"రక్తపు పోటు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
==రక్తపు పోటు లక్షణాలు==
 
రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమీ లక్షణాలు కనబడవు. చాప కింద నీరులా ఇది శరీరానికి కొంత హాని చేసిన తరువాత మరో సందర్భంలో ఎప్పుడో జరిగిన హాని ప్రస్పుటమవుతుంది. ఇలా ముదిరిన తరువాత మందులు వాడినా జరిగిపోయిన హానిని తిరగబెట్టలేము. అందుకని తరచు రక్తపు పోటు ఎంత ఉందో, అవకాశం దొరికినప్పుడల్లా - కొలుచుకుని చూసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో వైద్యుణ్ణి చూడ్డానికి ఏ పని మీద వెళ్ళినా రివాజుగా నర్సులు రక్తపు పోటుని కొలిచి నమోదు చేస్తారు. అలా నమోదు చేసినప్పుడు రోగి ఆ కొలతలని అడిగి తెలుసుకుని గుర్తు పెట్టుకోవటం మంచిది. ఈ కొలత ఉండవలసిన దానికంటె ఎక్కువ ఉంటే ఎక్కువ రక్తపు పోటు (high blood pressure) ఉందని అంటారు. ఎక్కువ రక్తపు పోటు ఉంటే అది గుండె జబ్బుకీ, మూత్రపిండాల జబ్బుకీ దారితీసే ప్రమాదం ఉంది. దీనికి విపర్యంగా మూత్రపిండాలకి జబ్బు చేస్తే దాని మూలంగా రక్తపు పోటు పెరుగుతుంది కూడ. అందుకని రక్తపు పోటు విలువ మీద ఒక కన్నేసి ఉంచటం చాల మంచి అలవాటు, ప్రాణాన్ని రక్షించుకునే అలవాటు.
 
==రక్తపు పోటు అంటే ఏమిటి?==
 
==రక్తపు పోటుకి కారణాలు==
'ఎవ్వరికైనా రక్తపు పోటు ఎందుకు పెరుగుతుంది?' అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. ప్రవర (family history), లింగం (gender), వయస్సు (age), జాతి (race) - అన్నీ కొద్దో గొప్పో దోహదం చేస్తాయి. తల్లి దండ్రులకి, దగ్గర బంధువులకి ఉంటే పిల్లలకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వయస్సు పెరుగుతూన్న కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. గణాంకాల ప్రకారం అమెరికాలో ఉండే నల్ల వారిలో ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కారణాల వల్ల వచ్చే రక్తపు పోటు పెరుగుదలని ఇంగ్లీషులో primary hypertension అంటారు. వీటిని మనం అంతర్జనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు. ఇలా కాకుండా ఏదో జబ్బు వల్ల వచ్చేది secondary hypertension లేదా తెలుగులో వ్యాధిజనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు. ఇటువంటి వర్గీకరణ కంటె భౌతిక సూత్రాలని ఉపయోగించి ఏయే సందర్భాలు రక్తపు పోటు పెరుగుదలకి దోహదం చేస్తాయో చూడవచ్చు.
 
* పంపు జోరు (rate of pumping). గుండె ఎక్కువ జోరుగా కొట్టుకుంటే రక్తపు పోటు ఎక్కువ అవుతుంది.
* పొగ తాగటం మానటం.
* బరువుని అదుపులో పెట్టటం. ప్రతి వ్యక్తి విగ్రహానికి అనుకూలమైన బరువు ఉండాలి తప్పితే అతిగా ఉండకూడదు. లావుపాటి శరీరంతో పోలిస్తే బక్కపలచని శరీరం ఎప్పుడూ శ్రేయస్కరమే.
* ఆరోగ్యమైన ఆహారం తినటం. తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, పళ్ళు, దినుసులు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, పెరుగు, మొదలయిన పదార్ధాలు ఉండటం మంచిది. నూనెలు, నేతులు వాడేటప్పుడు [[అసంతృప్త గోరోజనామ్లాలు]] (unsaturated fatty acids) [[సంతృప్త గోరోజనామ్లాలు]] (saturated fatty acids) కంటె మంచివని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని రకాల చేప నూనెలు (fish oils) ఈ సందర్భంలో మంచివని గమనించాలి. ఉదాహరణకి : eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA).
 
* ప్రతి రోజూ నియమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం. ప్రతిరోజూ అరగంటకి తక్కువ కాకుండా, కొద్దిగా చెమట పట్టే వరకు, గబగబ నడవటం.
 
ఉప్పు : బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయము కావడమన్నది ఉండదు . కాని జీవనవిధానం లో మార్పులు ద్వారా రాకుండా జాగ్రత్తపడొచ్చు. జీవితములో చిన్న చిన్న మార్పుల ద్వారా నియంత్రణలో ఉందుకోవచ్చును.
ఆహారములో ఉప్పు వాడకము తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడొద్దు . ముఖ్యము గా ప్రాసెస్డ్ , ప్యాకేజీపధార్ధములు , ఫాస్ట్ పుడ్స్ , క్యాన్డ్ పధార్ధములు తినడము బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బి.పి.ని అధికము చేస్తుంది.
 
పొటాషియం : ఇది బి.పి.ని తగ్గిస్తుంది .బీన్స్ , జఠాణీలు, నట్స్ , పాలకూర , జ్యాబేజీ , కొత్తిమిర , అరటి , బొప్పాయి, ద్రాక్ష , కమలా , నారింజ , నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం , ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడము లో బాగా ఉపయోగపడతాయి.కొబ్బరి నీరులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
కొవ్వు పదార్ధములు : వీటివలన రక్తము లో కొలెస్టిరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపములో ఉన్న కొవ్వులు. వీటి వాడాకము తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు , ఆవకాయ , కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.
 
ఆహారములో మార్పులు : ఎక్కువ పీచు పదార్ధము ఉన్న వాడాలి. పండ్లు , కాయకూరలు , ఆకు కూరలు , పప్పులు వాడాలి. రోజుకు కనీషము 5 సర్వింగులు పండ్లు , కూరకాయలు తింటుండాలి. సాష్ లు , ఊరగాయలు బాగా తగ్గించాలి.
 
ఆల్కహాలు : అలవాటు ఉండే వారు మానివేయాలి , . . లేదా పరిమితులు ఉండాలి.ఆల్కహాల్ ఎక్కువ కేలరీలు ఉన్న పానీయము .
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1204700" నుండి వెలికితీశారు