"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Bot: Migrating 21 interwiki links, now provided by Wikidata on d:q1296075 (translate me))
చి (Wikipedia python library)
ఆర్.యస్.యస్. వాదులు గేరువా పతాకం (కాషాయ జండా)ను తమ పరమ గురువుగా భావిస్తారు. ఈ సంస్థ యొక్క సర్వోన్నతమైన నాయకుడిని [[సర్ సంఘ్ చాలక్]] గా వ్యవహరిస్తారు. [[1948]] లో [[మహాత్మా గాంధీ]] హత్యానంతరం, [[1975]] [[ఎమర్జెన్సీ]] సమయంలో మరియు [[1992]] [[బాబ్రీ మసీదు]] విధ్వసానంతరం ఈ సంస్థ మీద నిషేధం విధించి మరలా తొలగించడం జరిగినది. ఆర్.యస్.యస్. మొదటినుంచి ఒక వివాదాస్పద సంస్థగానే కొనసాగింది. హిందూ ముస్లిం కొట్లాటలలో హిందువులకు ఆత్మరక్షణ కల్పించటం, ముస్లిం వర్గాల దాడులను తిప్పి కొట్టటం ఈ సంస్థ కార్యకలాపాలలో ఒకటి. కొందరు విమర్శకులు దీనినొక ఫాసిస్టు సంస్థ గా అభివర్ణిస్తారు.
 
ఆర్.యస్.యస్. మరియు దీని అనుభంధ సంస్థలన్నింటినీ కలిపి [[సంఘ్ పరివార్]] అని పిలుస్తారు. [[భారతీయ జనతా పార్టీ]], [[విశ్వ హిందూ పరిషత్]], [[భజరంగ్ దళ్]] వీటిలో ముఖ్యమైనవి. ఆర్.యస్.యస్. తోపాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు. <!--ఆర్.యస్.యస్. రాజకీయ కార్యక్రమాలన్నీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మొదట ఆ పార్టీ పేరు [[జనసంఘ్]] గా ఉండేది.-->
ఈ సంస్థకు [[1925]] నుండి [[1940]] వరకు [[సర్ సంఘ్ చాలక్]] గా పనిచేసిన ఈ సంస్థ వ్యవస్థాపకుడు [[కె.బి.హెడ్గేవార్]], ఆయన తరువాత [[1940]] నుండి [[1973]] వరకు ఆ పదవిలో పనిచేసిన [[మాధవ్ సదాశివ్ గోల్వల్కర్]] మరియు తదుపరి [[1973]] నుండి [[1993]] వరకు ఆ పదవిలో పనిచేసిన [[మధుకర్ దత్తాత్రేయ దేవరస్]] ఈ ముగ్గురూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారత దేశమంతటా విస్తరించటానికి ఎనలేని కృషి చేశారు.
 
ఈ సంస్థ అనేకానేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఏవైనా విపత్తులు సంభవించినపుడు పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని నిరుపమానమైన సేవలందిస్తుంది.
<Gallery>
File:राष्ट्रीय स्वयंसेवक संघ building Nagpur Maharashtra main entrance.JPG
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1206095" నుండి వెలికితీశారు