మూత్రపిండము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 103 interwiki links, now provided by Wikidata on d:q9377 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Anatomy |
Name = మూత్రపిండాలు |
Latin = ren |
GraySubject = 253 |
GrayPage = 1215 |
Image = Kidney_section.jpg |
Caption = వెనుకనుండి చూచినపుడు మానవ మూత్రపిండాలు (అడ్డంగా ఉండే వెన్నెముక ఈ బొమ్మలో చూపలేదు) |
Image2 = |
Caption2 = |
System = |
Artery = [[వృక్క ధమని]] |
Vein = [[వృక్క సిర]] |
Nerve = [[renal plexus]] |
Lymph = |
MeshName = Kidney |
MeshNumber = A05.810.453 |
DorlandsPre = k_03 |
DorlandsSuf = 12470097 |

'''మూత్రపిండాలు''' (Kidneys) చాల ముఖ్యమైన అవయవాలు. జీవి మనుగడకి [[మెదడు]] (brain), [[గుండె]](heart), మూత్రపిండాలు మూలాధారాలు. జీవి చేసే కార్యకలాపాలన్నిటిని నియంత్రించేది మెదడు. శరీరం నాలుగు మూలలకీ రక్తాన్ని ప్రసరింపచెయ్యటానికి పంపు వంటి సాధనం గుండె. రక్తంలో చేరుతూన్న కల్మషాన్ని గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పని చేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. [[రక్తం]]లో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. ఇవి ఒంట్లో నీరు-లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. [[రక్తపు పోటు]] (blood pressure) ని నియంత్రించటంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి.

== మూత్రపిండాల స్థావరం ==

ఒకొక్క మూత్రపిండం చిక్కుడు గింజ ఆకారంలో, పిడికిలి ప్రమాణంలో ఉంటుంది. ఈ రెండూ వీపుకి మధ్య భాగంలో, కడుపుకి వెనక, పక్క ఎముకలకి దిగువగా, వెన్నుకి ఇటూ అటూ ఉంటాయి. తరచుగా ఎడమ వైపు ఉండే మూత్ర పిండం కుడి పిండానికి ఎదురుగా కాకుండా రెండు సెంటీమీటర్లు ప్రాప్తికి ఎగువకి ఉంటుంది. ప్రతి పిండం దరిదాపు 10 సెంటీమీటర్లు పొడవు, 5 సెంటీమీటర్లు మందం ఉండి, దరిదాపు 150 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పిండాలలోనికి రక్తం వృక్క ధమని (renal artery) ద్వారా వెళ్ళి, శుభ్రపడి వృక్క సిర (renal vein) ద్వారా బయటకి వస్తుంది. (ఇంగ్లీషులో 'రీనల్‌' అనే విశేషణం 'మూత్రపిండాలకి సంబంధించిన' అనే అర్ధాన్ని ఇస్తుంది. సంస్కృతంలో ఇదే అర్ధం వచ్చే ధాతువు 'వృక్క'.) చిక్కటి రక్తనాళాల వలయంతో నిండి ఉంటాయి కనుక మూత్రపిండాలు చూడటానికి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.

== మూత్రపిండాలు చేసే పని ==

మన మూత్రపిండాలు ప్రతి రోజూ దరిదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకట్టి అందులోంచి రదరిదాపు 2 లీటర్ల కల్మషాలనీ, అధికంగా ఉన్న నీటినీ తోడెస్తాయి. ఇలా తోడెయ్యబడ్డ నీరే మూత్రం లేదా ఉచ్చ. ఈ మూత్రం, ప్రతి రోజూ, ఇరవైనాలుగు గంటలు, అహర్నిశలూ అలా బొట్లు బొట్లు గా మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఇలా తయారయున బొట్లు యూరెటర్‌ (ureter) అనే పేరు గల రెండు గొట్టాల ద్వారా మూత్రాశం ల(bladder)లో చేరతాయి. ఈ సంచీ నిండగానే ఉచ్చ పోసుకోవాలనే కోరిక మెదడులో కలుగుతుంది. ఈ యూరెటర్లు సుమారు 0.6 సెంటీమీటర్లు వ్యాసం గల గొట్టాలు. ఈ గొట్టాల గోడలలో ఉన్న కండరాలు తరంగాల మాదిరి ముకుళించుకుని వికసిస్తూ ఉంటే వీటిలో ఉన్న మూత్రపు బొట్లు మూత్రాశయం వైపు తొయ్యబడతాయి. మూత్రాశయంలోకి చేరుకున్న మూత్రం మళ్ళా వెనక్కి వెళ్ళకుండా ఈ కండరాలే అడ్డుకుంటాయి. కనుక మూత్రాశయం లో పెరుగుతూన్న మూత్రానికి ఒకటే దారి - బయటకి. మూత్రాశయం నుండి బయటకి వెళ్ళే గొట్టం పేరు యూరెత్రా (urethra). ఇది పురుషాంగం మధ్య నుండి కాని, యోని ద్వారం దగ్గరకి కాని బయటకి వస్తుంది. ఇలా బయటకి వెళ్ళే మార్గాన్ని మూత్రమార్గం (urinary tract) అని కూడ అంటారు.

== గలన యంత్రాంగం ==

చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న మూత్రపిండాలు ఒక పక్క కుంభాకారంగానూ, మరొక పక్క పుటాకారం (concave) గానూ ఉంటాయి. ఈ పుటాకారపు ఒంపు ద్వారా [[వృక్క ధమని]] (renal artery), వృక్క సిర (renal vein), యూరెటర్‌ గొట్టం (ureter tube), వార్తలను మోసే నరాల జడకట్ట (neural plexus) లోపలికి వెళతాయి. ప్రతి మూత్రపిండం లోపల దరిదాపు మిలియన్‌ (1,000, 000) ప్రత్యేకమయిన గలన కణాలు (nephrons) ఉంటాయి. మూత్రపిండాలకి ఈ గలన కణాలు ఆయువు పట్టు. ఒకసారి పాడయితే వీటిని మరమ్మత్తు చెయ్యలేము. పేరుకి గలన కణాలని అన్నా ఇవి ఉత్త గలన ప్రక్రియ (లేదా వడపోత) ఒక్కటీ చేసి ఊరుకోవు. రక్తంలోని మలినాలని వడపొయ్యటం, తరువాత ఆరోగ్యంగా ఉండే రక్తానికి ఉండవలసిన లక్షణాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూడటం - ఇవి ఈ గలన కణాల ముఖ్య బాధ్యతలు. ఈ గురుతర బాధ్యతలు నెరవేర్చటానికి ప్రతీ గలన కణం లోపల రెండు కర్మాగారాలలాంటి ఉపభాగాలు ఉంటాయి. వీటిలో ఒక భాగం పేరు గ్లోమెరూల్సు (glomerulus). రెండవదాని పేరు చిట్టిగొట్టం (tubule). ఇది సన్నటి చుట్టబెట్టిన చిన్న గొట్టం మాదిరి ఉంటుంది. ఈ సంక్లిష్ట వాతావరణంలో [[కేశనాళికలు|కేశనాళికలలో]] (capillaries) రక్తం ఒక పక్క ప్రవహిస్తూ ఉంటే - రకరకాల రసాయన ప్రక్రియల ప్రభావం వల్ల - రక్తం నుండి మూత్రం వేరవుతుంది. అంతే కాకుండా రక్తంలో రసాయన తుల్యతలు అన్నీ ఉండవలసిన విధంగా అమర్చబడతాయి.

== రక్తం లోకి మలినాలు ఎక్కడ నుండి వస్తాయి? ==

మనం తినే ఆహారం జీర్ణం అయి రక్త ప్రవాహంలో కలసినప్పుడు అనవసరమైన పదార్ధాలు కొన్ని రక్తంలో చేరతాయి. కట్టెలు కాలినప్పుడు నుసి మిగిలినట్లు శరీరం తన పనులు తాను చేసుకుంటూ పోయే సందర్భంలో కొన్ని మలిన పదార్ధాలు జీవకణాలలో తయారవుతాయి. ఇలా రక్తంలో చేరిన మలినాలని మూత్రపిండాలు సత్వరం శరీరం నుండి బహిష్కరించపోతే రక్తం విషపూరితం అవుతుంది. రక్తం చిట్టిగొట్టాలగుండా ప్రవహించేటప్పుడు శరీరానికి ఇంకా పనికి వచ్చేవీ, ఇహపనికి రానివీ రెండూ కలిసే ఉంటాయి. అప్పుడు ఆ ప్రవాహంలో ఉన్న సోడియం, పొటాసియం, భాస్వరం మొదలైన ద్రవ్యాలని తూకం వేసి, శరీరం అవసరాలకి సరిపడా రక్తంలో ఉండనిచ్చి, మిగిలిన వాటిని బయటకి తోడుతాయి మూత్రపిండాలలో ఉన్న గ్లోమెరూల్సు, చిట్టిగొట్టాలూ. ఈ పదార్ధాలు ఎక్కవైనా చిక్కే, తక్కువైనా చిక్కే.

[[దస్త్రం:Kidney_PioM.png|300px|thumb|right|1. [[:en:Renal pyramid|Renal pyramid]]
2. [[:en:Efferent artery|Efferent artery]]
3. [[వృక్క ధమని]]
4. [[వృక్క సిర]]
5. [[:en:Hilum of kidney|Renal hilum]]
6. [[:en:Renal pelvis|Renal pelvis]]
7. [[:en:Ureter|Ureter]]
8. [[:en:Minor calyx|Minor calyx]]
9. [[:en:Renal capsule|Renal capsule]]
10. [[:en:Inferior renal capsule|Inferior renal capsule]]
11. [[:en:Superior renal capsule|Superior renal capsule]]
12. [[:en:Afferent vein|Afferent vein]]
13. [[:en:Nephron|Nephron]]
14. [[:en:Minor calyx|Minor calyx]]
15. [[:en:Major calyx|Major calyx]]
16. [[:en:Renal papilla|Renal papilla]]
17. [[:en:Renal column|Renal column]]]]
"https://te.wikipedia.org/wiki/మూత్రపిండము" నుండి వెలికితీశారు