రేడియో: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox laboratory equipment
|name = <big>'''రేడియో'''</big>
|image =Fisher_500_radio.jpg
|alt =
|caption = రేడియో
|acronym =
|other_names = నిస్తంత్రీ ప్రసారం, ఆకాశవాణి
|uses = నిస్తంత్రీ విధానంలో సమాచార ప్రసారం
|inventor = మార్కోనీ
|manufacturer =
|model =
|related = ట్రాన్సిస్టర్
}}
 
 
కాంతి వేగ పౌనఃపున్యాల(Frequency)తో విద్యుత్‌ అయస్కాంత(Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని '''రేడియో''' అంటారు. మొదటిరోజులలో వాల్వులను ఉపయోగించి, రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడ చాలా పెద్దవిగా ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్సిస్టర్ లను వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి. వీటిని ట్రాన్‌సిస్టర్ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి విద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, ఘటము([[బ్యాటరీ]]-Battery)తో కూడ పనిచేయగలవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఈ ట్రాన్సిస్టర్ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెంది, రేడియోలు పరిమాణంలో చిన్నవి, అతి చిన్నవిగా మారిపోయాయి. జేబులో పట్టే రేడియోలు (Pocket Radios) వచ్చినాయి. ఇప్పుడు విడుదలవుతున్న ప్రతీ కంపెనీ మొబైల్స్ లోనూ రేడియో అప్లికేషను తప్పనిసరి అయిపోయింది
==చరిత్ర==
===మాక్స్ వెల్ ప్రయోగం===
పంక్తి 33:
మార్కోనీ తన పరికరాల్ని ఇంటి ముందుండే తోటలోకి మార్చాడు. క్రమంగా సంకేతాలు వెళ్ళగలిగే దూరాన్ని పెంచుతూ పోయాడు. ఓ చిన్న గుట్ట ఆవలిపైపు దాకా సంకేతాలు వెళ్ళగలిగాయి. సంకేతం ఆవలి వైపున చేరగానే దాన్ని గుర్తించానని తెలియజేయడానికి గాను ఆయన తమ్ముడు గుట్టపై నిలబడి నాట్యం చేసేవాడు. 1896 నాటికి ఈ సంకేతాలు రెండు మైళ్ళ దాకా వెళ్ళగలిగేవి. మార్కోనీ తల్లి వుట్టినిల్లు [[ఐర్లండ్]] అయితే మెట్టినిల్లు [[ఇటలీ]]. పరికరాన్ని [[బ్రిటన్]] కు తీసుకొని వెడితే బాగుంటుందని ఆమె సలహా యిచ్చింది.
===పేటెంట్ హక్కులు===
[[లండన్]] వెళ్ళగానే మార్కోనీ వైర్ లెస్ పరికరాన్ని పేటెంట్ కార్యాలయం లో రిజిస్టర్ చేయించాడు. జనరల్ పొస్టాఫీసులో ప్రధాన ఇంజనీరుగా పనిచేస్తున్న విలియం ప్రీస్ పరికరాన్ని ప్రదర్శించడానికి మార్కోనీకి అనుమతి సంపాదించిపెట్టాడు. ఇంజనీర్లు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, వ్యాపార సంస్థల అధిపతులు ఈ ప్రదర్శనకు ఆహ్వానించబడ్డారు. ఇంట్లో తయారు చేసిన మొరటుపరికరాలు ఎలా పనిచేస్తాయో ఏమో అని మార్కోనీ అధైర్య పడ్డాడు. కానీ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైంది. మరుసటి ప్రదర్శన పదాతిదళం, నావికాదళం అధిపతుల సమక్షంలో జరిగింది. మార్కోనీ పరికరంతో సంకేతాలను ఎనిమిది మైళ్ళ దాకా పంపడానికి వీలయ్యేది.
===నీళ్లపైన ప్రయోగం===
1897 మే లో తొలి వైర్ లెస్ టెలిగ్రాఫ్ స్టేషన్ కార్డిఫ్ వద్ద నెలకొల్పబడింది. ఏరియల్ ని వంద అడుగుల ఎత్తులో బిగించారు సంకేతాలు నీళ్ళ మీదుగా ఎలా ప్రయాణిస్తాయో పరిశీలించాలని బ్రిస్టల్ చానల్ మధ్య భాగం నుంచి ప్రసారం ప్రారంభించాడు. మొదట్లో సంకేతాల జాడే కనిపించలేదు. నిరాశ చెందకుండా మార్కోనీ ఎక్కడ లోపముందో పరీక్షించి, పరికరంలో తగిన మార్పులు చేసాడు. సంకేతాలు వచ్చాయి కానీ అవి బలహీనంగాను, లోపభూయిష్టంగానూ ఉండేవి. ఏరియల్ పొడవును పెంచి సంకేతాలను సంతృప్తికరంగా గుర్తించటం జరిగింది. ఈ ప్రయోగాలను పరిశీలించటానికి బెర్లిన్ అధికారులు ప్రొఫెసర్ స్లాచీ, జార్జ్ ఆర్కో అనే ఇద్దరు నిపుణులను పంపించారు కూడా.
===ఖ్యాతి===
అనతి కాలంలోనే మార్కోనీ ప్రయోగాల విజయ గాధలు యూరప్ అంతా వ్యాపించాయి. ఎక్కడ చూసినా ప్రజలు ఆయన వినూత్న ఆవిర్భావాన్ని గురించి చర్చించుకోసాగారు. ఇది వరకు ఇంగ్లండ్ లో అతడిని గేలి చేసిన వాళ్ళూ, విమర్శించిన వాళ్ళూ ఇప్పుడు జోహార్లర్పించడం మొదలుపెట్టారు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఓడలలో వార్తా ప్రసార సౌకర్యాలు ఏర్పరుచుకునే అవకాశం దగ్గర పడుతోందని సామాన్య ప్రజలకు కూడా నమ్మకం కుదిరింది.
==వైర్ లెస్ ప్రసారాలు==
క్రమంగా సంకేతాలను ఎక్కువ దూరం ప్రసరించేలా చేయడంలో మార్కోనీ కృతకృత్యుడయ్యాడు. 1898 వేసవి లో సముద్ర మధ్యంలో జరిగిన పడవ పందేలను గురించి ఎప్పటికప్పుడు వార్తలు పంపడానికి డబ్లిన్ వార్తా పత్రిక మార్కోనీని నియమించింది. అతడు సముద్ర తీరంలో గ్రాహకాన్ని అమర్చి, వైర్ లెస్ ప్రసారిణిని ఓ పడవలో ఉంచుకొని బయలు దేరాడు. వార్తలను వైర్ లెస్ ద్వారా సముద్ర తీరానికి పంపితే, అక్కడి నుంచి వార్తా పత్రిక కార్యాలయానికి టెలిఫోన్ ద్వారా చేరవేశారు. వైర్ లెస్ ద్వారా పంపబడిన మొట్టమొదటి పత్రికా వార్త ఇదే.
 
వేల్స్ రాకుమారుడు ఒకసారి విహార నౌకలో వెడుతూ వైట్ దీవుల కావల జబ్బు పడ్డాడు. కుమారుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలని విక్టోరియా రాణి సంకల్పించింది. వెంటనే మార్కోనీని అభ్యర్థించగా అతడు వైర్ లెస్ పరికరాలను నెలకొల్పి, 16 రోజుల పాటు నిర్విరామంగా వార్తలను చేరవేసే ఏర్పాటు చేశాడు. మొత్తం 150 టెలిగ్రాంలు అటూ, యిటూ ప్రసారం చేయబడ్డాయి.
పంక్తి 49:
 
==విమర్శలు==
దీనితో ప్రయోగం దిగ్విజయం కావడమే కాకుండా, మార్కోనీ కష్టాలు కూడా మొదలయ్యాయి. కార్న్ వాల్ నుంచి సంకేతాలు వింటున్నానని భావించటం ఆత్మ వంచనే అని [[థామస్ అల్వా ఎడిసన్]] లాంటి వాళ్ళు అభిప్రాయ పడ్డారు. అతడు మోసగాడని మరి కొందరు దూషించారు. న్యూఫౌండ్ లాండ్ లో టెలిగ్రాఫ్ ప్రసారాలకు సంబంధించి, తమ గుత్తాధికారాలను హరించాడని ఓ అమెరికన్ టెలిగ్రాఫ్ సంస్థ మార్కోనీపై దావా వేస్తానని బెదిరించింది. వైర్ లెస్ ప్రసారాలు నెలకొల్పడంలో ప్రపంచమంతటా తనదే గుత్తాధిపత్యం ఉండాలని మార్కోనీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని కొన్ని వ్యాపార వర్గాలు, రాజకీయ వాదులూ ఆరోపించసాగారు. అతని పరిశోధనను దురుద్దేశాలతో, దుస్సాహసాలతో కూడుకున్న కుంభకోణంగా పలువురు అభివర్ణించారు.
 
==ప్రజాజీవనంలో వైర్ లెస్==
పంక్తి 55:
 
==టైటానిక్ ఓడ - SOS సందేశం==
ఈ శతాబ్దం ప్రారంభ దశలో తొలి అంతర్జాతీయ వైర్ లెస్ సమావేశం జరిగింది. ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు సహాయం అర్థించడానికి SOS అనే సంకేతాన్ని ఉపయోగించాలని తీర్మానించారు. అందరూ అనుకున్నట్లుగా ఈ సంకేతానికి అర్థం (save our souls) మమ్మల్ని రక్షించండి అనికాదు. మోర్స్ కోడ్ ప్రకారం ఈ మూడు అక్షరాలను మూడు చుక్కలు,మూడు డాష్ లు, మూడు చుక్కలుగా సూచిస్తారు. ప్రసారం చేయటానికి సులువుగానూ, సరళంగానూ ఉంటుందని సంకేతాన్ని ఇలా నిర్ణయించారు. 1912 ఏప్రిల్ లో [[టైటానిక్]] అనే ఓడ సముద్ర మధ్యంలో ఓ మంచు కొండ ను ఢీకొంది. ఓడ మునిగి పోతుండగా అక్కడి ఆపరేటర్ వైర్ లెస్ ద్వారా SOS సంకేతాలను అనేక సార్లు పంపించాడు. ఫలితంగా 700 మందిని రక్షించటానికి వీలైంది. వైర్ లెస్ టెలిగ్రాఫ్ విధానం ఇంకా వేళ్ళూనుకోక ముందే సంభాషణల్ని, సంగీతాన్ని ఇదే విధంగా ప్రసారం చేయగలిగే రోజు ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తుండేవారు. ఈ కలలు పండడానికి అనేక సాంకేతిక అవరోధాలు అధిగమించవలసి వచ్చింది.
 
==రేడియో ప్రసారాల ఆవిష్కరణ-విధానము==
[[File:Signal processing system.png|thumb|upright=1.45|How radio communication works. Information such as sound is transformed into an electronic signal which is applied to a [[transmitter]]. The transmitter sends the information through space on a [[radio wave]] (electromagnetic wave). A receiver intercepts some of the radio wave and extracts the information-bearing electronic signal, which is converted back to its original form by a [[transducer]] such as a [[loudspeaker|speaker]].]]
ఇందుకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలు వేరు వేరుగా కృషి చేశారు. ఇంగ్లండు కు చెందిన ప్రొఫెసర్ ప్లెమింగ్ 1904 లో శూన్య నాళిక అనే కొత్త సాధనాన్ని నిర్మించాడు. దీనిలో రెండు ఎలక్ట్రోడులు ఉంటాయి. ఒకదాన్ని వేడి చేస్తే దాని నుంచి [[ఎలక్త్రాన్]] లు వెలువడతాయి. దీన్ని [[కాథోడ్]] అంటారు. ఈ సాధనంతో [[విద్యుత్తు]] ఒక దిశలో మాత్రమే వెళ్ళగలుగుతుంది. అంటే ఇది ఏకాంతర విద్యుత్తును ఏక ముఖ విద్యుత్తుగా మారుస్తుందన్న మాట. అందుకే దీన్ని వాల్వు అని కూడా అంటారు.
 
ప్లెమింగ్ కనుగొన్న వాల్వు ను ఉపయోగించి వైర్ లెస్ తరంగాలను గుర్తించటమే కాకుండా, బలహీనమైన తరంగాలను బలవత్తరం చేయవచ్చునని వియన్నా కి చెందిన [[లీబెన్]], అమెరికాకి చెందిన [[లీ డీ ఫారెస్ట్]] అనే శాస్త్రవేత్తలు గ్రహించారు. ప్లెమింగ్ వాల్వు లో ఉండే రెండు ఎలక్ట్రోడ్ ల మధ్య రంధ్రాలు గల గ్రిడ్ అనే మూడో ఎలక్ట్రోడు ను అమర్చితే [[మైక్రోఫోను]] నుంచి వచ్చే బలహీన తరంగాలను వర్థనం చేయటానికి (Amplify) వీలవుతుంది. మూడు ఎలక్ట్రోడు లు కలిగి ఉన్న ఈ సాధనాన్ని [[ట్రయోడు]] అంటారు. దీన్ని ఉపయోగించి అధిక [[పౌనఃపున్యము]] గల [[తరంగాలు|తరంగాలను]] ఉత్పత్తి చేయవచ్చు. ఇలాంటి తరంగాలను ప్రసారం చేయడంలోనూ, రిసీవర్ ల ద్వారా గ్రహించటంలోనూ ట్రయోడ్ అత్యంత కీలక పాత్ర వహించింది.
 
లీబెన్ చిన్న వయస్సులోనే చనిపోయాడు గాని లీ డీ ఫారెస్ట్ తరంగాల ప్రసారంలోనూ, వాటిని గ్రహించటంలోను ఇతని పరిశోధనలు ఉపయోగపడేలా కృషిచేశాడు. ప్రసారిణి ఉత్పత్తి చేసే వాహక తరంగాలను(carrier waves) మైక్రోఫోన్ లోని శబ్దాలకు అనుగుణంగా వచ్చే విద్యుత్ ప్రవాహ స్పందనలతో(pulses) కలుపుతారు. ఇలా కలపడం వాల్వు చేస్తుంది. గ్రాహకం(Receiver) లో ఈ మిశ్రిత తరంగాల నుంచి వాహక తరంగాలను తీసివేసి, మిగతా భాగాన్ని వాల్వు ల సహాయంతో వర్థనం చేసి(amplified) లౌడ్ స్పీకర్ల ద్వారా శబ్ద తరంగాలుగా మారుస్తారు.
 
==రేడియో ప్రసారాల ప్రారంభం==
పంక్తి 75:
రేడియో ప్రసారాల విషయంలో ఆసక్తి కనబరచిన తొలి యూరోపియన్ దేశం ఇంగ్లండే. ప్రసార కేంద్రాలను నెలకొల్పడానికి, ఇష్టమొచ్చిన కార్యక్రమాలను ప్రసారం చేసుకోవటానికి అమెరికాలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ బ్రిటను లో పరిస్థితి వేరు.10 వాట్ ల కంటే ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్ మీటర్ లను నెలకొల్పరాదన్న ప్రభుత్వ నిషేధం శాస్త్రవేత్తల ఉత్సాహాన్ని నీరుగార్చింది. 100 వాట్ల కేంద్రం వల్ల కూడా ఎలాంటి హాని కలగదని ప్రభుత్వాధికారులను ఒప్పించటానికి కొన్ని నెలలు పట్టింది. ఎట్టకేలకు ఛెల్మ్స్ ఫర్డ్ వద్ద అలాంటి కేంద్ర నిర్మాణానికి మార్కోనీ కంపెనీ అనుమతించబడింది. వారానికో రోజు అరగంట మాత్రం ప్రసారం జరుగుతుండేది. ప్రతి ఏడు నిమిషాలకు మూడు నిమిషాల సేపు ప్రసారాన్ని నిలిపి వేసి ప్రభుత్వ ట్రాన్స్ మీటర్ ద్వారా నిషేధాజ్ఞలు యేవీ అందక పోతే ప్రసారాన్ని మళ్ళీ కొనసాగించే వారు. ఈ కారణంగా కార్యక్రమాలు నిరుత్సాహ జనకంగా తయారయ్యాయి. పైగా కేవలం కొన్ని నిమిషాలే పరిమితమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రసిద్ధ కళాకారులెవ్వరూ ముందుకు రాలేదు.
 
1922 మే నెల లో 100 వాట్ల సామర్థ్యం గల రేడియో ప్రసార కేంద్రాన్ని లండను లో స్థాపించారు. ఎందుకనో మొదట్లో సంగీత కార్యక్రమాల ప్రసారాన్ని ప్రభుత్వం నిషేధించింది. కొంత కాలానికి నిషేధాన్ని తొలగించాక ప్రసారాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. [[బ్రిటను]], [[ఫ్రాన్సు]] దేశాల వివిధ ప్రాంతాల నుంచి శ్రోతలు అధిక సంఖ్యలో అభినందన లేఖలు వ్రాయసాగారు. మరింత క్రమబద్ధంగా కార్యక్రమాల్ని మలిచి, ఇతర ప్రదేశాల్లో ట్రాన్స్ మీటర్ లను నెలకొల్పి ప్రసార శాఖను సాంకేతికంగా మెరుగు పరచాలని అభ్యర్థనలు కోకొల్లలుగా వచ్చాయి. ఫలితంగా వైర్ లెస్ పరికరాలను తయారు చేసే అరడజను కంపెనీలు కలిసి బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (B.B.C) అనే సంస్థను 1922 నవంబరు లో స్థాపించాయి. బ్రిటను లో ప్రసార హక్కులు గల ఏకైక సంస్థగా దీన్ని ప్రభుత్వం గుర్తించింది. నవంబరు 14 నుంచి లండను కేంద్రం రోజువారీ ప్రసారాలు ప్రారంభించింది. మరు దినం నుంచి బర్మింగ్ హామ్ లోనూ, కొద్దికాలం తరువాత మాంచెష్టర్ లోనూ ప్రసార కేంద్రాలు పనిచేయటం మొదలు పెట్టాయి. 1923 మే లో జెకోస్లావేకియా, అదే సంవత్సరం అక్టోబరు లో జర్మనీ ప్రసార కేంద్రాల్ని స్థాపించాయి.
 
==నిర్మాణం లో మార్పులు==
పంక్తి 90:
 
===మధ్య తరహా తరంగాలు(Medium Wave)===
ఈ పౌనఃపున్యాన్ని ముఖ్యంగా కొద్ది ప్రాంతంలో అంటే 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి వరకు ప్రసారానికి వాడతారు. ఈ ప్రసారాలలో నాణ్యత, ధ్వనిలో స్వచ్ఛత మధ్య రకంగా ఉంటుంది. ధ్వని ప్రసారంలో ఎక్కువ తక్కువలు సామాన్యంగా ఉండవు. ట్రాన్స్‌మిటరు నుండి అన్ని ప్రక్కలకు ఏరియల్ ద్వారా వలయాకారంగా ప్రయాణించి రేడియోలను చేరుకుంటాయి. మనం వింటున్న హైదరాబాదు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఈ విధమైన ప్రసారాలు చేస్తున్నాయి.
 
===అతి చిన్న తరంగాలు(Short Wave)===
ఈ పౌనఃపున్యతను సుదూర ప్రాంతాలకు ప్రసారంచేయడానికి వాడతారు. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్ యొక్క కోణాన్ని బట్టి ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500 కిలోమీటర్ల ను దాటి ఈ ప్రసారాలు ఉంటాయి. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్‌ నుండి వెలువడిన రేడియో తరంగాలను భూవాతావరణపు పై పొర (Iono sphere) ను తమకు కావల్సిన కోణంలో ఢీ కొట్టేట్టుగా వదులుతారు. ఆ రేడియో తరంగాలు , భూవాతావరణపు పై పొర (Ionosphere) ను ఢీకొని వికేంద్రీకరించబడి (Reflect) తిరిగి భూమి మీదకు ప్రసారమవుతాయి. సామాన్యంగా, ట్రాన్స్‌మిటర్‌కు, ప్రసారమయ్యే ప్రాంతానికి దూరం 3,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ట్రాన్స్‌మిటరు ఏరియల్ కోణాన్ని నియంత్రించి ఈ దూరాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జరిగే ప్రసారాలు చాలా దూరం వినబడినా, ధ్వనిలో నాణ్యత ఉండదు. భూ వాతావరణపు పొరలో వచ్చే మార్పులమీద ఆధారపడి ప్రసారాలు జరుగుతాయి కాబట్టి, రేడియోలలో వచ్చే ప్రసార కార్యక్రమాల ధ్వని పైకి, కిందకూ జరుగుతూ ఉంటుంది. ఒకే ప్రాతంలో వాతావరణపు పొరను ఢీ కొట్టటం వలన ఒక రేడియో స్టేషన్‌‌కు మరొక స్టేషన్‌కు తరంగాలు కలసి పోయి ఒక్కొక్కసారి అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతిలో చాలా తక్కువ రేడియో స్టేషను లు ప్రసారాలు చేస్తున్నాయి. బి.బి.సి(British Boradcasting Corporation), వి.వొ.ఎ. (Voice of America) మొదలగు అంతర్జాతీయ రేడియో సంస్థలు ఈ విధానంలో దశాబ్దాలపాటు ప్రసారాలు చేసినాయి, ఇప్పటికి కూడ చేస్తున్నాయి.
 
===పౌనఃపున్య మాడ్యులేషన్(Frequency Modulation)===
పంక్తి 100:
 
వైర్ లెస్ టెక్నీషియన్లు చిరకాలంగా కంటున్న మరో కల ఈ పద్ధతి వల్ల నిజమైంది. శబ్దాన్ని త్రిపరిమాణీయంగా(Three Dimensional) లేదా స్టీరియో పద్ధతిలో ప్రసారం చేయటం. రెండు మైక్రోఫోన్ లను ఒకదానికొకటి కొంత దూరంలో ఉండేలా అమర్చి, రెండు ట్రాన్స్ మీటర్ ల ద్వారా ప్రసారం చేస్తారు. రిసీవర్లు, లౌడ్ స్పీకర్ లు కూడా రెండేసి ఉంటాయి.
<!--ఈ ఫ్రీక్వెన్సీని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారు. ప్రస్తుతం ఈ ప్రసార విధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రేడియో స్టేషనులు ప్రసారాలు చేస్తున్నాయి. మన భారతదేశంలో కూడ అనేక ప్రవేటు ఛానల్స్ ఈ విధానంలో ప్రసారం చేస్తున్నాయి. రేడియో మిర్చి, రెడ్ ఎఫ్‌.ఎమ్‌.(93.5) వంటివి ఈ తరహాకు చెందిన ప్రసారాలు చేస్తున్నాయి. ఈ ప్రసార విధానంలో, రేడియో ట్రాన్స్‌మిటర్‌ కు అనుసంధించిన ఏరియల్‌ ను కొంత ఎత్తులో ఉంచుతారు. అక్కడనుండి, ప్రసారమయ్యే రేడియో తరంగాలు సూటిగా ప్రయాణిస్తాయి. మధ్యలో ఎత్తయిన భవనాలు మరియు ఇతర కట్టడాలు అడ్డు వస్తే తరంగాలు అక్కడితో ఆగిపోతాయి. దీనికి కారణం, దృగ్రేఖ (Line of sight) పద్ధతిలో ఈ ప్రసారాలు జరుగుతాయి. ఈ పద్ధతిలోని ప్రసారాలు చక్కటి నాణ్యతను, ధ్వని స్వచ్ఛతను కలిగి ఉంటాయి. స్టీరియో(Stereo) లో కూడ ప్రసారాలు ఈ పద్ధతిలో చేయవచ్చును.-->
ఇవి కాక, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని శాటిలైటు రేడియోలు, ఇంటర్‌నెట్‌ రేడియోలు కూడ ఉన్నాయి.
 
==అర్థవాహకాల వినియోగం==
[[ట్రాన్సిస్టర్]] ఆవిర్భావంతో ఎలక్ట్రానిక్స్ విభాగంలోనే విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. వాల్వు రేడియోలకు పూర్వం క్రిస్టల్ సెట్ లను వాడేవారని మనకు తెలుసు. ఇందులో గెలీనా (Gelena Lead sulphide) అనే క్రిష్టల్ ఉంటుంది. ప్రసారం చేయబడే కార్యక్రమాలు ఏకాంతర (Alternating) విద్యుదయస్కాంత తరంగాల రూపంలో క్రిస్టల్ పై పడినపుడు ఏకాంతర విద్యుత్తు ఏకముఖ విద్యుత్తు(Direct) గా మారుతుంది. ఈ విద్యుత్తు వల్ల చెవులకు తగిలించుకున్న ఫోన్ లలో శబ్ద తరంగాలు వినబడతాయి. ఇక్కడ ఉపయోగించే క్రిస్టల్ ని అర్థవాహకం(semi conductor) అంటారు.
 
వాల్వు రేడియోలు వచ్చాక, అర్థ వాహకాల్లో పరిశోధనలు తెరమరుగయ్యాయి. రేడియో సంకేతాలను గుర్తించటానికి, వర్ధనం చేయటానికి వాల్వు లే సమర్థవంతమైన సాధనాలుగా తయారయ్యాయి. ఒకటి, అవి గాజుతో తయారు చేయబడటం వల్ల పగిలిపోయే ప్రమాదముంది. రెండోది, అవి పనిచేయాలంటే అధిక వోల్టేజీ విద్యుత్తు అవసరం. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ సాధనాలకోసం శాస్త్రవేత్తలు కృషి చేయసాగారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ పరిశోధనలు మరీ ముమ్మరంగా కొనసాగాయి.
పంక్తి 127:
==ఆకాశవాణి==
{{main|ఆకాశవాణి}}
'''ఆలిండియా రేడియో''' ప్రభుత్వ ఆధికారిక [[రేడియో]] ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార యంత్రాంగ ఆధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన [[ప్రసార భారతి]] యొక్క విభాగము. దూరదర్శన్ కూడ ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము కొత్త ఢిల్లీ లోని పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు ప్రక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉన్నది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి.
 
==భారత దేశ అభివృద్ధిలో రేడియో పాత్ర==
పంక్తి 134:
 
===వ్యవసాయ అభివృద్ధిలో===
1966 ప్రాంతాలలో వ్యవసాయ విషయాలను రైతులకు చెప్పటానికి పంటసీమలు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం రూపొందించంటంలో ఆ తరువాత నిర్వహించటంలో ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అప్పట్లో పని చేస్తున్న [[గుమ్మలూరి సత్యనారాయణ]] కృషి ఎంతగానో ఉన్నది. పంటలగురించి, కొత్తరకాల వంగడాలు, సస్యరక్షణ, వ్యవసాయ పద్ధతులగురించి రైతులకు చక్కగా వివరించే కార్యక్రమాలు ప్రసారం చేసి, ఆయా కార్యక్రమాల ద్వారా వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగపడే సమాచారాన్ని అందించేవారు. రైతులకు వారి భాషలో, అయా ప్రాంతాల యాసలలో, ఒక్కొక్క సారి అనుభవజ్ఞులైన రైతులతో సంభాషణలు పొందుపరచి కార్యక్రమాన్ని రక్తి కట్టించేవారు. ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు, రైతులకు తెలియచెప్పవలసిన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అందచేసేవారు. పంటల గురించే కాక, పశు సంరక్షణ, పాడి పశువులను సాకటం గురించి కూడ చక్కగా విశదపరచేవారు. ఇప్పుడు 'ఈ టీవీ'మొదలుకొని ఇతర టీవీ లలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలకు స్ఫూర్తి, మూలాలు, పంటసీమల కార్యక్రమమే అనటంలో అతిశయోక్తి లేదు.
 
===వయోజన విద్యా ప్రచారంలో===
పంక్తి 166:
 
 
Electromagnetic radiation [[radio propagation|travels]] by means of oscillating electromagnetic fields that pass through the air and the vacuum of space. It does not require a medium of transport. Information is carried by systematically changing ([[modulation|modulating]]) some property of the radiated waves, such as their amplitude or their frequency. When radio waves pass an electrical conductor, the oscillating fields induce an alternating current in the conductor. This can be [[demodulation|detected ]] and transformed into sound or other signals that carry information.
 
The word 'radio' is used to describe this phenomenon, and radio transmissions are classed as radio frequency emissions.
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు