మాలిక్ మక్బూల్: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం:1372 మరణాలు; +వర్గం:తెలుగు కవులు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 2:
 
[[బొమ్మ:Malik Maqbool tomb Delhi.jpg|250px|right|thumb|ఢిల్లీలో జీర్ణావస్థలో ఉన్న మాలిక్ మక్బూల్ సమాధి.]]
'''మాలిక్ మక్బూల్''' లేక '''దాది గన్నమ నాయుడు''' / యుగంధర్ (ఆంగ్లము: GannayanaayakuDu) [[కాకతీయ సామ్రాజ్యం | కాకతీయ]] ప్రభువైన [[ప్రతాపరుద్రుడు | ప్రతాపరుద్రుని]] సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత [[ఢిల్లీ ]] సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి [[మాలిక్ మక్బూల్]] గా మళ్ళీ [[ఓరుగల్లు]]కే పాలకునిగా వచ్చినాడు. [[మారన]] రచించిన [[మార్కండేయ పురాణం]] గ్రంథాన్ని అంకితమొందినాడు.
 
గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు [[గణపతి దేవుడు|గణపతి దేవుని]] కడ మరియు [[రుద్రమదేవి]] కడ సేనాధిపతిగా ఉన్నాడు. దాది వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు [[కాకతీయులు|కాకతీయ]] చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. [[కొత్త భావయ్య]] పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల. ఈ విషయముపై మరికొంత పరిశోధన అవసరము.
 
పంక్తి 13:
 
 
ఉలుఘ్ ఖాను ([[మహమ్మద్ బిన్ తుగ్లక్]]) ఓరుగల్లును 1323లో [[దౌలతాబాదు]] అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచాడు. అటుపిమ్మట ముసునూరి నాయకుల విప్లవముతో తెలుగునాడు విముక్తమైంది. 1335లో [[మధుర]] సుల్తాను జలాలుద్దీను కూడ తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. ఇది సహించని తుగ్లకు పెద్దసైన్యముతో మక్బూల్ ను తొడ్కొని ఓరుగల్లు చేరాడు. అచట ప్రబలుతున్న మహమ్మారి వల్ల సుల్తానుకు అంటుజాడ్యము సోకింది. భయపడిన సుల్తాను తూర్పు [[తెలంగాణ]]మును మక్బూల్ ను అధిపతిగా చేసి ఢిల్లీ తిరిగి వెళ్ళాడు. 1336లో కాపానీడు మక్బూల్ ను ఓరుగంటినుండి తరిమివేసి కోటను జయించాడు.
 
 
అటు పిమ్మట మక్బూల్ తిరిగి ఢిల్లీ దర్బారు చేరి [[గుజరాత్]] మరియు సింధు దేశములలొ పెక్కు విజయములు సాధించాడు. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారు లో వజీరు (ప్రధాన మంత్రి) గా నియమించబడ్డాడు. భాషాప్రాంతమతభేధములను అధిగమించి ఢిల్లీ దర్బారులో క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.
 
 
పంక్తి 23:
 
 
మక్బూల్ 1372లో చనిపోయాడు. ఈతని సమాధి భారతదేశములోని మొదటి అష్ఠకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో [[హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా]] దర్గా సమీపములో ఉన్నది. <ref>Tomb of Telanga Nawab: Anon (1997) Delhi, The Capital of India; Asian Educational Services. pp. 85. ISBN 81-206-1282-5, 9788120612822</ref>.ఆక్రమణలవల్ల, నిర్లక్ష్యమువల్లను సమాధి శిధిలావస్థలో ఉన్నది.
 
మక్బూల్ ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.
==వారసుడు==
1369 లో మక్బూల్ మరణం తరువాత, అతని కుమారుడు జౌనా ఖాన్ లేదా జౌనా షా వజీరు అయ్యాడు. ఇతడు తండ్రి వలె సమర్ధుడే కాని మంచి సైనిక నాయకుడు కాడు. ఫిరోజ్ షా సమయములోనే మొదలైన వజీరు పదవి కోసం పోరు జౌనా షా ని బలి తీసుకున్నది. జౌనా ఖాన్ బంధించి మరణశిక్ష అమలు చేశారు. అతను బాగా పేరొందిన ఖిడికీమసీదు మొదలగు ఏడు పెద్ద మసీదులు కట్టించాడు<ref>ఖిడికీమసీదు: http://www.hindu.com/mag/2007/04/15/stories/2007041500210700.htm</ref>.
==వనరులు==
* http://links.jstor.org/sici?sici=0004-3648(2001)61%3A1%3C77%3AFDTTDN%3E2.0.CO%3B2-8
* Sri Marana Markandeya Puranamu, ed. G. V. Subrahmanyam, 1984, Andhra Pradesh Sahitya Academy, Hyderabad
* శ్రీ మారన మార్కండేయపురాణము (http://www.archive.org/stream/markendeyapurana021291mbp)
* కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను (2006), పావులూరి పబ్లిషర్సు, గుంటూరు,
* A Forgotten Chapter of Andhra History by M. Somasekhara Sarma, 1945, Andhra University, Waltair
* Sultan Firoz Shah Tughlaq by M. Ahmed, 1978, Chugh Publications, New Delhi p. 46 and 95
"https://te.wikipedia.org/wiki/మాలిక్_మక్బూల్" నుండి వెలికితీశారు