రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

'Tagoresignature.png' -> 'Rabindranath Tagore Signature.svg' using GlobalReplace v0.2a - Fastily's PowerToys: svg version
చి Wikipedia python library
పంక్తి 18:
:'' '''గీతాంజలి''' పూర్తి అనువాదం వికిసోర్స్‌లో ఉన్నది. [[:s:గీతాంజలి|ఇక్కడ]] చూడండి''
 
[[భారత దేశం|భారత దేశానికి]] [[జాతీయ గీతం|జాతీయ గీతాన్ని]] అందించిన కవి, '''రవీంద్రనాథ్ టాగోర్''' (Ravindranath Tagore). టాగోరు గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన '''[[గీతాంజలి కావ్యం|గీతాంజలి]]''' కావ్యానికి సాహిత్యంలో [[నోబెల్ బహుమతి]]ని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.
 
== బాల్యము, విద్యాభ్యాసము ==
వంగదేశంలో [[1861]] మే 7వ తేదీన దేవేంద్రనాథ ఠాగూరు, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు.
 
రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవాడు. బొమ్మలున్న ఆంగ్ల నవలలను స్వయంగా చదివేవాడు. [[కాళిదాసు]], [[షేక్స్‌పియర్]] రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు.
పంక్తి 29:
== సాహితీ వ్యాసంగం ==
{{seemain|రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు}}
రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన ''సంధ్యాగీత్'' కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. [[వందేమాతరం]] గీతాన్ని రచించిన [[బంకించంద్ర ఛటర్జీ]] కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు ''విర్గరేర్ స్వప్న భంగ'', 'sangeetha prabhata'' అనే కావ్యాలను రచించాడు.
 
== గీతాంజలి ==
పంక్తి 39:
 
== నవల,నాటకాలు ==
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకై శ్రీ నికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు. రవీంద్రుడు మొదట ''వాల్మీకి ప్రతిభ'' అనే నాటకాన్ని రచించాడు. ఆ తరువాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి ''పోస్టాఫీసు'' అనే నాటకం వ్రాశాడు. రవీంద్రుడు రచించిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. ''ప్రకృతి - ప్రతీక'' అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక శ్రేష్టమయిన నాటకాలు రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన 'గోరా' నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది.
 
== చిత్రకళ, సంగీతం ==
పంక్తి 47:
 
== స్వాతంత్ర్య సాధన,జనగణమణ ==
రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. [[పృథ్వీరాజు]] పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం [[బాలగంగాధర తిలక్|తిలక్‌]]ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. [[బెంగాల్ విభజన]] ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ [[1896]] లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన '''వందేమాతరాన్ని''' ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన '''' జనగణమణ '''' ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుధీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ''''జనగణమన'''' దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|బాబూ రాజేంద్ర ప్రసాద్]] [[1950]] [[జనవరి 24]]న ''[[జనగణమన]]'' ను జాతీయ గీతంగా ''[[వందేమాతరం]]'' ను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు.
 
== రచనలనుండి ఉదాహరణలు ==
పంక్తి 92:
'''ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
 
'''తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు'''
 
== చివరి రోజులు ==
"https://te.wikipedia.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు