ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
 
[[దస్త్రం:Neus1.jpg|right|thumb|180px|మానవ నాసిక ముఖం పక్కవైపు నుండి]]
'''ముక్కు''' లేదా '''నాసిక''' ([[ఆంగ్లం]]: '''Nose''') [[తల]] ముందుభాగంలో ఉండే [[జ్ఞానేంద్రియం]]. పైకి కనిపించే ముక్కు మానవుల [[ముఖం]] మధ్యలో ఇది ముందుకి పొడుచుకుని వచ్చియుంటుంది. ముక్కుకు క్రిందిభాగంలో రెండు నాసికారంధ్రాలుంటాయి. పైభాగం [[గొంతు]]తో కలిసి ఉంటుంది. ముక్కు యొక్క ఆకృతిని [[ఎథమాయిడ్ అస్థిక]] మరియు రెండు నాసికలను విభజించే [[నాసికా స్థంభం]] అనే [[మృదులాస్థిక]] (కార్టిలేజ్) నిర్ధారిస్తాయి.
[[File:Mukku-Te.ogg]]
== భాషా విశేషాలు ==
[[దస్త్రం:Head_olfactory_nerve.jpg|thumb|right|ముక్కు నిర్మాణం మరియు ఘ్రాణనాడి.]]
[[తెలుగు భాష]]లో ముక్కు పదానికి చాలా ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=995&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువులో ముక్కు పదానికి గల ప్రయోగాలు.]</ref> ముక్కు ను నాసిక అంటారు. [[పక్షి]] ముఖాన్ని కూడా ముక్కు అని పిలుస్తారు. "చనుముక్కు" (a nipple) అంటే వక్షోజాల మధ్యనుండే చనుమొనలు. ముక్కు మొగము ఎరగనట్టు మాట్లాడినాడు అనగా మనిషిని గుర్తుపట్టనట్లుగా ఉన్నాడు అని ప్రయోగిస్తారు. ముక్కు: [[బాధ]]తో మూల్గడానికి కూడా ముక్కుతున్నాడు అంటారు. కొన్ని పదార్ధాలు పాడయిపోవడాన్ని కూడా ముక్కిపోయాయి అంటారు. ఉదా: ముత్యాలు ముక్కిపోయినవి. ముక్కురంధ్రములు లేదా నాసాపుటములు. బలిష్టమైన [[జంతువు]]లను అదుపుచేయడానికి వాని ముక్కులోపలినుండి త్రాడు దూర్చి పట్టుకుంటారు. దీనిని "ముక్కుత్రాడు" లేదా "ముకుత్రాడు" అంటారు. సులోచనము, [[కళ్ళద్దాలు|కండ్లద్దములను]] "ముక్కద్దము" అని కూడా పిలుస్తారు. ముక్కమ్మి లేదా ముక్కుకమ్మి (ముక్కు + కమ్మి.) లేదా [[ముక్కర]] (ముక్కు + రాయి.) ఒక విధమైన నాసాభరణము. A nostril, నాసికారంధ్రము. ముక్కిడి (ముక్కు + ఇడి) ముక్కులేని. ముక్కిడిరోగము ముక్కు ఎముక పాడై దూలము చదునుగా మారి ముక్కు లేనట్లుగా కొన్ని వ్యాధులలో జరుగుతుంది. ముక్కుదూలము లేదా ముకుదూలము రెండు ముక్కు రంధ్రాల మధ్యగల దూలము లేదా ముక్కునడిమి యెముక. [[ముక్కుపొడి]] అనగా నస్యము, పొడుము. "ముక్కుపోగు" (A nose ring) అనేది ముక్కుమ్మి, నత్తు. ముక్కులు అనగా మిక్కిలి చిన్ననూకలు.
 
== ఆరోగ్య సంబంధ విపత్తులు ==
[[దస్త్రం:Danger triangle of the face diagram.jpg|thumb|The '''danger triangle of the face'''.]]
[[దస్త్రం:Nose piercing.jpg|thumb|అందమైన [[ముక్కు పుడక]].]]
ముక్కుకు మరియు దాని పరిసర ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన రక్తప్రసరణ వలన నాసికా ప్రాంతములో సంభవించే తిరోగామి ఇన్ఫెక్షన్లు మొదడు వరకు చేరే అవకాశమున్నది. ఈ కారణంగానే నోటి ఇరువైపుల కొనలనుండి ముక్కు పైభాగము వరకు ఉన్న త్రిభుజాకారపు ప్రదేశాన్ని (ముక్కు మరియు మాక్షిల్లా ఉన్న ప్రాంతం) వైద్యులు '''ముఖం యొక్క ప్రమాద త్రిభుజం''' (The danger triangle of the face) అని భావిస్తారు.
 
ముక్కు నుండి [[రక్తస్రావం]] (Epistaxis) సామాన్యంగా మనం చూసే వ్యాధి లక్షణం. [[జలుబు]] మరియు ముక్కు దిబ్బడ (Nasal congestion) కొన్ని ఇన్ఫెక్షన్స్ మరియు ఇన్ఫ్లమేషన్స్ లోనూ కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులు లేదా అలర్జీ వలన కూడా ఇలా జరగవచ్చును. ఇలాంటి కొన్ని వ్యాధులలో వాసన తెలియకుండా పోతుంది (Anosmia or Loss of smell sensation).
 
ముక్కులోని ఎండిన పొక్కుల్ని తీయడానికి ప్రయత్నించడం (Nose-picking) ఒక చెడు [[అలవాటు]]. దీని మూలంగా ఇన్ఫెక్షన్స్, రక్తస్రావం మొదలైన ప్రమాదాలు జరుగుతాయి. ఇది మానసిక వ్యాధిగా మారి ముక్కులోని వెంట్రుకల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు (Rhinotillexomania).
 
చిన్నపిల్లలు ముక్కులో వివిధ రకాలైన వస్తువుల్ని ఉంచుకుంటారు. ఇవి లోపల ఆడ్డంపడి తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం కూడా కలుగుతుంది. గట్టిగా గాలిపీల్చినప్పుడి ఇవి ఊపిరితిత్తులలోనికి పోయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది.
పంక్తి 46:
{{wiktionary}}
* [http://www.eustachian-tube.net ముక్కు నుండి యూస్ట్రేషియన్ నాళం వరకు]
* [http://www.entnet.org/HealthInformation/lungGuardian.cfm మీ ముక్కు: ఊపిరితిత్తుల రక్షకులు]
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/ముక్కు" నుండి వెలికితీశారు