వంద సంవత్సరాల యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి (Script) File renamed: File:Crécy jean froissard.jpgFile:Crécy - Grandes Chroniques de France.jpg fix misleading name -- manuscript is *not* part of Froissart's histories
చి Wikipedia python library
పంక్తి 1:
[[File:Hundred Years' War montage.jpg|thumb|300px|వంద సంవత్సరాల యుద్ధం]]
ఈ వంద సంవత్సరాల యుద్ధం ఫ్రెంచి సింహాసనం మీద ఆధిపత్యం కోసం ఇంగ్లాండ్ మరియు ఫ్రానుసు రాజవంశాల మధ్య 1337 నుంచి 1453 దాకా అనేక పోరాటాలు జరిగాయి. వీటినే వంద సంవత్సరాల యుధ్ధం అంటారు. వీరి మిత్ర రాజ్యాలు కూడా దీనిలోకి లాగడం జరిగినది. దీనికి సంబంధించిన మూలాలు ఇంగ్లాండ్ రాజయిన విలియం ది కాంక్వెరర్ కాలములో తలెత్తిన ఒక రాజ్య సంబంధమైన వివాదములోనే ఉన్నాయి. 1033లో విలియం ఇంగ్లాండు రాజ్యమునకు రాజయినపుడు ఫ్రానుసు రాజ్య భాగమైన నార్మండీ సంస్థానాన్ని తనతో పాటే ఉంచుకున్నాడు. దీని వలన నార్మండీ పాలకులు ఇతర దేశానికి రాజులయినప్పటికీ వారు ఫ్రానుసు చక్రవర్తికి తమ నివాళులు అర్పించేవారు. కానీ 1337లో ఆరవ ఫిలిఫ్ ఫ్రానుసు రాజుగా ఉన్న కాలములో ఇంగ్లాండు రాజు మూడవ ఎడ్వర్డ్ దీనికి నిరాకరించాడు. దీనితో కోపించిన ఆరవ ఫిలిఫ్ ఆక్వాంటైన్‌లోని ఎడ్వర్డ్ భూములను ఆక్రమించుకున్నాడు.
 
దీనికి వ్యతిరేకంగా ఫ్రానుసుకు ఫిలిప్‌గాక తానే నిజమైన రాజునని ప్రకటించుకున్నాడు. 1328లో ఎడ్వర్డ్ మేనమామ ఫ్రెంచి పాలకుడు అయిన నాలుగవ ఛార్లెస్ మగ సంతానం లేకుండా మరణించాడు. ఎడ్వర్డ్ ఫ్రానుసుకు చెందిన నాలుగవ ఫిలిప్ కూతురు నాలుగవ చార్లెస్ చెల్లెలు ఇసబెల్లా కుమారుడు. ఈ విధంగా చార్లెస్‌ అతి దగ్గరి బంధువు. కానీ చనిపోయిన రాజు దాయాది, నాలుగవ ఫిలిప్ చిన్న తమ్ముడు వాలోయిస్ కౌంట్ అయిన చార్లెస్ కుమారుడు ఆరవ ఫిలిప్ ఫ్రానుసు సింహాసనాన్ని అధిశష్టించాడు. దీనికి ఆధారం సాలిక్ లా. దీని ప్రకారం ఆడ పిల్లల వంశక్రమము ద్వారా వచ్చే మగపిల్లలు సింహాసనానికి అనర్హులు. ఈ విధంగా ఈ వారసత్వ తగాదా తరతరాలుగా ఇంగ్లాండు ఫ్రానుసు రాజుల మధ్య యుధ్ధాలకు కారణంగా మారింది.
 
ఈ యుధ్ధం రకరకాల కారణాల వల్ల చారిత్రక ఫ్రాధన్యతను సంతరించుకున్నది. నిజానికి ఇది వారసత్వ తగాదా అయినప్పటికి ఇంగ్లాండు మరియు ఫ్రానుసు జాతీయవాదము అభివృధ్ధి చెందడానికి తోడ్పడింది అని చెప్పవచ్చు. ఈ యుధ్ధంలో కొత్త రకాల ఆయుధాలు వ్యూహాలను ఉపయోగించడం జరిగింది. కానీ అప్పటి దాకా ఫ్యూడల్ సైన్యాలలో భారీ ఆశ్విక దళాళలకు ఎక్కువ ఫ్రాధాన్యం ఉండేది. వాటి స్థానాన్ని కొత్త ఆయుధాలు ఆక్రమించాయి. పశ్చమ రోమన్ కాలము తరువాత ఇంత కాలానికి యూరప్‌లో మొదటి సారిగా స్థిరమైన సైన్యన్ని ఏర్పాటు చేశారు. దీని వలన రైతాంగము పాత్ర మారిపోయింది. వీటన్నిటి వలన, అంతేగాక ఇది కొనసాగిన వ్యవధి వలన దీనిని మధ్య యుగములో జరిగిన యుధ్ధాలలో చాలా ప్రాముఖ్యత కలదిగా గుర్తించబడినది.యుధ్ధములో పాల్గొన్న పక్షాలలో కాలక్రమేణా ఇంగ్లీషు రాజకీయ శక్తులు ఆర్థికముగా చాలా భారాన్ని మోయవలసి వచ్చింది. ఈ యుధ్ధము వలన ఖండాంతర భూభాగముల నష్టము వలన ఆంగ్లేయ ఉన్నత వంశస్తులలో అసంతృప్తి చెలరేగి, గులాబీ యుధ్ధాలు అనబడే అంతర్యుధ్ధాలకు దారితీసింది. ఫ్రానుసులో అంతర్యుధ్ధాలు, ప్రాణాంతక అంటువ్యాధులు, కరువులు, కిరాయి హంతకుల బందిపోటు ముటాలు జనాభాను విపరీతంగా తగ్గించాయి.
పంక్తి 8:
[[File:Hommage of Edward I to Philippe le Bel.jpg|thumb|180px|నాలిగవ ఫిలిప్(కూర్చున్న వ్యక్తి)కు వెధేయతను ప్రదర్శిస్తున్న ఇంగ్లాండుకు చెందిన ఒకటవ ఎడ్వర్డ్. అక్వైటైన్ ప్రభువుగా ఎడ్వర్డ్ కూడా ఫ్రానుసు రాజుకు సామంతుడు.]]
===ఆంగ్లేయ రాజులు మరియు వారి ఖండాంతర సంస్థానాధిపత్యం: 1066 - 1331===
1066నాటి నార్మన్ ఆక్రమణ తరువాత ఇంగ్లాండును ఆంగ్లో - నార్మన్ వంశస్థుల పాలించారు. కానీ 1154లో అంజూకు చెందిన జియోఫ్రే మరియు మాటిల్దా రాణి కుమారుడైన హెన్‌రీ (విలియం ది కాంక్వెరర్ మునిమనుమడు) రాజు రెండవ హెన్‌రీ పేరుతో ఇంగ్లాండుకు మొదటి ఆంజీవియన్ రాజయినపుడు వీరిపాలన ముగిసింది<ref name=bartlett22>{{harvnb|Bartlett|2000|p=22}}</ref> . ఇప్పుడు ఆంజీవియన్ రాజ్యముగా మారిన ఇంగ్లాండు రాజుగా ఫ్రానుసు రాజు కంటే ఎక్కువగా ఫ్రానుసు భూములను ప్రత్యక్షముగా పాలించారు. కాని సంస్థాన పాలకులుగా వీరు ఫ్రానుసు రాజుకు సామంతులుగా తమ నివాళులు అర్పించారు. కానీ 11వ శతాబ్ధము తరువాత ప్రభువులకు ఎక్కువ స్వయంప్రతిపత్తి లభించటం వలన ఈ సమస్య పరిష్కారమైంది.<ref name=bartlett17>{{harvnb|Bartlett|2000|p=17}}</ref>
 
ఇంగ్లాండుకు చెందిన జాన్ ఆంజీవియన్ ప్రాంతాలను రాజు ఒకటవ రిచర్డ్ నుండి వారసత్వంగా పొందాడు. అయినప్పట్టీకీ న్యాయపరంగా, సైనికపరంగా జాన్ బలహీలతలను ఆసరాగా తీసుకుని ఫ్రానుసుకు చెందిన రెండవ ఫిలిప్ 1204 నాటికి దాదాపు అంజీవియన్ ఖండాంతర భూభాగాలన్నింటిని ఆక్రమించుకున్నాడు. జాన్ పాలనాకాలములో, బొవియన్ యుధ్ధం (1214), సెయింటాంగే యుధ్ధము (1242) మరియి చివరగా సెయింట్ - సార్డోస్ యుధ్ధాల(1324) వలన ఇంగ్లాండు నార్మండీని పూర్తిగా పోగొట్టుకుంది. ఇంగ్లీషువారి ఆధీనంలోని ప్రాంతాల సంఖ్య గాస్కోనీలోని కొన్న్ రాష్ట్రాలకు తగ్గిపోయింది.<ref name=ehistory>{{harvnb|Gormley|2007}} [http://ehistory.osu.edu/osu/archive/hundredyearswar.cfm?CFID=12106913&CFTOKEN=48989585&jsessionid=463076a37003e50bfe0063343a5d3c64687b] Ohio State University</ref>
పంక్తి 14:
ఫ్రానుసు రాజ్య న్యాయసూత్రాల ప్రకారం సింహాసనము ఆడపిల్లల వారసులకు సంక్రమించదు. ఇది కేవలం పాత కాలం నుంచి వస్తున్న ఒక ఆచారం. 1316లో పదవ లూయిస్, 1322లో ఐదవ ఫిలిప్, 1328లో నాలుగవ చార్లెస్ ల మరణానంతరము ఆడపిల్లల వారసత్వ హక్కుల ప్రశ్న తలెత్తింది. కానీ కానీ ప్రతిసారీ మగ వారసులకు ప్రాధాన్యం లభించింది.<ref name=brissaud329>{{harvnb|Brissaud|1915|pp=329–330}}</ref>
 
1328లో ఫ్రానుసు రాజు నాలుగవ చార్లెస్ మరణించినప్పుడు ఆయన కూతుర్లను మాత్రమే వదిలి వెళ్ళాడు, ఆయనకు అతిదగ్గర మగ బంధువు ఇంగ్లాండుకు చెందిన మూడవ ఏడ్వర్డ్. చనిపోయిన చార్లెస్‌కు ఎడ్వర్డ్ తల్లి ఇసబెల్లా చెల్లెలు. ఈ విధంగా తను తల్లి ద్వారా వారసత్వంగా హక్కును పొందాండు. కానీ తాను ఆడపిల్ల కావడం వల్ల పొందలేని హక్కు తన పిల్లలకు మాత్రం ఎలా వస్తుందన్న ప్రశ్న తలెత్తింది. అంతేకాకుండా ఫ్రానుసు ఉన్నత వంశస్తులు ఇంగ్లీషు రాజు తమను పాలించడాన్ని అంగీకరించలేకపోయారు. జమిందారులు, మతాథికారులు మరియు పారిస్ యూనివర్శిటిల సమావేశములో తల్లి ద్వారా వారసత్వాన్ని పొందిన మగ పిల్లలకు సింహాసనాన్ని అధిష్టించే అర్హత లేదని తీర్మానించారు. కాబట్టి మగ వారసుల ద్వారా సింహాసనానికి దగ్గర వారసుడు వాలోయిస్ జమిందారు చార్లెస్ మొదటి దాయాది ఫిలిప్, నాలుగవ ఫిలిప్ పేరుతో సింహాసనాన్ని అధిష్టించాలని తీర్మానించారు. 1340లో సాలిక్ లా ప్రకారం మగపిల్లలు తమ తల్లుల ద్వారా వారసత్వాన్ని పొందకూడదని అవిగ్నాన్ పోపులు దీనిని బలపరిచారు.<ref name=brissaud329 /><ref name=orton872>{{harvnb|Previte-Orton|1978|p=872}}</ref>
 
==యుధ్ధానికి ప్రారంభము: 1337-60==
పంక్తి 30:
 
===ముగిసిన విధేయత===
1337 ఏప్రిల్ మాసాంతములో ఇంగ్లాండ్ నుండి వచ్చిన దూతలను కలవడానికి ఆరవ ఫిలిప్ నిరాకరించాడు. 1337 ఏప్రిల్ 30 నుండి ఆయుధాలు ధరించాలని ఫ్రానుసు అంతటా ఆదేశించడం జరిగినది. 1337 మేలో ఫిలిప్ ఒక గొప్ప సమావేశాన్ని పారిస్‌లో ఏర్పాటుచేశాడు. దీనిలో మూడవ ఏడ్వర్డ్ సామంతునిగా తన భాధ్యతలను ఉల్లంగించాడని అందువలన అక్వాంటయిన్ సంస్థానాన్ని, నిజానికి గాస్కోనీని రాజు తన చేతులలోకి తీసుకోవాలని తీర్మానించారు. అంతేగాక అతను రాజు బధ్ధశత్రువైన రాబర్ట్ డి ఆర్టాయిస్‌కు ఆశ్రయం కల్పించాడు. ఇంకాచెప్పని కారణాలు అనేక ఉన్నాయి.<ref name=sumption184>{{harvnb|Sumption|1991|p=184}}</ref> ఇలా అక్వాంటయిన్‌ను జప్తు చేయడాన్ని సింహాసనముపై ఫిలిప్ హక్కును ప్రశ్నించడం ద్వార సవాలు చేశాడు.నాలుగవ ఛార్లెస్ మరణించినపుడు ఎడ్వర్డ్ ఫ్రెంచి సింహాసనంపై వారసత్వానికి తనకు గల హక్కును గురుచేశాడు. అతను నాలుగవ ఫిలిఫ్ కూతురు నాలుగవ ఛార్లెస్ సోదరి ఇసబెల్లా కుమారుడు. 1329లో ఆరవ ఫిలిప్‌ను ఏడ్వర్డ్ స్వయంగా కలసి నివాళులర్పించడం ద్వారా ఈ వాదము విస్మరించబడినది. అయితే 1340లో ఏడ్వర్డ్ తన వాదనను పునరుధ్ధరించాడు. అధికారికంగా ప్రానుసు రాజు బిరుదును ఫ్రానుసు రాజచిహ్నాలని ధరించడం ప్రారంభించాడు.<ref name=prestwich149>{{harvnb|Prestwich|2003|pp=149–150}}</ref>
 
1340 జనవరి 26న ఫ్లాండర్స్ జమీందారు సవతి తమ్ముడైన గయ్ అధికారికంగా మూడవ ఏడ్వర్డ్‌ రాజుగా గుర్తించాడు. గెంట్, ప్రెస్, బ్రూగ్స్‌లలోని పౌరపాలనా సంఘాలు ఏడ్వర్డ్‌ను ఫ్రానుసు రాజుగా అంగీకరించాయి. ఏడ్వర్డ్‌ లక్ష్యం ఏమిటంటే సముద్రతీరప్రాంతాలలో తన పలుకుబడిని పెంచుకోవడం. అతని మద్దత్తుదారులు తాము నిజమైన ఫ్రానుసు రాజు విశ్వాస పాత్రులమని చెప్పుకున్నారు. కానీ వారు ఫ్హిలిప్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. 1340 ఫిబ్రవరిలో ఇంకా ఎక్కువ నిధులు సకూర్చుకోవటానికి, తన రాజకీయ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఏడ్వర్డ్‌ ఇంగ్లాండు తిరిగి వెళ్ళాడు.<ref name=prestwich307>{{harvnb|Prestwich|2005|pp=307–312}}</ref>
[[File:BattleofSluys.jpeg|thumb|left|1470లో బ్రూగ్ రచించిన ఫ్రియోసార్ట్స్ క్రానికల్ రాతప్రతిలో స్లయ్స్ యుధ్ధము]]
 
ఫ్లాండర్స్‌తో సంభంధాలు ఇంగ్లీషు వారి ఊలు వ్యాపారముతో కూడా ముడిపడి ఉన్నాయి. తమ ఊలు వ్యాపారము ఫ్రాధాన్యతకు చిహ్నముగా తన ఛాన్స్‌లర్‌ను మంత్రుల సభలో ఊలు ఆసనముపై కూర్చోవాలని ఆదేశించాడు.<ref name="friar480">{{harvnb|Friar|2004|pp=480–481}}</ref> ఆసమయములో సస్సెక్స్ ఒక దానిలోనే 1,11,000ల ఓడలు ఉండేవి.<ref name="darby160">{{harvnb|Darby|1976 New Edition|p=160}}</ref>మధ్య యుగాలనాటి పెద్ద ఆంగ్లేయ మటాలు పెద్ద మొత్తంలో ఊలును తయారుచేసేవి. దీనిని యూరప్ అంతటా అమ్మేవారు. తరతరాలుగా ప్రభుత్వాలు వీటిపై పన్ను వేసి పెద్ద మొత్తంలో లాభాన్ని పొందేవి.<ref name="friar480"/> ఫ్రానుసు నావికా శక్తి వలన ఆర్థికంగా నష్టాలు ఆరంభమయ్యాయి. ఫ్లాండర్స్‌తో ఊలు వ్యాపారము, గాస్కోనీతో వైన్ వ్యాపారాలు తగ్గిపోయాయి.<ref name=sumption188>{{harvnb|Sumption|1991|pp=188–189}}</ref><ref name=sumption233>{{harvnb|Sumption|1991|pp=233–234}}</ref>
 
===ఇంగ్లీష్ చానల్ బ్రిటానీలలో ఆకస్మిక పరిణామాలు===
పంక్తి 41:
[[File:Crécy - Grandes Chroniques de France.jpg|thumb|200px|క్రేసీ యుధ్ధము, 1346]]
 
వారసత్వము కోసం తలెత్తిన వివాదము వలన 1341లో బ్రెటాన్ వారసత్వ యుధ్ధం మొదలైంది. ఇందులో ఎడ్వర్డ్ మోంట్‌ఫోర్ట్‌కు చెందిన జాన్‌ను, ఫిలిప్ బ్లావ్స్‌కు చెందిన ఛార్లెస్‌కు మద్దత్తు పలికారు. తరువాత కొన్ని సంవత్సరముల వరకు బ్రిటానీలో జరుగుతున్న పోరాటముపై దృష్టి కేంద్రీకరించారు. వాన్నెస్ నగరము చాలా సార్లు చేతులు మారింది. తరువాత గాస్కోనీలో జరిగిన ఘర్షణలలో ఇరుపక్షాలకు మిశ్రమ ఫలితాలు లభించాయి.<ref name=rogers88 />
 
===క్రేసీ యుధ్ధము, కలాయిస్ ఆక్రమణ===
పంక్తి 101:
* [http://www.yecompaynyeofcheualrye.com/ The Company Of Chivalry: Re-enactment Society at the time of the 100 Years War]
* Jean Froissart, [http://www.fordham.edu/halsall/source/froissart1.html "On The Hundred Years War (1337–1453)"] from the [[Internet Medieval Sourcebook]]
* [http://www.medievalsoldier.org/index.php Online database of Soldiers serving in the Hundred Years War]
[[వర్గం:ప్రపంచ చరిత్ర]]
[[వర్గం:ఫ్రాన్స్]]