మూలా నారాయణస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6907341 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
'''మూలా నారాయణస్వామి ''' ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ [[వాహినీ పిక్చర్స్]] లో ప్రధాన భాగస్వామి. ఆసియాలో కెల్లా అతి పెద్దదైన [[వాహినీ స్టుడియో]] సముదాయాన్ని 1940 దశాబ్దంలో నిర్మించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని [[తాడిపత్రి]] గ్రామం. వీరి తండ్రి గారి [[కల్లు]] వ్యాపారాన్ని చిన్నతనంలోనే ధనవంతులై తర్వాత కాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైనవి స్థాపించి వ్యాపారల్ని విస్తరించారు.
 
నారాయణస్వామి, [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి]] (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి తండ్రి) తో కలిసి ఉమ్మడి వ్యాపారం చేసి రంగూన్ కి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. తర్వాత ఇద్దరూ [[హెచ్.ఎం.రెడ్డి]] గారి [[రోహిణీ పిక్చర్స్]] లో భాగస్వాములుగా చేసి [[గృహలక్ష్మి]] వంటి కొన్ని సినిమాలు నిర్మించారు. విభేదాల మూలంగా విడిపోయి స్నేహితులిద్దరూ వారి స్వంత నిర్మాణ సంస్థ 'వాహినీ పిక్చర్స్' స్థాపించారు. దీనిలో ముఖ్యమైన వాటా నారాయణస్వామిదే. ఈ సంస్థ ద్వారా వందేమాతరం, సుమంగళి, దేవత స్వర్గసీమ వంటి మంచి సినిమాలు నిర్మించారు. స్వర్గసీమ నిర్మాణం సమయంలో మద్రాసు న్యూటోన్ స్టుడియోలో వారు ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చి స్వంతంగా స్టుడియో నిర్మాణం చేపట్టారు.
 
 
"https://te.wikipedia.org/wiki/మూలా_నారాయణస్వామి" నుండి వెలికితీశారు