మురారిరావు ఘోర్పడే: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q13006703
చి Wikipedia python library
పంక్తి 1:
'''మురారిరావు'''గా పేరొందిన '''మురారిరావు ఘోర్పాడే''' మరాఠా సర్దారు, సందూరు సంస్థానపు రాజు, గుత్తి దుర్గాధిపతి. భారతదేశంలో మొగలుల పాలన క్షీణదశకు చేరుకొని దక్షిణాపథంలో మరాఠులు విస్తరిస్తుంటే మరో ప్రక్క ఫ్రెంచ్, బ్రిటీషు సేనలు ఉపఖండంలో పట్టుసాధించడానికి కృషిచేస్తుండగా, మరాఠులు, నిజాంలు, మైసూరు రాజ్యం, ఆధిపత్యంకై పోరాడుతున్న సంక్లిష్టమైన సమయంలో, వాటన్నింటి మధ్య దక్కన్లో పీష్వాలకు నమ్మకమైన సేనానిగా 18వ శతాబ్దపు దక్షిణాపథ చరిత్రలో మురారిరావుకు కీలకమైన స్థానమున్నది.<ref name=outlook>[http://www.outlookindia.com/article.aspx?266263 Monitor’s Hold - Sugata Srinivasaraju]</ref>
మురారిరావు చాకచక్యమైన భాగస్వామిగా, తన స్వతంత్రతను కోల్పోకుండా మరాఠులతో వ్యవహారాలు సలిపాడు. 1940లో మురారిరావు జీవితాన్ని సమీక్షిస్తూ చరిత్రకారుడు గోవింద్ సఖారామ్ సర్దేశాయి "మరాఠా చరిత్రలో మురారిరావు లాంటి సాహసోపేతమైన రాజకీయ వ్యాసంగాన్ని మరేవ్వరూ కొనసాగించలేదు - ఆయన జీవితం మొత్తం అద్భుతమైన గెలుపులు, అనుకోని ఓటములు, నాటకీయ ఘట్టాలు, ముందుచూపుల్తో నిండిపోయిన ఒక మహోత్కృష్ట పోరాటం" అని తేల్చాడు.<ref name=outlook/>
 
==కుటుంబం==
పంక్తి 6:
 
==తిరుచిరాపల్లి పాలన==
1740లో రఘూజీ భోంసాలే, ఫతే సింగ్ మరియు మురారిరావుల నేతృత్వంలో పెద్ద మరాఠా సైన్యంతో ఆర్కాటుపై దండయాత్ర చేసింది. ఆర్కాటు నవాబు దోస్త్ అలీ ఖాన్‌ను దామలచెరువు కనుమలో హతమార్చి ఆర్కాటు కోటను స్వాధీనం చేసుకొన్నారు. తిరుచ్చి కోటను ముట్టడిచేసి, అక్కడ జరిగిన యుద్ధంలో దోస్త్ అలీఖాన్ అల్లుడు చందా సాహిబ్ ను ఓడించి, బందీగా [[సతారా]]కు తీసుకొనివెళ్లారు. తిరుచ్చి కోటను పాలించడానికి మురారిరావును నియమించారు. 1741 జూన్ నుండి 1743 మార్చి వరకు రెండు సంవత్సరాలపాటు మురారిరావు పద్నాలుగు వేల మంది సైనిక బలగాన్ని తిరుచ్చి కోటలో మొహరించి, తిరుచిరాపల్లి ప్రాంతాన్ని పాలించాడు. కర్నాటకంలో వారసత్వపోరును మట్టు పెట్టాలనే కృత నిశ్చయంతో [[నిజాముల్ ముల్క్]] 1743లో పెద్ద సైన్యంతో మరాఠులపై దండయాత్ర బయలుదేరాడు. ఆర్కాట్ కోటను తిరిగి వశం చేసుకొని అక్కడ వారసత్వ తగువుని తీర్చి, తిరుచ్చి కోటపై దాడి చేసి, ఆరు నెలల పాటు ముట్టడి కొనసాగించాడు. బాలాజీ బాజీరావు, రఘూజీ భోంసాలే పరస్పర విరుద్ధం వల్ల మహరాష్ట్ర నుండి సహాయం అందే సూచనలు లేక, చివరికి మురారిరావు నిజాంతో ఒప్పందం కుదుర్చుకొని కోటను వశం చేశాడు. ప్రతిగా నిజాం మురారి రావుకు రెండు లక్షల బహుమానంతో పాటు పెనుగొండ సీమనిచ్చి గుత్తి దుర్గాధిపతిని చేశాడు.<ref>[http://books.google.com/books?id=eAEyAmYRNNQC&pg=PA71&lpg=PA71&dq=murari+rao#v=onepage&q=murari%20rao&f=false Political History of Carnatic Under the Nawabs By N. S. Ramaswami]</ref>
 
==ఫ్రెంచివారితో ఒప్పందం==
పంక్తి 12:
 
==సావనూరు యుద్ధం==
1756లో గుత్తి దుర్గాన్ని పాలిస్తూ మురారిరావు, తనకు రాజ్యం నేరుగా ఛత్రపతి వల్ల సంక్రమించింది, పీష్వా వల్ల కాదని, [[బాలాజీ బాజీరావు]]కు కప్పం కట్టడానికి నిరాకరించాడు. అదే సమయంలో [[నిజాం]]కు కప్పం కట్టకుండా ఎదురు తిరిగిన సావనూరు నవాబు అబ్దుల్ హకీం ఖాన్ ఆఫ్ఘానీతో పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాడు. సావనూరు కోటలో తన సేనలను మొహరించి నిజాం మరియు పీష్వా సేనలనుండి కాపాడతానని హామీ ఇచ్చాడు.<ref>[http://books.google.com/books?id=9Fb26pWqhScC&pg=PA90&lpg=PA90&dq=murari+rao#v=onepage&q=murari%20rao&f=false Nizam-British Relations, 1724-1857 By Sarojini Regani]</ref>
 
పీష్వా తన సేనలతో పాటు, మరాఠా నాయకులైన మల్హర్ రావు హోళ్కర్, మధోజీ హోళ్కర్ల సేనలతో పాటు 1756 మార్చి ప్రారంభంలో సావనూరు చేరుకున్నాడు. 1756 ప్రారంభంలోనే పీష్వాకంటే ముందే బీదరు నుండి బయలుదేరిన నిజాం సేనలు అప్పటికింకా సావనూరు చేరలేదు. షానవాజ్ ఖాన్ అదే అదనుగా భావించి ఫ్రెంచి వారిపై పీష్వాకు ముభావం కలిగేలా, నిజాం సేనల ఆలస్యంగా రావటానికి ఫ్రెంచివారే కారణమని పితూరీ చేశారు. ఫ్రెంచి వారు తమ పాత సయోధ్యుడైన మురారిరావుపై యుద్ధం చేయటానికి సిద్ధంగాలేరని షానవాజ్ ఖాన్ భావించడానికి కారణం లేకపోలేదు. తొలుత పీష్వాకు మురారిరావుకు మధ్య విభేదాలలో [[బుస్సీ]], తమ బకాయిలను మాఫీ చేస్తాడనే ఆశతో మురారిరావు పక్షం వహించాడు. కానీ మురారిరావు, సావనూరు నవాబుతో చేతులు కలిపి నవాబు అధికారాన్ని కూడా ధిక్కరించడంతో, [[సలాబత్ జంగ్|సలాబత్ జంగు]]కు విపక్షం వహించలేని బుస్సీ, చేసేదేమీ లేక మురారిరావుపై నిజాం, పీష్వాలతో సహా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/మురారిరావు_ఘోర్పడే" నుండి వెలికితీశారు