లక్క: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 27 interwiki links, now provided by Wikidata on d:q429659 (translate me)
చి Wikipedia python library
పంక్తి 4:
{{మొలక}}
లక్క (Shellac or Lac) ఒక రకమైన జుగురు పదార్ధం.
భారతదేశపు లక్క కీటకాన్ని లాక్సిఫెర్ లక్కా లేదా టకార్డియా లక్కా అంటారు. ఉష్ణ మండల దేశాల్లోని అడవుల్లో [[లక్క]] కీటకం ఎక్కువగా జీవుస్తుంది. ఈ కీటకానికి ముఖ భాగం పెద్దది గా వుండి దాంతో చెట్టు కొమ్మలను గుచ్చి రసం పీల్చు కునెందుకు వీలుగా ముఖ భాగాలుంటాయి. ఈ కీటకాలు [[మర్రి]], [[తుమ్మ]], [[రేగు]] చెట్లమీద ఉంటాయి. ఇవి లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి.
 
 
''''''లక్క పంట''' ఎలా పండిస్తారు.'''
[[లక్క]]ను కొన్ని దేశాలలో పంట గా పండిస్తున్నారు. లాక్సిఫెర్ లక్క అనె చిన్న కీటకాలు సహజమైన జిగురు పదార్థమే లక్క. ఈ కీటకాలు లార్వా దశలో వున్నప్పుడు కొన్ని రకాల చెట్ల కాండాలమీదకు చేరి వాటి రసాన్ని ఆహారంగా పీల్చి ఆతర్వాత జిగురు లాంటి పదార్తాన్ని విసర్జిస్తుంటాయి. ఈ పురుగు జీవిత కాలం ఆరు నెలలు మాత్రమె. ఒక చెట్టు నుండి ఏడాదికి రెండు [[లక్క పంట]]లను పండించ వచ్చు. ముందుగా ఆడ కీటకాలను చెట్ల మీదకు చేరుస్తారు. ఒక్కో పురుగు సుమారు వంద గ్రుడ్ల వరకు పెడుతుంది. సూర్య రస్మికి ఈ గ్రుడ్లు పొదగ బడి లార్వాలుగా మారి తల్లి నుండి వేరు పడి పాక్కుంటు చెట్ల కాండాలను చేరుకుంటాయి. ఈ లార్వాల లో ఆడ మగ కూడ వుంటాయి. ఇవి తమ పొడవాడి నోటి ద్వారా చెట్ల కాండం నుండి రసాన్ని పీల్చి తింటాయి. ఆ సమయంలో అవి తమ శత్రువుల నుండి రక్షణ కొరకు ఒక రకమైన జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఆ జిగురును తమ శరీరం చుట్టు కవచంగా ఏర్పరచుకొని శత్రువులనుండి రక్షణ పొందుతాయి. సుమారు ఎనిమిది వారాలకు ఈ లార్వాలు కీటకాలుగా మారుతాయి. కాని మగ పురుగులు మాత్రమె పూర్తి కీటకంగా రూపాంతరం చెందు తుంది. కాళ్లు రెక్కలు వచ్చిన మగ పురుగులు ఆడ పురుగుల వద్దకు వెళ్లి జత కడతాయి. కాని వెంటనే చనిపోతాయి. ఆడ పురుగులు కు కదలలేవు. వాటి నోటి బాగాలు మాత్రం అభివృద్ది చెందినా కాళ్లు, రెక్కలు రావు. ఈ ఆడ కీటకాలు ఆ కవచంలోనె గ్రుడ్లు పెట్టి అవి పొదగబడిన తర్వాత అందులోనె మరణిస్తుంది. ఇలా ఈ కీటకాల పై కవచంలాగ ఏర్పడి గట్టిపడిన జిగురు పదార్తమే లక్క. దీన్ని చెట్ల కొమ్మల నుండి సేకరించి దానిలో ఇరుక్కున్న కీటకాల భాగాలను, చెట్టుకొమ్మ బాగాలను వేరు చేసి శుబ్ర పరిచి కరిగించి బిళ్లల రూపంలోనో, లేదా కడ్డీల రూపంలో చేసి అమ్ముకుంటారు తయారి దారులు.
 
'''లక్కను ఎక్కడ పండిస్తారు'''
పంక్తి 14:
 
'''లక్క ఉపయోగాలు.'''
లక్క వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. దీన్ని పైంట్లలోను, వారీషులలోను, అద్దకం రంగుల్లోను, రబ్బరు ఉత్పత్తులలోను, పాలీష్ చేసె అన్ని వస్తువులలోను [[లక్క]] వాడు తున్నారు. అంతేగాక లక్క బొమ్మలు, లక్క గాజులు, కూడ తయారు చేస్తారు. బంగారు ఆబరణాలలో లక్క ఉపయోగం చాల వుంది. అంతే గాక ఏదేని వస్తువును ప్యాక్ చేచి భద్రత కొరకు దాన్ని [["సీల్'']] చేస్తారు. అది లక్కతోనె చేస్తారు. ఆ [[సీల్]] మీద ఆయా కంపెనీల, వ్యక్తుల ముద్ర వుంటుంది. పూర్వ కాలం రాజులు తమ ఉంగరం ముద్రను ఈ లక్కపై వేసే వారని తెలుసు. అదే విదంగా మహా భారతం లో కౌరవులు పాండవుల కొరకు లక్క ఇంటిని నిర్మించి ఇచ్చి వారిని దహించ డానికి దానికి నిప్పు పెట్టిన సంఘటన అందరికి తెలిసిందె. ఈ లక్క చాల సులబంగా మండి పోతుంది.
 
==జీవిత చక్రం==
మగ లక్క కీటకం 1.2 - 1.5 మి.మీ. పొడవుంటుంది. ఇవి గాలిలో స్వేచ్చగా ఎగురుతూ మొక్కల స్రావాలమీద బతుకుతాయి. ఇవి మూడు జతల కాళ్ళను, ఒక జత పల్చని రెక్కలను, గుచ్చి పీల్చుకొనే ముఖ భాగాలను కలిగి ఉంటాయి. దీనిలో తల, వక్షం, ఉదరం, ఒక జత కండ్లు, ఒక జత స్పర్శ శృంగాలు కనిపిస్తాయి. ఇవి చాలా స్వల్పకాలం జీవించి, సంపర్కానంతరం చనిపోతాయి.
 
లక్కతో నిర్మించిన గదిలో ఆడ లక్క కీటకం నివసిస్తుంది. ఈ కీటకం అధో చర్మీయ గ్రంథులనుంచి [[లక్క]] అనే గుగ్గిలం వంటి పదార్ధం ఉత్పత్తి అవుతుంది. ఈ లక్కా గృహ నివాసం వల్ల కీటకానికి శత్రువుల బారి నుంచి రక్షణ లబిస్తుంది. సంపర్కం జరిగాక ఆడ కీటకం వందల కొద్ది అండాలను గదిలో పెడుతుంది. అండాల నూచి సరూప శాబకాలు ఏర్పడతాయి. వీటికి రెక్కలు ఉండవు. ఇవి మొక్కలకు చెందిన రసాల మీద జీవిస్తాయి. ఒక్కొక్క సరూప శాబకం తన చర్మంలో ఉన్న గ్రంధుల నుంచి ఒక లక్క కవచాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఇలా శాబకాలు తయారుచేసిన కవచాలన్నీ ఒక 'లక్కా గృహం'గా ఏర్పడుతుంది. దీనిలో సరూప శాబకాలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వీటిలో కొన్ని మగ కీటకాలుగా పెరిగి ఎగిరి పోతాయి. మిగిలినవి ఆడ కీటకాలుగా మారి లోపలే ఉంటూ లక్కను స్రవిస్తూ కొత్త గృహాలను తయారు చేసి వాటిలో అండాలను పెట్టడం ఆరంబిస్తాయి. 6 నుంచి 8 వారాలు గడిచాక సరూప శాబకాలు మూడు సార్లు నిర్మోచనం జరుపుకొని రూప విక్రియ చెందుతాయి.
"https://te.wikipedia.org/wiki/లక్క" నుండి వెలికితీశారు