రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చిత్రలేఖనం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
పంక్తి 1:
'''రేఖాచిత్రం''' (ఆంగ్లం:Drawing) అనునది వివిధ రకాల చిత్రకళకి సంబంధించిన పరికరాలని ఉపయోగించి ద్విపరిమాణపు మాధ్యమం (two dimensional medium) పై చిత్రాన్ని ఏర్పరచే ఒక దృశ్య కళ. గ్రాఫైట్ పెన్సిళ్ళు, కలం మరియు సిరా, కుంచెలు, మైనపు పెన్సిళ్ళు, రంగు పెన్సిళ్ళు, కాల్చిన బొగ్గు, ఇరేజర్లు, మార్కర్లు, స్టైలస్ లు, సిల్వర్ పాయింట్ వంటి ప్రత్యేక లోహాలు వంటి పరికరాలని రేఖాచిత్రాలకి ఉపయోగించటం జరుగుతుంది. రేఖాచిత్రాలని చిత్రీకరించే కళాకారులని ఆంగ్లంలో '''డ్రాఫ్ట్స్ మెన్''' (Draftsman) గా వ్యవహరిస్తారు.
 
ఒక ఉపరితలం పై కావలసినంత పదార్థాన్ని విడుదల చేయటం వలన ఆ ఉపరితలంపై కంటికి కనబడేలా గుర్తు ఏర్పడుతుంది. ఉపరితలాలుగా అట్ట, ప్లాస్టిక్, తోలు, వస్త్రం, రాత బల్ల లు చిత్రలేఖనానికి విరివిగా ఉపయోగించిననూ, కాగితమే చిత్రలేఖనానికి ప్రధానాధారంగా వ్యవహరించినది. మొత్తం మానవ చరిత్రలో రేఖాచిత్ర మాధ్యమం ప్రముఖ మరియు ప్రాథమిక ప్రజాభిప్రాయాన్ని వెలిబుచ్చటానికి ఉపయోగపడినది. ఆలోచనలను, ఉద్దేశ్యాలను, భావాలను వ్యక్తీకరించటానికి రేఖాచిత్రం అత్యంత సరళమైన మరియు సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడినది. కావలసిన పరికరాలు విరివిగా లభ్యమవటంతో రేఖాచిత్రకళ అతి సాధారణ కళల్లో ఒకటిగా అవతరించినది.
 
[[వర్గం:చిత్రలేఖనం]]
"https://te.wikipedia.org/wiki/రేఖాచిత్రం" నుండి వెలికితీశారు