రేనాటి చోళులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 6:
 
 
రేనాడు అని వ్యవహరింపబడిన ([[కడప]] మండలములోని [[పులివెందుల]], [[కమలాపురం]], [[ప్రొద్దుటూరు]], [[జమ్ములమడుగు]] తాలూకాలు, [[చిత్తూరు]] మండలములోని [[మదనపల్లి]], [[వాయల్పాడు]] తాలూకాలు) దేశ విభాగములో [[తెలుగు]] భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడ అంటారు. క్రీ. శ. 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దము వరకు [[చోళులు|చోళవంశమునకు]] చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా [[ఏరువ]], [[పొత్తపి]], [[నెల్లూరు]], [[కొణిదెన]], [[నిడుగల్లు]], [[కందూరు]] అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు. 7వ శతాబ్దములో పర్యటించిన [[హుఎన్ చాంగ్]] ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. మొదట 7,000 గ్రామాల పరిమితి గల దేశము 16వ శతాబ్దినాటికి [[ఉదయగిరి]] [[పెనుగొండ]] దుర్గముల మధ్య అధిక భాగము ఆక్రమించి ఉన్నది.
 
==రాజధాని==
పంక్తి 14:
==రాజవంశము==
 
రేనాటి చోళులు మొదట పల్లవరాజులకడ సామంతులుగా ఉండి స్వతంత్రులయ్యారు. శాసనాలను బట్టి కరికాలుని వంశములో నందివర్మ (క్రీ. శ. 550), అతని కుమారులు సింహవిష్ణు, సుందరనంద, ధనంజయవర్మ (క్రీ. శ. 575), కడపటివానికి మహేంద్రవిక్రమ (క్రీ. శ. 600), వానికి గుణముదిత, పుణ్యకుమార అను ఇద్దరు కొడుకులు పుట్టారు. పుణ్యకుమారుడు (క్రీ. శ. 625) హిరణ్యరాష్ట్రము ఏలాడు. అతని తర్వాత కొడుకు విక్రమాదిత్య (క్రీ. శ. 650), శక్తికుమారుడు (క్రీ. శ. 675), రెండవ విక్రమాదిత్యుడు (క్రీ. శ. 700), సత్యాదిత్యుడు, విజయాదిత్యుడు (క్రీ. శ. 750) పాలించారు. క్రీ. శ. 800లో శ్రీకంఠుడు రాజ్యము చేశాడు. దీనినిబట్టి రేనాటి చోళులు క్రీ. శ. 550 నుండి క్రీ. శ. 850 వరకు రాజ్యము చేశారని చెప్పవచ్చును.
 
==విశేషాలు==
 
కరికాలుని సంతతికిచెందిన వీరు కావేరీతీరమునగల చోళవంశమువారు. ధనంజయవర్మకు పూర్వమే వీరు తెలుగు దేశానికి వలస వచ్చిఉంటారు. కమలాపురం తాలూకాలో కలమళ్ళ గ్రామంలో ధనంజయవర్మ వేయించిన శిలాశాసనం వారి వంశపువారికే మొదటిదిగాక తెలుగు భాషకే మొదటి వాక్యరచనయై ఉన్నది. పగిలిఉన్న శిలాభాగములో "ఎరికల్ ముతురాజు ధనుంజయుడు రేణాండు ఏళన్" అనే వాక్య భాగము పూర్తి అర్థమిస్తున్నది. ‘ఎరికల్ ముతురాజు’ అనేది ఒక బిరుదు. లిపిని బట్టి శాసనము ఆరవ శతాబ్దము రెండవ సగము నాటిదని చెప్పుదురు.
 
 
రాజ్య నిర్వహణలో దేశము రాష్ట్రములుగా విభజింపబడెను. అందు హిరణ్యరాష్ట్రము (ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు) ఒకటి.
 
 
ముఖ్యమైన ఉద్యోగులకు దుగరాజు అను బిరుదు గలదు. క్రింది ఉద్యోగులలో పేరుల చివర 'కాలు' అను పదము ఉన్నది. రేవణకాలు, పుద్దనకాలు, ఎడ్లకాలు, చేలకాలు, తరట్లకాలు ఉదాహరణలు.
 
 
ప్రొద్దుటూరి దగ్గర పెన్నానది ఒడ్డున రామేశ్వరాలయమును "పోర్ముఖరామ" అను బిరుదు గల పుణ్యకుమారుడు కట్టించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రేనాటి_చోళులు" నుండి వెలికితీశారు