భూతో న భవిష్యాతి.
1953లో ఆమె నటించిన నయాగరా చిత్రం హాలివూడ్ చరిత్రలోనే ఒక సెంసేషన్ గా నిలిచిపోయింది...ప్రియుడితో కలిసి తన భర్తనే హాత్య చేయాలనుకునే స్త్రీ ఉదంతంతో తెరకెక్కించబడిన ఈ చిత్రం హాలివూడ్ లో అడల్ట్ చిత్రాలకు పునాదిగా నిలిచింది...ఈ చిత్రంతోనే మన్రో గాయనిగా కూడా తన ప్రతిభను నిరూపించుకొని అంతర్జాతీయ స్థాయిలో యువత కలల రారాణిగా వెలిగిపోయింది.
 
1959లో మన్రో జాక్ లెమోన్ మరియు టోనీ కర్టిస్ తోకలిసి నటించిన సం లైక్ హాట్ అనే హాస్యాభరిత చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది...ఈ చిత్రం లో ఒక మల్టీ మిలియన్ ని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఒక గాయని ఎన్ని ఇబ్బందులు పడవలసి వచ్చిందనే కథాంశంతో రూపొందించబడిన సుగర్ కెన్ అనే పాత్రలో ఆమె అత్యద్భుత నటనకుగాను 1959లో బెస్ట్ ఆక్ట్రేస్స్ ఇన్ కామెడీ అవార్డ్ తో పాటు 1959సంవత్సరానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది.
 
Spot
 
జీవితంలో ఎలా ఉండాలో మన్రోని చూసి నేర్చుకోవాలి ఎలా ఉండకూడదో కూడా ఆమెనే చూసె నేర్చుకోవాలి.మన్రో కి తన అందాన్ని ఎక్కడ ఎలా ఎంత వాడుకోవాలో బాగా తెలుసు.శరీరం ఉన్నది చూపించడానికే దాన్ని ప్యాకేజీలో పెట్టి భద్రపరుచుకోవడానికి కాదు అని ధైర్యంగా తలటిక్కగా చెప్పగలిగిన సొగసరి మన్రో....నేను నిబందనలను పాటించి ఉంటే ఎక్కడికి చేరుకోక పోయడాన్ని అని ఒప్పుకోగలిగిన గడసరి మన్రో.
ఆల్ అబౌట్ ఈవ్,సమ్ లైక్ ఇట్ హాట్, హౌ to marry ఏ మిలీనియర్, బాస్ స్టాప్ ఇలా అనేక చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను విస్మయం చెందేల చేసిన మన్రో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా ఎదిగి హాలివూడ్ ని మహారాణిలా ఏలీంది.
విజయాలకు, ఘన విజయాలకు అలవాటు పడిన మన్రోకు అపజయాలు ఎదురవుతున్నాయి. ‘వృత్తిలో ఇలాంటివి సహజమే’ అనుకోకపోవడం వల్ల ఆ అపజయ భారంతో మన్రో మనసు క్రుంగిపోయింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లెట్స్ మేక్ లవ్’,‘ది మిస్‌ఫిట్స్’ సినిమాలు కూడా బాక్సాఫీసు దగ్గర బిక్కమొఖం వేశాయి.
వృత్తిలో ఎదురుదెబ్బలు తగిలితే వ్యక్తిగత జీవితంలోని మాధుర్యపు నీడలో సేద తీరవచ్చు. వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలు ఎదురైతే వృత్తిజీవితంలోని కీర్తి కాంతిలో వెలిగిపోయి సుఖంగా నవ్వుకోవచ్చు.
పంక్తి 67:
కానీ ఒక వైపు వృత్తిజీవితం, మరోవైపు వ్యక్తిగత జీవితం రెండూ సంక్షోభంలో పడ్డాయి. సుదీర్ఘకాలపు ఒంటరితనాన్ని అనుభవించిన మన్రో పెళ్లి రూపంలో తోడు వెదుక్కోవాలనుకుంది. కాని అది భ్రమ అని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. ఒకటి రెండు వివాహాలు విఫలమైన తరువాత బేస్‌బాల్ క్రీడాకారుడు జోయి డిమాగ్గియోను పెళ్లి చేసుకొంది. నవ మాసాలకే ఆ పెళ్లి పెటాకులైంది. కొంతకాలానికి ఆర్థర్ మిల్లర్ అనే నాటక రచయితను పెళ్లాడింది. కానీ ఎక్కడా శాంతి లేదు. ఎవరి దగ్గరా శాంతి లేదు. అదిగో మత్తుపదార్థాలు మురిపెంగా పిలుస్తున్నాయి. శాంతి ఇస్తానని నమ్మిస్తున్నాయి. ఆమె అటు వైపు వడివడిగా అడుగులు వేసింది.
అదే సమయంలో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్.కెనడీతో మార్లిన్ మన్రోకు ఎఫైర్ ఉన్నట్లు పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. కెనడీ పుట్టినరోజు సందర్భంగా మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మన్రో పాట పాడుతున్నప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో తప్ప ఆ ఎఫైర్‌ను బలపరిచే ఆధారాలేవీ లేవు. సంచలనం సృష్టించిన ఈ ఫొటో దశాబ్దాల తరబడి అజ్ఞాతంలో ఉంది. మన్రో, కెనడీ కలిసి ఉన్న ఫొటోలు కనిపించకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు ఫిల్మ్ మేకర్ మోర్గాన్ ఇలా చెప్పాడు: ‘‘వాళ్లిద్దరినీ ఫొటో తీయవద్దని సీక్రెట్ సర్వీస్ వాళ్లు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు.’’ కెనడీ- మన్రోల మధ్య నిజంగా ఎఫైర్ ఉందో లేదో తెలియదుగానీ... ఊహించిన వాళ్లకు ఉహించినన్ని కథనాలు దొరికాయి!
ఇక చివరగా 1961లో జాన్ హాస్తన్తో కలిసి నటించిన ది మిస్‌ఫిట్స్ అనే చిత్రం తన యదార్త జీవితానికి దగ్గరగా ఉంటూ సాగింది...ఈ చిత్రం తర్వాతే మన్రో ఇక సినెమాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పవలసి వచ్చింది ..మన్రో నటించిన పూర్తిస్థాయి చివరి చిత్రం కూడా ఇదే.
1962వ సంవత్సరం. ‘సమ్‌థింగ్ గాట్ టు గివ్’ సినిమా నుంచి మన్రోను తొలగించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అవి పుకార్లు కాదని, నిజాలే అని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తరచుగా షూటింగులు ఎగ్గొట్టడం వల్లే ఆమెను సినిమా నుంచి తీసేయాల్సి వచ్చిందని నిర్మాతలు వివరణ ఇచ్చారు. ‘‘అనారోగ్యం కారణంగా షూటింగులకు హాజరు కాలేదు’’ అని చెప్పింది మన్రో.
ఆమె అభిమానులు తల్లడిల్లిపోయారు.
పంక్తి 78:
మన్రో మరణంపై ఎవరికి ఏకాభిప్రాయం లేదు.
కొందరు హత్య అన్నారు. మరి కొందరు ఆత్మహత్య అన్నారు. ఇంకొందరు ‘డ్రగ్’ ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అన్నారు. చివరికి చివరి కారణాన్నే అధికారికంగా ధృవీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చకు దారితీసిన కుట్రసిద్ధాంతాలలో మన్రో మరణం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.
ఒక జీవితానికి 36 ఏళ్ల వయసు ఏమంత పెద్దది కాదు. ఆమె మరణ వార్త విని తప్పుకోలేక ప్రపంచ వ్యాప్తంగా 24 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ అడపాదడపా ఆమె ధరించిన దుస్తులు, వాడిన వస్తువుల్లాటివి వేలం వేస్తే, లక్షల డాలర్లలో శ్రీమంతులు సొంతం చేసుకున్నారనే వార్తలు వెలువడుతూనే ఉంటాయి. 1950లో ఆమె నాయికగా నటించిన తొలి చిత్రం 'డోన్ట్ బాదర్ టు నాక' విడుదలవుతున్న సందర్భంగా - ఓ క్యాలెండర్ పై ఆమె నగ్న చిత్రాన్ని విడుదల చే సె సరికి అది హాలీవుడ్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ''ఎందుకు అలాంటి ఫోజ్ ఇచ్చారు'' అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే ''ఆకలీ బాధకు తాళలేక'' అని జవాబిచ్చింది మర్లిన్.
ఇంతగా ప్రపంచ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న మన్రో తన జీవిత కాలంలో కనీసం ఒక సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయింది.కానీ తన జీవితంలో ఒక మరుపురాని గిఫ్ట్ మాత్రం తన దగ్గరే ఉంచుకుంది.ఆయీన్ స్టీన్ తన ఆటోగ్రాఫ్ తో కూడిన ఫోటోను ఇచ్చి మనో ను surpriseకి గురిచేసాడు. తన నటనా జీవితంలో, మార్లిన్ మన్రో సినిమాలు $ 200 మిలియన్లను వసూలు చేసింది. ఇప్పటికీ ఆమె సెక్స్ అప్పీల్ మరియు అందం ప్యాషన్ ప్రపంచంలో ప్రఖ్యాత చిహ్నంగా భావించబడుతుంది.
ఆమె జీవితం, ఆమె వివాహాలు, వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యాలూ అన్నీ సంచలనాత్మకంగా ఉండేవి. నటిగా పరిణత చెంది మరెన్నో విజయాలు సాధించవలసిన తరుణంలో మార్లన్ అర్ధాంతరంగా జీవితరంగం నుంచి నిష్రమించింది. ఆమె పేదరికాన్ని ఎదిరించ గలిగింది కానీ లెక్కకు మించిన సిరి సంపదలను, పేరు ప్రఖ్యాతలనూ తట్టుకోలేకపోయింది!
చిన్న వయసులోనే కష్టాల దారుల నుంచి, కన్నీటి సుడిగుండాల నుంచి నడిచొచ్చిన మన్రో ఎవరి అండా లేకుండానే, ఎవరి ఆశీస్సులు లేకుండానే తనను తాను నిరూపించుకుంది. ‘అంతర్జాతీయ అందాల తార’గా మన హృదయాల్లో నిలిచి నవ్వుతూ ఉంది!
"https://te.wikipedia.org/wiki/మార్లిన్_మన్రో" నుండి వెలికితీశారు