మీరా కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:15వ లోకసభ సభ్యులు తొలగించబడింది; వర్గం:15వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయో...
చి Wikipedia python library
పంక్తి 22:
| children = 1 కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు
| website =
| alma_mater = [[m:en:University of Delhi|ఢిల్లీ విశ్వవిద్యాలయము]]
| footnotes =
| date = జూన్ 3 |
| year = 2009 |
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=73
}}
'''మీరా కుమార్ ''' భారత పార్లమెంటు సభ్యురాలు మరియు లోక్‌సభకు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
పంక్తి 36:
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి [[m:en:Indian Foreign Service|ఇండియన్ ఫారిన్ సర్వీసు]] కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.
===రాజకీయ జీవితము===
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన [[రాం విలాస్ పాశ్వాన్]], [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. ఢిల్లీ లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]] మరియు 12వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004 మరియు 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన బీహార్ లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
 
2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే లోక్‌సభ సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత లోక్‌సభకు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
====2014 ఎన్నికలు====
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భాజపా]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
==వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] న్యాయవాది అయిన మంజుల్ కుమార్ తో జరిగినది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్ మరియు కుమార్తెలు స్వాతి మరియు దేవయాని. అన్షుల్ వివాహము మినితా తో జరిగింది. వీరికి ఒక కుమార్తె అనాహిత. కుమార్తె స్వాతి వివాహము రంజీత్ తోనూ మరియు దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి మరియు రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత మరియు కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని మరియు అమిత్ లకు ఒక కుమారుడు ఫర్జాన్ సంతానము.
 
మీరా కుమార్ కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతాకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/మీరా_కుమార్" నుండి వెలికితీశారు