"మ్యూజింగ్స్ (చలం రచన)" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
'''మ్యూజింగ్స్''' అనేది సుప్రసిద్ధ తెలుగు రచయిత '''[[గుడిపాటి వెంకటచలం]]''' రచించిన ఆలోచనా సంగ్రహం. చలం ఈ రచనను 1937-1955 సంవత్సరాల మధ్య చేశాడు.
[[బొమ్మ:TeluguBookCover Musings Chalam.jpg|right|thumb]]
 
 
 
ఈ పుస్తక పరిచయంలో http://www.avkf.org వారు ఇలా వ్రాశారు - "తెలుగు సాహిత్యంలో అపురూపంగా నిలచిపోయిన మ్యూజింగ్స్. ఇవన్నీ, గాంధీయిజమ్ నుండి కమ్యూనిజం దాకా, స్త్రీ పురుష సంభోగం నుండి జీవ బ్రహ్మల సంయోగం దాకా, వీరేశ లింగంనుండి శ్రీశ్రీ దాకా - ఎన్నో కబుర్లు ఇందులో దొర్లుతాయి. ఎక్కడా ఎలాంటి ముచ్చు మాటలూ, బడాయిలూ లేకుండా ఉన్నదున్నట్లు తన భావాలను ప్రకటిస్తారు చలం ఇందులో. ఇవన్నీ 1937లో "వీణ" పత్రికలో అచ్చవ్వటం ప్రారంభమయ్యయి, 1955వరకు వ్రాయబడ్డాయి. ఒక పుస్తకంగా చివరి ముద్రణ 2005వ సంవత్సరంలో.
 
==రచనా పద్ధతి==
 
మ్యూజింగ్స్ ఒక వ్యాస సంపుటి. అన్నీ కూడా చలం తన మనసులో పడ్డ అవేదన, అనేక విషయాలమీద నిశితంగా చేసిన అలోచనలు. రచయిత తన అలోచనలలో, ఒక చోటినుంచి మరొక చోటికి వెళ్ళిపోతాడు , మనం వెంట వస్తున్నమో లేదో చూసుకోకుండా! అలోచనలేకాదు, తన జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలు ఇందులో పొందుపరచాడు. అంతేకాదు, అనేక విషయాల మీద తనకున్న నిర్దిష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరచాడు.ఒకచోట ఇలా ప్రస్తావించారు "ఇదివరకు పుస్తకాల్లో ఏదో వొకటి గట్టిగా చెప్పారు. ఈ మ్యూజింగ్స్ లో అన్నిటి అడుగు భాగాలు ఊడగొట్టారు. ఎక్కడ నిలవడం? అన్నారు లీల. అదే నేనూ అడుగుతున్న ప్రశ్న. నన్ను నేను బిగ్గిరిగా అడుక్కుంటున్నాను" అని.
 
==మ్యూజింగ్స్ లో చలం భావాలు==
 
*నిజమైన అర్టిస్టుకి తనలో తనకి ఉండే విశ్వాసం ఇంకెవరికీ దేంట్లోనూ ఉండదు. అతని కల్పన, అతని మనసు లోంచి కాదు పుట్టేది. జనులందరినీ ఏకం చేసే విశ్వ మేధస్సులో కుంచె ముంచి చిత్రిస్తాడు గనక ఆనాడు జరెగే పద్ధతులూ అభిప్రాయాలూ, పై పొరల, వాటిని చీల్చుకుని శాశ్వతంగా నిలిచే మానవత్వంలోంచి పలుకుతాయి అతని పాటలు. అతనికి లోపల తెలుసు, తాను సత్యం రాస్తున్నని, తనని అర్థంచేసుకునేశక్తి లేకా, అర్థం చేసుకొని వొప్పుకొనే ధైర్యం లేకా, మొదటి ఆధిక్యతని వొప్పుకోడం భరించి ఎదుటపడలేక, అతను చెప్పే వాస్తవాన్ని తట్టుకోలేక, తాము గొప్పవని నమ్మి బతికే విలువల్ని చీల్చి చూపుతున్నాడనే కోపంవల్ల తను చెప్పే సత్యం వాళ్ళలో పలుకుతున్నా, మాయపొరలు కప్పుకుని నటిస్తున్నా, అతనికి లెక్కలేదు. కాని ఏనాడో కవి కన్న కలలు వాస్తవం కాకపోవు. ఎందుకంటే ఏ మూలో సృష్టికర్త కలల్ని పంచుకుంటున్నాడు అతను.
 
*మనుషులు సుఖం కోసం, సుఖం సంపాయించుకునే ప్రయత్నంలోనే బతుకుతారన్న మాట నిజం. కాని సుఖంకాక ఏదో ప్రయత్నం - అది కూడా చీల్చి చూస్తే - ఇంకా ఎక్కువ సుఖం ఎక్కడో ఉందనే ఆశతో, పయత్నిస్తోనే ఉంటారు. ఆ ప్రయత్నంలో, ఉన్న తన సుఖాన్నీ, ఇతరుల శాంతిని ధ్వంసం చేస్తారు. మానవుడిలో ఎక్కడా నిలవని ఈ గుణం వల్లనే కమ్యూనిజం ఎంతవరకు నిలుస్తుంది అనే సందేహం కలుగుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1204060" నుండి వెలికితీశారు