ముక్కుపుడక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
అలంకారంగా స్థిరపడిన ముక్కెరను [[మేనమామ]] లేదా కాబోయే [[భర్త]] మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. ఒకవేళ వాళ్ళనుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు దేవదాసీలై ఉంటారు. ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు. అందుకే 'మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక' అన్నాడో కవి. [[తాళి]]బొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.
 
భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి. [[రాజు]]ల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి.
 
 
"https://te.wikipedia.org/wiki/ముక్కుపుడక" నుండి వెలికితీశారు